పుష్ప2 తరువాత ఏంటీ?

కల్కి.. దేవర ఈ రెండూ దాదాపుగా ఇంత హల్ చల్ చేశాయి. ఇప్పుడు పుష్ప 2 వంతు వచ్చింది. తరువాత ఏంటి?

గత కొన్ని రోజులుగా.. పుష్ప.. పుష్ప.. పుష్ప… సరే మరో నాలుగైదు రోజల్లో ఆ హడావుడి అయిపోతుంది. విడుదల తరువాత పుష్ప కంటెంట్ గురించి మాట్లాడేసుకుంటారు. తరువాత మరి మూవ్.. ఆన్ కదా. దేని మీదకు. మళ్లీ ఇంత హడావుడి వస్తుంది. కల్కి.. దేవర ఈ రెండూ దాదాపుగా ఇంత హల్ చల్ చేశాయి. ఇప్పుడు పుష్ప 2 వంతు వచ్చింది. తరువాత ఏంటి?

గేమ్ ఛేంజర్, డాకూ మహరాజ్, సంక్రాంతికి వస్తున్నాం అనే మూడు సినిమాలు సంక్రాంతికి వస్తున్నాయి. కానీ ఈ రేంజ్ హడావుడి వుంటుందా? బాలయ్య సినిమాలకు ముందు హడావుడి వుండదు. థియేటర్ల దగ్గర ఎర్లీ మార్నింగ్ షో లకు ఎక్కడ లేని హడావుడి వుంటుంది. వెంకీ సినిమాలు ప్రశాంతంగా వచ్చి వెళ్తాయి. ఇక మిగిలింది శంకర్- రామ్ చరణ్ కాంబినేషన్ సినిమా గేమ్ ఛేంజర్ నే.

ఈ సినిమా దగ్గర చేసి దేవర.. కల్కి.. పుష్ప 2 రేంజ్ హడావుడి వుంటుందా? అన్నదే క్వశ్చను మార్క్. ఎందుకంటే రామ్ చరణ్ పెద్దగా పట్టించుకోరు. ఆయన టీమ్ కు వదిలేస్తారు. పెద్దగా ప్లానింగ్ వుండదు. లక్నో ఈవెంట్ జరిగిన తీరే అందుకు నిదర్శనం. గేమ్ ఛేంజర్ కు ఎన్ని ఈవెంట్లు ప్లాన్ చేస్తారో, వాటి హడావుడి ఎలా వుంటుందో చూడాలి. చెన్నయ్ లో అయితే ఓ రేంజ్ ఈవెంట్ చేసే అవకాశం వుంది. ఎందుకంటే ఇది శంకర్ సినిమా కనుక.

అన్నింటి కన్నా అందరి కళ్లూ రాజమండ్రి ఈవెంట్ మీద వున్నాయి. ఈ నెలాఖరు లేదా జనవరి ఫస్ట్ న రాజమండ్రి ఈవెంట్ వుంటుందని వార్తలు వున్నాయి. ఈ ఈవెంట్ పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. అందువల్ల బాబాయ్.. అబ్బాయ్ లు ఇద్దరూ ఓ స్టేజ్ మీద వుండడం, జనసేన శ్రేణులు, మెగాభిమానుల మోహరించడంతో మంచి హడావుడి వుంటుంది.

ఈ రెండు ఈవెంట్లు తప్పిస్తే గేమ్ ఛేంజర్ హడావుడి ఏ మేరకు వుంటుంది అన్నది చూడాలి. అలాగే నైజాంలో ఎర్లీ మార్నింగ్ షో లు, భారీ రేట్లు ఇలాంటి హడావుడి కూడా ఏ మేరకు వుంటుంది అన్నది చూడాలి. కల్కి, దేవర, పుష్ప 2 కు దీటుగా షో లు వేయడం, హడావుడి వుండడం అన్నది వుంటుందా? అన్నది కాస్త అనుమానమే.

కానీ సంక్రాంతి దాటితే చాలా సినిమాలు వున్నాయి. క్రేజీ సినిమాలు వున్నాయి. కానీ మళ్లీ ఈ రేంజ్ హడావుడి జరగాలి అంటే పవన్ ఓజీ లేదా ప్రభాస్ రాజాసాబ్ రావాల్సిందే. లేదంటే సినిమాలు వస్తుంటాయి. వెళ్తుంటాయి.. కానీ ఈ రేంజ్ హడావుడి వుండడం అరుదు.

11 Replies to “పుష్ప2 తరువాత ఏంటీ?”

  1. GC మూవీ కి ఆంధ్ర లో… చెన్నై లో ఈవెంట్స్ జరుగుతున్నాయి… ఇంకా ప్లాన్ చేస్తారేమో తెలియదు. ఇంకా బోలెడు టైమ్ ఉంది… ఇప్పుడు హడావిడి చేస్తే రిలీజ్ టైమ్ కి చప్పబడిపోతుంది. ఆహా టైమ్ కి వాళ్ళూ ఏదో ప్లాన్ చేస్తారు లెద్ధూ… కొంచెం ఓపిక పట్టండి… అయినా హడావిడి ఎవడికి కావాలి. మాకు కంటెంట్ నచ్చితే at least OTT లో అయినా చూస్తాం.. లేదంటే మాకు ఫోన్ లో బోలెడు ఆప్షన్స్ relax అవడానికి. Including reading GA and కమెంటింగ్. 🤣🤣

Comments are closed.