తమిళ హీరోతో అనుపమ పెళ్లి?

అనుపమ-ధృవ్ ల నడుమ మంచి సాన్నిహిత్యం వుందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

మన ఇంటి అమ్మాయిలా చూడముచ్చటగా వుంటుంది అనుపమ పరమేశ్వరన్. వృత్తి పరంగా మంచి సినిమాలు ఎంచుకుని చేస్తూ ముందుకు వెళ్తోంది. సోషల్ మీడియాలో కూడా హద్దులు మీరకుండా సెలక్టివ్ గా పోస్ట్ లు పెడుతుంది.

సినిమా ఇండస్ట్రీలో ఎంత వరకు వుండాలో అంత వరకు వుంటూ, అనుపమ అంటే ఓ మంచి అమ్మాయి అని పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ అనుపమ పెళ్లికి రెడీ అవుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తలు నిజమా.. గ్యాసిప్ నా అన్న సంగతి అలా వుంచితే పెళ్లి కొడుకు కూడా మంచి కుటుంబానికి చెందిన కుర్రాడే. ధృవ్ విక్రమ్. వెర్సటైల్ సీనియర్ హీరో విక్రమ్ కుమారుడు. అనుపమ-ధృవ్ ల నడుమ మంచి సాన్నిహిత్యం వుందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. తెగ వార్తలు వండి వారుస్తోంది. దీనికి చిన్న ట్విస్ట్ కూడా వుంది.

ఆ ఇద్దరు కలిసి ఓ సాంగ్స్ ప్లే లిస్ట్ షేర్ చేసుకుంటున్నారని, దానికి డీపీగా తామిద్దరు మంచి ముద్దు పెట్టుకుంటున్న ఫొటొను వుంచుకున్నారని, ఇదంతా ఎలాగో లీక్ అయిందని తెలుస్తోంది. అదిగో అక్కడి నుంచి వార్తలు వినిపించడం మొదలైంది. పైగా ఇద్దరూ కలిసి సినిమా కూడా చేస్తున్నారు. వయసులో వున్నారు. ఈడూ జోడూ.. మంచి పెయిర్. అందుకే అనుపమ వెడ్స్ ధృవ్ అనే కార్డ్ ఎప్పటికైనా కనిపిస్తుందని అంతా అనుకుంటున్నారు.

One Reply to “తమిళ హీరోతో అనుపమ పెళ్లి?”

Comments are closed.