వేలంలో భారీ ధర.. ధోనీకి హ్యాపీనా, బాధేనా..!

మొన్నటి వరకూ ఐపీఎల్ నుంచి ధోనీకి ఎంత ఆదాయం వస్తోంది.. అనేది ఒక మిస్టరీనే! ఐపీఎల్ తొలి సీజన్ లో ధోనీ వేలంలోకి వచ్చాడు. అప్పుడు చెన్నై యాజమాన్యం ఆయనను సొంతం చేసుకొంది. ఆ…

మొన్నటి వరకూ ఐపీఎల్ నుంచి ధోనీకి ఎంత ఆదాయం వస్తోంది.. అనేది ఒక మిస్టరీనే! ఐపీఎల్ తొలి సీజన్ లో ధోనీ వేలంలోకి వచ్చాడు. అప్పుడు చెన్నై యాజమాన్యం ఆయనను సొంతం చేసుకొంది. ఆ తర్వాత చెన్నై ప్రాంచైజ్ యజామాని ధోనీని వదల్లేదు! ఈ ఎనిమిదేళ్ల లో అనేక మంది క్రికెటర్లు తమ తమ జట్లను మారారు. అయితే ధోనీ మాత్రం చెన్నైకే పరిమితం అయ్యాడు. అదేమంటే.. ప్రాంచైజ్ లు ఒకరిద్దరు క్రికెటర్లతో ఇలాంటి ఒప్పందాలు చేసుకోవచ్చని ఐపీఎల్ చట్టంలో ఉందన్నారు. ఆ తర్వాత ధోనీ – శ్రీనివాసన్ ల మధ్య ఉన్న ఒప్పందం గురించి రకరకాల రూమర్లు వచ్చాయి. ధోనీతో చెన్నై టీమ్ కు ఉన్న ఒప్పందంలో గోప్యత ఇలాంటి రూమర్లకు అవకాశం ఇచ్చింది.

స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో చెన్నై జట్టు యాజమాన్య సభ్యులకు సంబంధంతో ఆ జట్టు ఐపీఎల్ నుంచి బహిష్కరణకు గురైంది. దీంతో ధోనీ ని కూడా తప్పనిసరిగా వేలంలోకి వచ్చేశాడు. తాజాగా పూణే టీమ్ కు ధోనీని కొనేసుకొంది. వచ్చే సీజన్ లో ధోనీ ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. రికార్డు స్థాయిలో ధోనీకి 12.5 కోట్ల రూపాయలను వెచ్చిస్తూ పూణే టీమ్ ధోనీని సొంతం చేసుకొంది. మరి ఇది పెద్దమొత్తమే అయినా.. ధోనీకి చెన్నై టీమ్ తో ఉన్న ఒప్పందాల లెక్క బయటకు తెలీదు కాబట్టి.. ఆయనకు ఇది లాసో.. లాభమో కూడా బయటకు అర్థం అయ్యే అవకాశాలు తక్కువ. 

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే..ఇన్ని రోజులూ చెన్నైకే ప్రాతినిధ్యం వహించిన రైనాకు కూడా 12.5 కోట్ల పలికింది. రాజ్ కోట్ ప్రాంచైజ్ రైనాను ఈ మొత్తానికి సొంతం చేసుకొంది. మరి.. ధోనీతో పోలిస్తే.. రైనా తక్కువ స్థాయి ఆటగాడే అవుతాడు. మరి అతడీకి, ధోనీకి సమానమొత్తం అంటే ఇదీ చెప్పుకోవాల్సిన అంశమే.

ఇక మిగతా క్రికెటర్లలో.. వరస సెంచరీలో ఫామ్ లో కనిపించిన రహానే ను పూనే టీమ్ ఏకంగా 9.5 కోట్లతో సొంతం చేసుకొంది. స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ ను కూడా ఈ టీమ్ 7.5 కోట్లతో సొంతం చేసుకుంది. రవీంద్ర జడేజాను రాజ్ కోట్ యాజమాన్యం 9.5 కోట్లు పోసి కొనుక్కొంది. చెన్నైకే ప్రాతినిధ్యం వహించిన మెక్ కల్లామ్ ను కూడా రాజ్ కోట్ టీమ్ ఓనర్లు 7.5 కోట్లు పాడి కొనుక్కొన్నారు. మొత్తానికి మొన్నటి వరకూ చెన్నై టీమ్ కు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లకు రాబోయే రెండేళ్లకూ భారీ భారీ మొత్తాలు చేతికందే పంట పండింది!