సమస్య తండేల్ తోనా.. సీజన్ తోనా?

టాలీవుడ్ లో ఓ సెంటిమెంట్ వుంది. ఓ సినిమా కనుక అరివీర బ్లాక్ బస్టర్ అయిపోతే ఆ తరువాత వచ్చే మూడు నాలుగు వారాల పాటు సినిమాలు అంతగా ఆడవు.

చైతన్య-సాయిపల్లవిల కాంబో సినిమా తండేల్. సినిమాకు మంచి బజ్ వచ్చింది. రీజనబుల్ ఓపెనింగ్ తరువాత కలెక్షన్లలో అప్ ట్రెండ్ కనిపించింది. కానీ మండే నుంచి మాత్రం మళ్లీ డౌన్ ట్రెండ్ లోకి వెళ్లిపోయింది. సినిమా మండే నాటికి నిలబడుతుందా, నిలబడదా అన్న అనుమానాలు ముందు వినిపించాయి. మండే నాడు ఓ మాదిరిగా వుండే సరికి ఫరవాలేదు అనుకున్నారు. కానీ మంగళవారం నుంచి మరింత జారడం మొదలుపెట్టింది. అదృష్టం కొద్దీ అదనపు రేట్లు వుండడం వల్ల కాస్త అమౌంట్లు కనిపిస్తున్నాయి.

తండేల్ సినిమాకు ఇంతో అంతో మంచి పేరే వచ్చింది. 100 కోట్ల పోస్టర్ వేస్తాం అని టీమ్ ధీమా పడింది. కానీ ఇలా ఎందుకు అయింది అన్నది పాయింట్. వచ్చే శని, ఆదివారాలు మళ్లీ బాగుంటాయి కలెక్షన్లు అన్న పాయింట్ నిజమవుతుందా? కాదా? అన్న సంగతి పక్కన పెడితే అసలు దాదాపుగా మంచి టాక్ నే వచ్చిన సినిమా వీక్ డేస్ లో ఎందుకు నిల్చోలేదు అన్నదే ప్రశ్న.

టాలీవుడ్ లో ఓ సెంటిమెంట్ వుంది. ఓ సినిమా కనుక అరివీర బ్లాక్ బస్టర్ అయిపోతే ఆ తరువాత వచ్చే మూడు నాలుగు వారాల పాటు సినిమాలు అంతగా ఆడవు. ఈసారి సంక్రాంతికి రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు సినిమాలు కలిపి దాదాపు 400 కోట్ల మేరకు గ్రాస్ వసూళ్లు కళ్ల చూసాయి. అంటే రెండు తెలుగు రాష్ట్రాల జనాలు కలిసి నాలుగు వందల కోట్ల రూపాయలు సినిమాల మీద ఖర్చు చేసేసారు. మరి మళ్లీ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు.

సినిమా లవర్స్, హీరో, హీరోయిన్, కాంబినేషన్ లవర్స్ సినిమా చూస్తే మహా అయితే మూడు రోజులు బండి లాగించవచ్చు. ఆ తరువాత నడవాలి అంటే జనరల్ పబ్లిక్ రావాలి. అలా రావాలి అంటే డబ్బులు వుండాలి. పైగా తండేల్ సినిమాకు కూడా ఏపీలో 50 రూపాయల రేట్లు పెంచేసారు. మండే నుంచి తగ్గిస్తాం అన్నారు కానీ తగ్గించలేదు. అది కూడా ఓ రీజన్.

మరోపక్కన మార్చి ఫస్ట్ నుంచి పరీక్షల సీజన్ వస్తోంది. ఫ్యామిలీలు ఇక సినిమాల వైపు చూడమన్నా చూడవు. కుర్రకారే చూడాలి. అది కూడా ఓ సమస్య. మొత్తం మీద తండేల్ ను అనుకున్న 100 కోట్ల పోస్టర్ వైపు వెళ్లకుండా చాలా ఫ్యాక్టర్లు అడ్డం పడినట్లు కనిపిస్తోంది.

14 Replies to “సమస్య తండేల్ తోనా.. సీజన్ తోనా?”

    1. ఏమి మోడరేషన్ పెట్టాడో, nice ఆర్టికల్ అని కామెంట్ పెట్టినా మోడరేషన్ లోకి వెళ్ళిపోతోంది 🤦♂️

  1. Film below average content. Visuals and making values are good. Story line is thin. Story lekunda events films ante work out kaavu. DSP music in good in parts and monotonous in other places. Eppudocche movies anni parts parts gaa baguntunnayi, majority portion baagugundadam ledu

  2. ఏం పర్లేదు అండి గ్రేట్ ఆంధ్ర గారు మీరు ఎన్నైనా రాసుకోండి కానీ తండెల్ 100 కోర్స్ పక్కా సీజన్ లో రిలీజ్ అయితే 500 కోర్స్ పక్కా కానీ ఆన్ సీజన్లో రిలీజ్ అయింది అయినా పాజిటివ్ మీలాంటి వాళ్ళందరూ ఇలాంటి కొటేషన్లు రాయకండి జనాలు ఎట్లా వస్తున్నారు చూస్తున్నారు 100 కోర్స్ పోస్టర్ పక్కా టుడేస్ లో పడుతుంది ఒకే ఆంధ్ర గ్రేట్ ఆంధ్ర మై ఆంధ్ర

Comments are closed.