పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో నటించాలనుకుంటున్నారా? ఇది మీకు సువర్ణావకాశం. ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం కల్పిస్తోంది భద్రకాళి పిక్చర్స్ సంస్థ. ఈ మేరకు కాస్టింగ్ కాల్ ఇచ్చింది. ఇందులో మీరు సెలక్ట్ అయితే నేరుగా ప్రభాస్ సినిమా సెట్స్ లో వాలిపోవచ్చు.
త్వరలోనే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. ఈ సినిమా కోసమే నటీనటులు కావాలంటూ నిర్మాణ సంస్థ పిలుపునిచ్చింది. వయసుతో సంబంధం లేకుండా పురుషులు-స్త్రీలు అంతా తన ప్రొఫైల్స్ పంపించాల్సిందిగా కోరింది.
కాకపోతే ఒకటే కండిషన్. ఆల్రెడీ ఫిలిమ్ లేదా థియేటర్ బ్యాక్ గ్రౌండ్ ఉండాలి. అంటే, ఫ్రెషర్స్ కు అనుమతి లేదన్నమాట.
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రీన్ ప్లే పూర్తిచేశాడు సందీప్ వంగ. ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు కాస్టింగ్ కాల్ ఇచ్చారు. నటీనటుల ఎంపిక కూడా పూర్తయితే, సెట్స్ పైకి వెళ్లడమే.
లెక్కప్రకారం, ఈపాటికే సినిమా స్టార్ట్ అవ్వాలి. కానీ పలు కారణాల వల్ల లేట్ అవుతూ వస్తోంది. సమ్మర్ లోనైనా సెట్స్ పైకి వస్తుందేమో చూడాలి. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నాయి.
కెరీర్ లోనే తొలిసారి స్పిరిట్ లో పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు ప్రభాస్. హర్షవర్థన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.
ప్లే బాయ్ జాబ్స్ >>> తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది,
comments రాయడానికి ప్రతీసారి login అవ్వాలా?
Naku vundi