ఏప్రిల్‌లో భారీగా గద్దర్ అవార్డులు

ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ అనేవి ఇతరత్రా వివరాలతో నోటిఫికేషన్ ఒకటి రెండు రోజుల్లో వస్తుంది. అప్పుడు అన్నీ తెలుస్తాయి.

నంది అవార్డులు అన్నది ఓ గత వైభవం. చాలా కాలం అయింది ప్రభుత్వం వైపు నుంచి అవార్డుల ఫంక్షన్ చూసి. తెలంగాణ ప్రభుత్వం కొన్ని నెలల క్రితమే దీనికి శ్రీకారం చుట్టింది, ఇప్పుడు ఆ కమిటీ కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. వచ్చే నెలలో ఈ మేరకు భారీ ఫంక్షన్ చేయబోతున్నారు. ఈ విషయం మీద ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది.

నిర్మాత దిల్ రాజు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి, సినిమా ఇండస్ట్రీకి మధ్య వారధిగా ఉన్న సంగతి తెలిసిందే. తొలిసారి నిర్వహిస్తున్న గద్దర్ అవార్డుల ఉత్సవం కావడం, తెలంగాణ ప్రభుత్వం వీటిని చాలా ప్రెస్టీజియస్‌గా నిర్వహించాలనుకోవడం వల్ల, దిల్ రాజు ఉండడం వల్ల మొత్తం ఇండస్ట్రీ అంతా అవార్డుల ఫంక్షన్‌లో కనిపించడం గ్యారంటీ. టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు అంతా ఓ చోటకి వస్తారు.

ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ అనేవి ఇతరత్రా వివరాలతో నోటిఫికేషన్ ఒకటి రెండు రోజుల్లో వస్తుంది. అప్పుడు అన్నీ తెలుస్తాయి. ఏ ఏడాదికి అవార్డులు ఇస్తారు? ఏ టైమ్ పీరియడ్ సినిమాలు తీసుకుంటారు? అన్నీ తెలిసిన తర్వాత బెస్ట్ హీరో ఎవరు అవుతారు? అన్నది తెలుస్తుంది. అంత వరకు వెయిట్ అండ్ వాచ్.

4 Replies to “ఏప్రిల్‌లో భారీగా గద్దర్ అవార్డులు”

  1. Nandi awards stopped because of Posani, Sajjala & Jagan. TDP government gave awards during 2017 but due to Posani abused comments on CBN. TDP govt stopped after 2017, jagan also not given nandi awards.

Comments are closed.