దర్శకుడికి లాభాల్లో వాటా ఇస్తున్న నాగార్జున

సాధారణంగా నాగార్జున నిర్మించే సినిమాల్లో ఎవరికీ పెద్దగా వాటాలుండవు. లాభమైనా, నష్టమైనా నాగార్జునే భరిస్తాడు. కానీ ఈసారి దీనికి భిన్నంగా వ్యవహరించబోతున్నాడు ఈ హీరో. త్వరలోనే ప్రారంభం కాబోతున్న బంగార్రాజు సినిమాలో దర్శకుడ్ని కూడా…

సాధారణంగా నాగార్జున నిర్మించే సినిమాల్లో ఎవరికీ పెద్దగా వాటాలుండవు. లాభమైనా, నష్టమైనా నాగార్జునే భరిస్తాడు. కానీ ఈసారి దీనికి భిన్నంగా వ్యవహరించబోతున్నాడు ఈ హీరో. త్వరలోనే ప్రారంభం కాబోతున్న బంగార్రాజు సినిమాలో దర్శకుడ్ని కూడా వ్యాపార భాగస్వామిగా మార్చేశాడు.

అవును.. బంగార్రాజు సినిమాకు సంబందించి దర్శకుడు కల్యాణ్ కృష్ణకు పారితోషికం ఇవ్వడంలేదు నాగార్జున. కేవలం ఖర్చులకు కొంత డబ్బు ఇచ్చి, మిగతా పారితోషికం బదులు వాటాల్లో లాభాను ఆఫర్ చేశాడట. దీనికి కల్యాణ్ కృష్ణ కూడా అంగీకరించాడు.

దాదాపు రెండేళ్లుగా ఈ ప్రాజెక్టుపై వర్క్ చేస్తున్నాడు కల్యాణ్ కృష్ణ. చివరికి నాగార్జున సలహా మేరకు సత్యానంద్ లాంటి ఇతర రచయితల సహకారం కూడా తీసుకున్నాడు. అలా బంగార్రాజు సినిమాకు ఓ తుదిరూపు తీసుకురాగలిగారు. ఫైనల్ స్క్రిప్ట్ నాగార్జునకు నచ్చడంతో సినిమా చేసేందుకు అంగీకరించాడు. మన్మధుడు-2 కొలిక్కిరాగానే బంగార్రాజు స్టార్ట్ అవుతుంది.

ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటించబోతున్నాడు. సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో బంగార్రాజు పాత్ర ఎలా ఉంటుందో.. అదే క్యారెక్టర్ ను యాజ్ ఇటీజ్ గా నాగార్జున పోషించబోతున్నాడు. నాగచైతన్య పాత్రను మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ లో ఉంచారు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, సినిమాలో వీళ్లిద్దరూ తాతమనవుడు పాత్రల్లో కనిపించబోతున్నారు.

జగన్‌ తప్పులు చేయవచ్చు.. ఇప్పుడున్న వేవ్‌ అప్పుడుండదు