సెక్స్ అంటే కేవలం రెండు శరీరాల కలయిక మాత్రమే కాదు, అంతకు మించి ఎంతో! దాంపత్యబంధంలోని విశ్వాసం, స్పాంటేనిటీ, నమ్మకం, ఎంజాయ్ మెంట్, ఇంకా ఎమోషనల్ బాండింగ్… ఇలా శృంగారానికి ఎన్నో నిర్వచనాలను ఇవ్వొచ్చు.
శృంగారం అంటే చేసేంత సేపే కాదు, జరిగిన తర్వాత కూడా అదొక మధురమైన అనుభూతిగా మిగులుతుంది. అయితే ఈ విషయంలో పరస్పరం అవగాహనతో ఉండటమే అసలు కథ. ఒక్క మాటలో చెప్పాలంటే.. శృంగారాన్ని ఒక మరపురాని జ్ఞాపకంగా, దాన్నొక మధురానుభూతిగా మలుచుకోవడం అందరికీ కుదిరే పని కాదు!
ఇక్కడ ప్రధానమైన అంశం కోరిక, సామర్థ్యాలు కాదు. కోరిక, సామర్థ్యం వంటి అంశాల కన్నా.. పరస్పరం ఇష్టం, శృంగార సమయంలో యాక్టివ్ గా ఉండటం, క్రియేటివ్ గా వ్యవహరించడం, స్పాంటేనివ్ గా ఉండటం… ఇవన్నీ శృంగారాన్ని అందంగా మలుస్తాయి. దాన్నొక నిత్య మధురానుభూతిగా మారుస్తాయి.
ప్రత్యేకించి ఈ మధురానుభూతికి తాళం చెవులు స్త్రీ వద్ద కూడా ఉంటాయి. భార్య తనతో చనువుగా ప్రవర్తించడంలో కూడా తనే గైడ్ గా వ్యవహరించాలని కోరుకునే మగాళ్లు ఎవరైనా ఉంటారేమో, వాళ్లను పక్కన పెడితే, శృంగారాన్ని రసవత్తరంగా మార్చే బాధ్యతను తీసుకునే మగువ మగాడి మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటుంది.
శృంగారం గురించి స్త్రీకి తెలిసి ఉండటం అంటే.. దీన్ని ద్వంద్వర్థంగా తీసుకుంటే చేసేదేం లేదు. దాన్ని కొందరు బూతుగా తీసుకోవచ్చు. కొందరు అది వేశ్యల పని అని అనుకోనూవచ్చు! అయితే.. ఆ తరహాలో ఆలోచించే వారి శృంగార జీవితాలు ఆ తరహాలోనే ఉండవచ్చు.
కానీ మగాడిని ఎలా రంజింపజేయాలో, బెడ్ మీద ఉన్నంత సేపూ ఎలా ఉంటే..అతడు మళ్లీ మళ్లీ దాన్నే తలుచుకుంటాడో తెలిసినట్టుగా వ్యవహరించే అతివలు మాత్రం అద్భుతాలే! ఈ విషయంలో పూర్వానుభవాలో, మరొకరి గైడెన్సో ఉండదు.. జస్ట్ అదో స్పాంటేనిటీ! ఆ తరహా స్పాంటినేటీ ఉన్న అతివతో శృంగార శాశ్వత మధురానుభూతిగా మిగిలిపోతుంది.
తమ గురించి తమ కు ఎలాంటి చిన్న చూపు లేని అతివలే శృంగారంలో పార్ట్ నర్ ను కూడా రంజింపచేయగలరని అంటోంది ఒక అధ్యయనం. అలాగే సెక్స్ కంటూ ప్రత్యేక సమయాన్ని కేటాయించుకోవడం, దానికి సమయం సందర్భం అంటూ గిరిగీసుకునే వారికి సెక్స్ ను ఆస్వాదించేంత మనసు లేదనే మరో అధ్యయనం చెబుతోంది.
మొహమాటాలు పెట్టుకోవడం, మనస్ఫూర్తిగా బయట పెట్టకపోవడం.. బెడ్ మీద ఉన్నప్పుడు మాత్రమే సెక్స్ గురించి ఆలోచించే వాళ్లు శృంగారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రసవత్తరంగా, మధురానుభూతిగా మార్చుకోలేరని స్పష్టం అవుతోంది. శృంగారం అంటే ప్రేమ, ఇష్టాన్ని వ్యక్తీకరిచండం అని భావించే స్త్రీలే ఈ విషయంలో తమే ఇన్షియేటివ్ గా తీసుకుని మధురానుభూతిని అందించి, పంచుకోగలరని అధ్యయనాలు చెబుతున్నాయి.