నిజంగా ఆ సెంటిమెంట్ బ్రేక్ అయిందా?

ఈరోజు పొద్దున్నే కార్తికేయ ఓ ఆసక్తికరమైన పోస్టు పెట్టాడు. 23 ఏళ్ల నెగెటివ్ సెంటిమెంట్ బద్దలయిందనే అర్థం వచ్చేలా ట్వీటేశాడు. అతడు నేరుగా చెప్పకపోయినా మేటర్ ఏంటనేది అందరికీ తెలుసు.. Advertisement రాజమౌళితో ఎవరైనా…

ఈరోజు పొద్దున్నే కార్తికేయ ఓ ఆసక్తికరమైన పోస్టు పెట్టాడు. 23 ఏళ్ల నెగెటివ్ సెంటిమెంట్ బద్దలయిందనే అర్థం వచ్చేలా ట్వీటేశాడు. అతడు నేరుగా చెప్పకపోయినా మేటర్ ఏంటనేది అందరికీ తెలుసు..

రాజమౌళితో ఎవరైనా ఓ హీరో సినిమా చేశాడంటే.. ఆ సినిమా కచ్చితంగా హిట్టవుతుంది. ఆ తర్వాత మాత్రం అతడ్ని ఫ్లాపులు వెంటాడతాయి. 23 ఏళ్లుగా చెక్కుచెదరని నెగెటివ్ సెంటిమెంట్ ఇది. దేవర సినిమాతో ఎన్టీఆర్ ఆ భ్రమలు తొలిగించాడనేది కార్తికేయ ట్వీట్ అర్థం. కానీ జనాల రియాక్షన్ మాత్రం మరోలా ఉంది.

దేవర సినిమాపై ఓ రేంజ్ లో నెగెటివ్ టాక్ నడుస్తోంది. మరీ ముఖ్యంగా కీలకమైన క్లయిమాక్స్ విషయంలో కొరటాల దెబ్బేశాడనేది ఎక్కువమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆరోపణ. క్లయిమాక్స్ అలా ఉన్నప్పుడు కచ్చితంగా నెగెటివ్ టాక్ బయటకొస్తుంది. కానీ దానికి విరుద్ధంగా కార్తికేయ స్పందించడంతో అతడ్ని టార్గెట్ చేశారు చాలామంది.

ఒక్కసారి నెగెటివ్ సెంటిమెంట్ వైపు చూస్తే..

సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ కు అన్నీ ఫ్లాపులే. ఛత్రపతి తర్వాత ప్రభాస్ కు, మగధీర తర్వాత రామ్ చరణ్ కు ఫ్లాపులు తప్పలేదు. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చింది. అందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నుంచి వచ్చిన సినిమా దేవర. ప్రస్తుతం ఈ మూవీపై మిక్స్ డ్ టాక్ నడుస్తోంది. ఇక మిగిలింది రామ్ చరణ్. అతడు నటించిన గేమ్ ఛేంజర్ సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది.

దేవర రిజల్ట్ పై దాదాపు క్లారిటీ వచ్చేసింది. అయితే పూర్తిస్థాయిలో దీని ఫలితం తెలియాలంటే, ఇంకొక్క రోజు అగితే సరిపోతుంది.

7 Replies to “నిజంగా ఆ సెంటిమెంట్ బ్రేక్ అయిందా?”

Comments are closed.