అక్క జైలు జీవితం.. స్పందించిన హీరోయిన్

బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్టై దాదాపు 3 నెలల పాటు జైలు జీవితం గడిపింది హీరోయిన్ సంజనా గల్రానీ. ఎట్టకేలకు బెయిల్ పై రిలీజైంది. ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడింది. డ్రగ్స్ కేసుతో…

బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్టై దాదాపు 3 నెలల పాటు జైలు జీవితం గడిపింది హీరోయిన్ సంజనా గల్రానీ. ఎట్టకేలకు బెయిల్ పై రిలీజైంది. ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడింది. డ్రగ్స్ కేసుతో పాటు తన రహస్య వివాహంపై స్పందించింది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ఆమె చెల్లెలు,మరో హీరోయిన్ నిక్కీ గల్రానీ మాత్రం సైలెంట్ అయింది.

అలా కొన్నాళ్లుగా అక్క జైలు జీవితం, డ్రగ్స్ కేసుపై మౌనంగా ఉన్న నిక్కీ, ఎట్టకేలకు వాటిపై స్పందించింది. కాస్త ఆలస్యంగానైనా నిజమే గెలుస్తుందంటున్న నిక్కీ గల్రానీ.. అక్క జైలు పాలవ్వడంతో తమ కుటుంబం మరింత స్ట్రాంగ్ అయిందని చెప్పుకొచ్చింది.

“అక్క బెంగళూరులో ఉంటుంది. నేను ఎక్కువగా చెన్నైలోనే ఉంటాను. గతేడాది లాక్ డౌన్ టైమ్ లో నేను చెన్నైలోనే ఉన్నాను. ఇప్పుడు కూడా చెన్నైలోనే ఉన్నాను. అందుకే అక్క కేసు బయటకొచ్చినప్పుడు నేను మీడియాకు అందుబాటులోకి రాలేకపోయాను. అయితే ఆ కేసు నుంచి కోలుకునే క్రమంలో మా బంధం మరింత దృఢమైంది. మా ఫ్యామిలీ ఇంకాస్త స్ట్రాంగ్ అయింది.”

సంజనా, తను అక్కాచెల్లెళ్లలా కాకుండా ఫ్రెండ్స్ లా పెరిగామని.. కష్టాల్లో ఒకరికొకరం తోడుగా నిలిచామని అంటోంది నిక్కీ. సంజనా కష్టాల్లో ఉన్నప్పుడు తను ఫ్యామిలీకి అండగా నిలిచానని, ఈ కేసు కారణంగా తామిద్దర మధ్య రిలేషన్ షిప్ మరింత బలంగా మారిందని చెప్పుకొచ్చింది.