అత్తారింటికి దారేది తరవాత త్రివిక్రమ్ సినిమా ఏమిటన్నది ఇంకా తేలలేదు. ఎన్టీఆర్ బీభత్సంగా ప్రయత్నిస్తున్నా – త్రివిక్రమ్ మాత్రం సైలెంట్‌గా ఉన్నాడు. మరోవైపు రామ్‌చరణ్ కూడా ఈ ప్రయత్నాల నుంచి విరమించుకొంటున్నాడు. కారణం… ఇప్పటికే ఈ సినిమా అల్లు అర్జున్ చేతిలో పడిపోవడమే.
ఔను… జులాయి కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవ్వడానికి సర్వం సిద్ధం అవుతోంది. బన్నీ – త్రివిక్రమ్ మళ్లీ జత కట్టబోతున్నారు. రాధాకృష్ణ ఈ చిత్రానికి నిర్మాత. జులాయి సమయంలోనే రాధాకృష్ణ దగ్గర అడ్వాన్స్ తీసుకొన్నాడు త్రివిక్రమ్. అందుకే ఆయన సినిమాని ముందు పూర్తిచేయాల్సివస్తోంది.
రేసుగుర్రం సినిమా డిసెంబరుకు పూర్తవుతుంది. వెంటనే త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లేలా బన్నీ జాగ్రత్త పడుతున్నాడు. త్రివిక్రమ్ కూడా బన్నీకి సరిపడా కథ సెట్ చేసుకొనే పడిపోయాడు. ఈ కాంబినేషన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకొన్ని రోజుల్లో తెలుస్తాయి.