హీరో నాగశౌర్య అప్ కమింగ్ మూవీ కృష్ణ..వ్రింద..విహారీ. ఈ సినిమా టీజర్ ను ఆ మధ్య విడుదల చేసారు. మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు తొలిపాటను విడుదల చేసారు. అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ సాంగ్ ఇది. దర్శకుడు అనీష్ కృష్ణ యూత్ ఫుల్ టాలెంట్ అంతా పాత చిత్రీకరణలో కనిపిస్తోంది. శౌర్య-షెర్లియా సెటియాల నడుమ కెమిస్ట్రి అధ్భుతంగా పండింది.
మహతి స్వరసాగర్ అందించిన వర్షంలో వెన్నెల్లా పాట ట్యూన్ కొన్నాళ్లు వినిపించేలా వుంది. అల్ట్రామోడరన్ అమ్మాయి- సంప్రదాయ కుటుంబపు అబ్బాయిల నడుమ ప్రేమ ఆధారంగా తయరైన కథతో ఈ సినిమా రూపొందించారు.
శౌర్య సినిమాల్లో ఇది కాస్త భారీ సినిమానే. సుమారు 17 కోట్లు ఖర్చు చేసారు. ఇదంతా కేవలం క్వాలిటీ కోసం కావడం విశేషం. పాటలో విజువల్స్ చాలా కూల్ గా ప్లెజెంట్ గా వున్నాయి. లోకేషన్లు పాటకు పెర్ ఫెక్ట్ గా వుండేలా ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.
షెర్లియా డ్రెస్సింగ్, అప్పీయరన్స్ కూడా పెర్ ఫెక్ట్ గా కుదిరి, పాటను సినిమాకు క్రేజీ పాయింట్ గా మార్చేలా వున్నాయి. సినిమాలో ఇది హానీమూన్ సాంగ్ గా వస్తుంది. శౌర్య-షెర్లియాతో పాటు సినిమాలో రాధిక, ఇంకా పలువురు సీనియర్ నటులు నటించారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు. శంకర్ ప్రసాద్ సమర్పణలో ఉష సినిమాను నిర్మించారు.