తమిళ హీరో శింబు, హీరోయిన్ నయనతారల మధ్య ఒకప్పుడు గాఢమైన ప్రేమ వ్యవహారం నడిచింది. ఏమయ్యిందోగానీ ఇద్దరూ విడిపోయారు. నయనతార ఆ తరువాత ప్రభుదేవాకి దగ్గరయ్యింది. ఆ తర్వాత ఆ వ్యవహారమూ చెడిరది. శింబు కూడా ఖాళీగా లేకుడా, మొన్నటిదాకా హన్సికతో ఎఫైర్ నడిపాడు. ఇప్పుడు అదీ బెడిసికొట్టింది.
ఇటు నయనతారకీ, అటు శింబుకీ వరుసగా ప్రేమ వైఫల్యాలు ఎదురవుతుండడంతో.. పాత ప్రేమికులు ఇద్దరూ మళ్ళీ ఒక్క చోటకు చేరినట్లు తెలుస్తోంది. ఓ పార్టీలో నయనతార, శింబు గాఢమైన కౌగళింతలో మునిగిపోయారంటూ కొన్ని ఫొటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. దాంతో, శింబు ` నయనతార ఒక్కటి కాబోతున్నారంటూ కోలీవుడ్‌లో గుసగుసలు గుప్పుమంటున్నాయి.
ఇప్పటిదాకా ఇటు నయనతారగానీ, అటు శింబుగానీ ఈ వార్తల్ని ఖండిరచలేదు. ఫొటోలే ఆధారాలుగా వున్నప్పుడు ఇందులో ఖండిరచడానికేముంటుందన్నది తమిళ సినీ వర్గాల అభిప్రాయం. మరి శింబు ` నయనతార ఈ వ్యవహారంపై ఏమంటారో.?