Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రజనీకాంత్ రికార్డుపై కన్నేసిన సైరా

రజనీకాంత్ రికార్డుపై కన్నేసిన సైరా

సైరా సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం చిరంజీవి ఈ సినిమాకు డబ్బింగ్ చెబుతున్నారు. థియేట్రికల్ బిజినెస్ కూడా ప్రారంభమైంది. అంతా బాగానే ఉంది కానీ శాటిలైట్, డిజిటల్ విషయాని కొచ్చేసరికి మాత్రం కాస్త వెనక్కి తగ్గుతున్నారు మేకర్స్. దీనికి కారణం రజనీకాంత్ నటించిన 2.O సినిమా.

రజనీకాంత్ నటించిన ఈ సినిమా శాటిలైట్+డిజిటల్ డీల్ లో సౌత్ లోనే అతిపెద్ద రికార్డు. ఏకంగా 110 కోట్ల రూపాయలకు ఈ హక్కులు అమ్ముడుపోయాయి. ఇప్పుడా రికార్డును అధిగమించాలని, కుదరని పక్షంలో కనీసం సమం చేయాలని భావిస్తున్నారు చిరంజీవి అండ్ కో. ఆ విధంగా సౌత్ లో తమ ఆధిపత్యాన్ని చాటాలనేది వీళ్ల ఆలోచన.

ఆలోచన బాగానే ఉంది, టార్గెట్ కూడా బాగానే ఫిక్స్ చేసుకున్నారు. కానీ అమల్లోకి వచ్చేసరికి మాత్రం యూనిట్ కు చుక్కలు కనిపిస్తున్నాయి. సైరా సినిమాను 110 కోట్ల రూపాయలకు కొనేందుకు టీవీ ఛానెళ్లు ఆసక్తి చూపించడం లేదు. నిజానికి ఈ సినిమాలో అమితాబ్ ఉన్నారు. విజయ్ సేతుపతి, సుదీప్ లాంటి నటులు ఉన్నారు. నయనతార, తమన్న లాంటి హీరోయిన్లు కూడా ఉన్నారు. ఇలా అన్ని భాషలకు కనెక్ట్ అయ్యేలా నటీనటుల్ని సెట్ చేశారు. కానీ ఎందుకో ఈ సినిమాకు పాన్-ఇండియా అప్పీల్ రావడం లేదు. డీల్ క్లోజ్ అవ్వడంలేదు.

2.O సినిమాలో రజనీకాంత్ తో పాటు అక్షయ్ కుమార్ లాంటి బలమైన స్టార్ ఉన్నాడు. బాలీవుడ్ లో వంద కోట్ల హీరో అతడు. ఫ్యాన్ బేస్ కూడా అమాంతం. ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ ఉంది. పైగా చిరంజీవితో పోలిస్తే రజనీకాంత్ కు బాలీవుడ్ లో ఫ్యాన్స్ కాస్త ఎక్కువ. కాబట్టి అతడి సినిమా రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయాయి. సైరా విషయానికొచ్చేసరికి ఈ ఎలిమెంట్స్ కాస్త తగ్గాయి.

అందుకే 110 కోట్లు టార్గెట్ ను అందుకోలేకపోతోంది సైరా. కేవలం ఈ రికార్డు కారణంగానే ఎప్పుడో ముగిసిందనుకున్న అమెజాన్ ప్రైమ్ డీల్ పై కూడా నిర్మాత రామ్ చరణ్ ఇంకా సంతకం పెట్టలేదు. ప్రస్తుతానికైతే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ సెగ్మెంట్ లో సైరా ఏ రేటుకు వెళ్తుందో చూడాలి.

టీడీపీ ఇంకా ఆ భ్రమల్లోనే ఉంది!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?