విమర్శకులకు బ్యాట్‌తో ఎలా సమాధానం చెప్పాలో, క్రికెట్‌కి గుడ్ బై చెబుతున్న సచిన్ నుంచి నేర్చుకున్నట్టున్నాడు.. కెరీర్ తొలి నాళ్ళలో ఎదుర్కొన్న విమర్శలకు ఇప్పుడు సమాధానం చెబుతున్నాడు యంగ్ క్రికెటర్ రోహిత్ శర్మ. టీ`20 స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నా, వన్డేల్లో చోటు గగనమైపోయిన పరిస్థితుల్లో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, సెహ్వాగ్, సచిన్‌లకు మాత్రమే సాధ్యమైన డబుల్ సెంచరీని రోహిత్ శర్మ తన ఖాతాలో వేసుకున్నాడు.
వన్డేల్లో రోహిత్ శర్మ దూకుడు చూసి, అతనికి టెస్టుల్లో అవకాశం కల్పిస్తే.. తొలి మ్యాచ్‌లోనే దుమ్ము రేపేశాడు. రెండో మ్యాచ్‌లోనూ సూపర్ సెంచరీ నమోదు చేసిన రోహిత్ శర్మ, టీమిండియా భారీ స్కోర్ సాధించడానికి కారణమయ్యాడు. వెస్టిండీస్‌తో జరుగుతోన్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్ సాధించింది.
రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో, తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆధిక్యం 350 పరుగులు దాటింది. వన్డేలకు ధీటుగా రోహిత్ టెస్ట్ ఇన్నింగ్స్ అదరగొడ్తుండడం గమనార్హం. 85కి పైగా రన్ రేట్‌తో రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. సచిన్ రిటైర్‌మెంట్‌తో ఖాలీ అయ్యే ప్లేస్‌లోకి రోహిత్ శర్మ కుదురుకుపోవడం దాదాపు ఖాయంగానే కన్పిస్తోంది అతని ఫామ్ చూస్తోంటే.