Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రామ్ టర్న్ ఎప్పుడో?

రామ్ టర్న్ ఎప్పుడో?

ఒక్కో హీరో ఏదో ఒక సినిమాతో కెరీర్ టర్న్ చేసుకుంటున్నారు..స్థాయి పెంచుకుంటున్నారు. టాప్, మీడియం హీరోలందరూ ఇప్పుడు దాదాపు హ్యాపీనే. బాలయ్య, నాగార్జున, వెంకటేష్, పవన్, చరణ్, బన్నీ, ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్, నితిన్, రవితేజ, నిఖిల్, ఇలా దాదాపు అందరూ హ్యాపీనే. మహేష్ కు నియర్ హిట్ లేదు కానీ, మార్కెట్ బాగానే వుంది. రాబోయే సినిమా హిట్ అయితే లెక్క సెటిల్ అయిపోతుంది. 

మరి ఇంతకీ రామ్ పరిస్థితి ఏమిటి? రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఓ హీరో కెరీర్ కు అది పెద్ద విషయం కాదు. మూడో సినిమా చకచకా లైన్ లో పడితే. కానీ అదే కనిపించడం లేదు. పండగచేస్కో అనే సినిమా మొదలెట్టిందగ్గర నుంచి నత్తనడక నడుస్తోంది. ఆర్థిక సమస్యలున్నాయని ఓ సారి..కాదు మొదలయ్యిందని మరోసారి వార్తలు వినవచ్చాయి. 

ఇటీవలే కాస్త గాడిలో పడిందని, కథ కొంత వరకు మార్చారని వినికిడి. రామ్ స్వంత బ్యానర్ స్రవంతి మూవీస్ పై మరో సినిమా మొదలయ్యింది. ఈ రెండింటిలో ఒకటైనా విడుదలైతే తప్ప, రామ్ కూడా హ్యాపీ కాలేడు.  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?