సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తోన్న టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ ఓ సినిమా షూటింగ్ సందర్బంగా గాయపడ్డారు. తన కొత్త సినిమా షూటింగ్‌లో భాగంగా బైక్‌పై ఆయన వెళ్తుండగా ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన షూటింగ్ సిబ్బంది, అక్కడికక్కడే బాలకృష్ణకు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.
బాలకృష్ణ ఆరోగ్య నిలకడగానే వుందనీ, జరిగింది పెద్ద ప్రమాదమేమీ కాదనీ, పెద్ద గాయాలేమీ తగల్లేదని వైద్యులు తెలిపారు. కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు వెల్లడిరచడంతో రేపట్నుంచి యధావిధిగా షూటింగ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేసుకుంటోంది.
‘లెజెండ్’ తర్వాత సత్యదేవ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తోన్న సినిమాలో బాలకృష్ణ నటిస్తోన్న విషయం విదితమే. 2014 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన బాలకృష్ణ వస్తూనే, ఎమ్మెల్యేగా హిందూపురం నుంచి గెలుపొందారు. ఓ పక్క ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తూనే, ఇంకోపక్క సినిమాలు చేస్తున్నారు బాలకృష్ణ. ఇక, బాలకృష్ణకు ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకున్న అభిమానులు తొలుత ఆందోళనకు గురైనా, ప్రమాదం తీవ్రమైనది కాదని డాక్టర్లు వెల్లడిరచడంతో ఊపిరి పీల్చుకున్నారు.