ఆంధ్రలో టికెట్ రేట్ల పెంపు అడుగుతారా?

కల్కి సినిమా సంగతి పక్కన పెట్టండి. లేదా ఇలా అప్పుడప్పుడు వచ్చే పెద్ద సినిమాల సంగతి అలా వుంచితే రెగ్యులర్ గా సినిమా టికెట్ రేట్లు పెంచమని టాలీవుడ్ పెద్దలు అడుగుతారా? పలువురు నిర్మాతలు…

కల్కి సినిమా సంగతి పక్కన పెట్టండి. లేదా ఇలా అప్పుడప్పుడు వచ్చే పెద్ద సినిమాల సంగతి అలా వుంచితే రెగ్యులర్ గా సినిమా టికెట్ రేట్లు పెంచమని టాలీవుడ్ పెద్దలు అడుగుతారా? పలువురు నిర్మాతలు ఈ రోజు అమరావతి వెళ్లి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి అభినందించి, సమస్యలు విన్నవించబోతున్నారు. ఈ విన్నపాల జాబితా ఎలా వుండబోతోంది?

టాలీవుడ్ కు చాలా సమస్యలు వున్నాయి. కానీ ప్రభుత్వం తీర్చాల్చినవి తక్కువ. ఆంధ్రలో షూటింగ్ లకు సబ్సిడీ లాంటివి కొత్తగా అడిగే వాటిలో వుండొచ్చు. అయితే ఇవన్నీ అలా వుంచితే ఆంధ్రలో టికెట్ రేట్లు పెంచమని అడగుతారా? అడగరా? ప్రస్తుతం ఆంధ్రలో థియేటర్ల పరిస్థితి ఏమంత బాలేదు. ఉత్తరాంధ్ర తప్పిస్తే మిగిలిన ఏరియాల్లో రాను రాను. సినిమా వ్యాపారం లాభసాటిగా వుండడం లేదు. బయ్యర్లను వెదుక్కోవాల్సి వస్తోంది.

చాలా జిల్లాల్లో ఈ మధ్య థియేటర్లు మూత పెట్టారు. కరెంట్ బిల్లులు కట్టక, ఫీజులు పట్టుకుపోయిన సంఘటనలు కూడా వున్నాయి. ఇప్పుడు టాలీవుడ్ కానీ, ప్రభుత్వం కానీ ముందుగా దృష్టి పెట్టాల్సింది థియేటర్ల సమస్యల మీదే.

అటు ప్రేక్షకుడి మీద భారం పడకుండా, థియేటర్లు లాభసాటిగా నడిచేలా చూడాల్సి వుంది. కరెంట్ బిల్లులు అనేది పెద్ద సమస్య. అక్కడే ప్రభుత్వం ఏమైనా వెసులుబాటు ఇవ్వాల్సి వుంటుంది.

అదే విధంగా ఆస్తి పన్ను అన్నది ఇంకో సమస్య. థియేటర్లు ఆర్ధికంగా లాభసాటి కావడం లేదు. అందుకే వాటిని కళ్యాణ మండపాలుగా, కమర్షియల్ కాంప్లెక్స్ లు గా మారుస్తున్నారు. ఇలా కాకూడదు అంటే వాటికి ఖర్చు భారం తగ్గాలి. అందువల్ల ఆస్తి పన్ను విషయంలో కూడా వెసులు బాటు ఇవ్వాల్సి వుంటుంది.

ఇలా కాకుండా, ప్రభుత్వం మీద భారం పడకుండా, కేవలం ప్రజల మీదనే భారం పడేలా టికెట్ రేట్ల పెంపు తీసుకుని, మళ్లీ పాత రేట్లు అంటే, జనం మరింతగా థియేటర్ కు దూరం అయిపోయే ప్రమాదం వుంది.