చాప‌కింద నీరులా కూట‌మిలో లుక‌లుక‌లు!

కేవ‌లం జ‌మ్మ‌ల‌మ‌డుగు, తాడిప‌త్రిలోనే ఈ గొడ‌వ‌లు లేవు. రాష్ట్రంలో ఏ నియోజ‌క‌వ‌ర్గం చూసినా అంత‌ర్లీనంగా ఇలాంటి గొడ‌వ‌లే సాగుతున్నాయి

కూట‌మిలో చాప‌కింద నీరులా లుక‌లుక‌లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మిత్ర‌ప‌క్షాలంటేనే శ‌త్రుప‌క్షాల‌ని రాజ‌కీయాల్లో అర్థం. కూట‌మి అధికారంలోకి వ‌చ్చేంత వ‌ర‌కూ అంతా క‌లిసే ఉన్నారు. వైసీపీని ఓడించ‌డానికి కూట‌మిలోని టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ క‌లిసి క‌ట్టుగా ప‌ని చేశాయి. అనుకున్న అధికారం ద‌క్కిన త‌ర్వాత‌, మ‌రేదో కావాలి. అది ప‌ద‌వైనా కావ‌చ్చు, లేదా ఆదాయ‌మైనా కావ‌చ్చు. ఎందుకంటే రాజ‌కీయం అంటేనే ఒక వ్యాపార‌మైంది.

ఊరికే ఎవ‌రూ పెట్టుబ‌డులు పెట్ట‌రు క‌దా. రాజ‌కీయం అంటే కోట్ల రూపాయిల‌తో వ్య‌వ‌హారం. ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయాలంటే క‌నీసం అంటే రూ.50-రూ.100 కోట్లు పెట్టుబ‌డులు పెట్టాల్సి వ‌స్తోంది. ఇంత భారీ మొత్తంలో ఖ‌ర్చు పెట్టి, గెలిచిన త‌ర్వాత దాన్ని రాబ‌ట్టుకోవాలనేది నాయ‌కుల‌కు మొద‌టి ప్రాధాన్య అంశంగా వుంటోంది. అందుకే కూట‌మి నేత‌ల మ‌ధ్య గొడ‌వ‌లు, రాద్ధాంతాలు.

తాజాగా ఆర్టీపీపీ నుంచి ప్లైయాష్ త‌ర‌లింపు విష‌యంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి, టీడీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి మ‌ధ్య గొడ‌వ‌కు కార‌ణం ఆదాయ‌మే. వాళ్ల మ‌ధ్య పొలం గ‌ట్ల గొడ‌వ‌లేం లేవు. అధికారంలో ఉన్న‌ప్పుడే వీలున్నంత వ‌ర‌కూ డ‌బ్బు పిండుకోవాల‌ని నాయ‌కులు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. త‌మ ప‌రిధిలోకి ఎవ‌ర్నీ రానివ్వ‌మ‌ని తేల్చి చెబుతున్నారు.

కేవ‌లం జ‌మ్మ‌ల‌మ‌డుగు, తాడిప‌త్రిలోనే ఈ గొడ‌వ‌లు లేవు. రాష్ట్రంలో ఏ నియోజ‌క‌వ‌ర్గం చూసినా అంత‌ర్లీనంగా ఇలాంటి గొడ‌వ‌లే సాగుతున్నాయి. అయితే వీధికెక్కి కూట‌మి ప‌రువు పోతుంద‌ని అనుకుంటున్న‌ప్పుడు మాత్ర‌మే ప్ర‌భుత్వ పెద్ద‌లు ఆగ్ర‌హించార‌ని, మ‌రేదో అని హ‌డావుడి చేస్తుంటారు. కానీ రానున్న రోజుల్లో కూట‌మిలో ర‌చ్చ‌లు పెర‌గ‌డ‌మే త‌ప్ప‌, త‌గ్గేది లేదు. ఎందుకంటే అధికారం వున్న‌ది సంపాదించుకోడానికే త‌ప్ప‌, మ‌రెవ‌రికో సేవ చేయ‌డానికి అనేది ఉత్తుత్తిదే కాబ‌ట్టి.

18 Replies to “చాప‌కింద నీరులా కూట‌మిలో లుక‌లుక‌లు!”

  1. ఓహో అందుకేనా 1750కోట్లు పుచ్చుకొని అమెరికా దాకా వినపడేలా చేసింది

  2. ఆ చాపనే చుట్టుకుని మొద్దు నిద్రలో వున్న మన అన్నయ్య and co…..😂😂… అంతేనా అత్యాశ GA….

  3. వాళ్ళు విడిపోతే గాని.. మనం గెలవలేం.. అదీ సింగల్ సింహాల దీన స్థితి

    ..

    ఇంతకుముందే ఒక యానిమల్ షార్ట్ వీడియో చూసాను.. ఒక జీబ్రా (కంచర గాడిద) పైకి నాలుగు సింహాలు పడ్డాయి.. జీబ్రా వెనుక కాళ్లతో తంతూ తప్పించేసుకుంది..

    ఇక్కడ రెండు ప్రశ్నలు..

    సింహం సింగల్ గా ఎందుకు రాలేదు.. క్లాన్ గానే ఉంటాయి ఎందుకు..?

    నాలుగు రారాజులను ఓడించేసిన కంచర గాడిద ని కొత్త రాజు గా ప్రకటించవచ్చా..?

    మరి.. మన జగన్ రెడ్డి ని.. సింగల్ కంచర గాడిద గా ప్రమోట్ చేసుకోవచ్చు కదా..

  4. ఇంతకీ అ*దానీ 1750 కోట్లు ప్యాలస్ లో యే గదిలో దాచుకున్నాడు ప్యాలస్ పులకేశి గాడు.

    అందుకేనా 60 అడుగుల ఫె*న్సింగ్ పెట్టించుకున్నాడు.

    దొం*గోడు , తన దొం*గ డబ్బు దాచుకోడానికి ప్రజల డబ్బుతో ఫెన్సింగ్ కట్టుకున్నాడు, ఇది సూపర్.

    1. దానిలో ఒక కోటి తనకి కూడా పడేయమనెగ, ఈ గ్రేట్ ఆంద్ర గుంత కాడ నక్క లాగ, ఒక రోజు దొప్పడం , పక్క రోజు పులకరించి పోవడం ప్యాలస్ పులకేశి లక్షణాలు తలుచుకుని.

  5. లుక లుక లు లేవు లక లక లు లేవు. బిక బిక లు మనకే ఉన్నాయ్
    ఎందుకంటే మన పని అయిపోయింది ప్రజల దృష్టిలో. ఇంకా ఒకరి తర్వాత ఒకరు వేరే పార్టీ లా లోకి పోతారు.
    అప్పుడు మనo బటన్స్ తాయరయ్యే పరిశ్రమ పెట్టుకోవచ్చు
  6. జగన్ గారు నిజం గ లంచం తీసుకోక పొతే అమెరికా ఫెడరల్ కోర్ట్ కి నోటీసు ఇవ్వటమే ఇక్కడ దేశవ్యాప్తం గ అయన పేరు లంచగొండిగా మారుమోగేటప్పుడు తీసుకోవలసిన కనీస చర్య దీనివల్ల ఆదానీ సేఫ్ జగన్ గారు సేఫ్ కానీ తీసుకొంటే అవి ఏ అకౌంట్ లో ఏ దేశం లో ఉన్నాయో కూడా చెప్పేస్తారు దాంట్లో ఈ 1750 కోట్లే కాకుండ మద్యం లో నొక్కేసింది ఇసుకలో నొక్కేసింది కాదంబరి జత్వని కేసు లు వంటివి సెటిల్ చేసినందుకు వచ్చిన మొత్తాలు కూడా ఆ అకౌంట్ లో ఉంటే ఇబ్బందవుద్ది

  7. ఇప్పుడే ముంది.ఇప్పుడే కదా దో్చుకోవటం start చేసింది.వాటాలు పుంచుకొనేటప్పుడు ముందుంది ముసళ్ల లుక లుకలు.చంబా కు life line PK నే

  8. కూటమి నుంచి 90 మంది MLA బయటకు వచ్చి జగన్ కి సపోర్ట్, ఫిబ్రవరి 31 జగన్ విశాఖ రిషికొండ పాలస్ లో ముఖ్యమంత్రి హా ప్రమాణ స్వీకారం.

  9. 2029 లో వైస్సార్సీపీ ఈజీ గా గెలిచే సీటు ప్రకాశం జిల్లా కొండపి నియాజకవర్గం .. అంతలా కమిషన్స్ తీసుకుంటునరా సామి *** . టీడీపీ పతనం ఇక్కడ నుంచే మొదలు అయ్యేలాగా ఉంది .

  10. 2029 లో వైస్సార్సీపీ ఈజీ గా గెలిచే సీటు ప్రకాశం జిల్లా కొండపి నియాజకవర్గం .. అంతలా కమిషన్స్ తీసుకుంటునరా సామి *** . టీడీపీ పతనం ఇక్కడ నుంచే మొదలు అయ్యేలాగా ఉంది .

Comments are closed.