అసలు లెక్కలు ఎవరికీ తెలియదు

బయటకు అయిదు వందల కోట్లు అయింది అన్నా, నాలుగు వందల కోట్లు అయిందన్నా అది నమ్మాలి తప్ప చేసేది లేదు.

2, 3, 4, 5, 6 అంటూ ఇంటర్ ఫలితాలు బిగ్గరగా చదివినట్లు వదులుతున్నారు సంక్రాంతి సినిమాల కలెక్షన్ ఫిగర్లు. దాదాపు 200 కోట్లకు పైగా గేమ్ ఛేంజర్, వంద కోట్లు దాటిందంటూ డాకూ మహరాజ్, 80 కోట్ల దగ్గరకు రెండు రోజుల్లోనే చేరిందంటూ సంక్రాంతికి వస్తున్నాం పోస్టర్లు విడుదల చేసేసాయి.

గతంలో ఓ ఇంటర్వూలొ నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ అసలు లెక్కలు తమకు తప్ప ఎవరికీ తెలియవని, అసలు తమ లెక్కలు ఎవరికైనా ఎందుకు చెప్పాలని అన్నారు. అది నిజమే కూడా. అసలు సిసలు లెక్కలు నిర్మాతకు మాత్రమే తెలుస్తాయి. ఏ సినిమా నిర్మాతకు ఆ సినిమా నిర్మాణానికి అయిన ఖర్చు, వసూళ్లు తెలుస్తాయి. బయటకు అయిదు వందల కోట్లు అయింది అన్నా, నాలుగు వందల కోట్లు అయిందన్నా అది నమ్మాలి తప్ప చేసేది లేదు.

ఒకప్పుడు కలెక్షన్ల ఫిగర్లు అధికారికంగా వదిలేవారు కాదు. ఇన్ కమ్ టాక్స్ సమస్యలు వస్తాయని. కానీ ఇన్ కమ్ టాక్స్ అధికారులకు చాలా సార్లు చాలా నిర్మాతలు క్లారిటీ ఇచ్చేసారు. ఫ్యాన్స్ కోసం సినిమా ప్రమోషన్ కోసం ఏవో ఫిగర్స్ వదులుతూ వుంటామని. అందువల్ల ఇప్పుడు ఆ దిశగా కూడా భయం పోయింది. అందుకే ధైర్యంగా ఎవరి నెంబర్లు వాళ్లు వదులుతున్నారు.

గేమ్ ఛేంజర్ కు భారీ ఫిగర్ వదిలినపుడు అందరూ షాక్ అయ్యారు. నిర్మాత దిల్ రాజు ఇండస్ట్రీ పెద్ద కదా, అలా ఫేక్ నెంబర్ వేస్తారా అని కామెంట్ చేసారు. ఫేక్ కాదు, ఒరిజినల్ నే అని మెగా ఫ్యాన్స్ డిఫెండ్ చేసారు. గేమ్ ఛేంజర్ నెంబర్లు అధికారికంగానే డైలీ పీఆర్ టీమ్ వదులుతోంది. సంక్రాంతికి వస్తున్నాం రెండు రోజుల్లో 77 కోట్లు అంటూ పోస్టర్ వేసారు.

మీడియా ఏ దారులంట నెంబర్లు కనుక్కుంటుందో ఆ దారులు అన్నీ బ్లాక్ చేసారు తెలివిగా. ట్విట్టర్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్ కలెక్షన్లు ప్రతి షో కి వేస్తూ వచ్చేవారు ఒకరు. ఏడాదిగా అతగాడిని వేయకుండా చేసారు ఎవరో? ఎంతో దారుణంగా భయపెడితే తప్ప ఏళ్ల కాలంగా వేస్తూ వున్న నెంబర్లు వేయడం మానడు కదా. అలాగే బిజినెస్ నెంబర్లు రిపోర్డ్ చేసే హ్యాండిల్స్ ఎన్నో వున్నాయి. కానీ ఏ రెండు నెంబర్లు ఒకటిగా వుండడం లేదు. ఉదయాన్నే అందరికన్నా ఎవరు ముందుగా వేస్తే, ఆ నెంబర్లే కాపీ పేస్ట్ చేసే హ్యాండిల్స్ చాలా వున్నాయి. అవన్నీ కూడా ఒక్కోసారి సైలంట్ అవుతున్నాయి.

అందువల్ల ఏ సినిమా నెంబర్ కూడా నిర్మాత చెప్పేది నమ్మితే నమ్మాలి. లేదంటే లేదు.

ఈ సంగతి అలా వుంచి ఓవరాల్ గా చూసుకుంటే నిర్మాణ వ్యయం, థియేటర్, నాన్ థియేటర్ ఆదాయం అంచనా వేసి ఓ ఐడియాకు వస్తే, గేమ్ ఛేంజర్ నిర్మాతకు నష్టం. డాకూ మహరాజ్ నిర్మాత సేఫ్. సంక్రాంతికి వస్తున్నాం నిర్మాతకు లాభాలు అనుకోవాలి.

32 Replies to “అసలు లెక్కలు ఎవరికీ తెలియదు”

  1. మా జగన్ రెడ్డన్న నాలుగు లక్షల కోట్లు సంక్షేమానికి పంచేశామని చెప్పుకొన్నాడు..

    ఒక లెక్కా పత్రం లేదు.. సంబంధించిన జీవో లు ఉండవు..

    ఎక్కడ ఎవరికీ ఎంత అప్పులు చేసాడో అంతుబట్టని పరిపాలన చేసాడు..

    ..

    వాడికి తెలిసిందల్లా సంక్షేమం పేరుతో అప్పులు చేసి.. దోచుకోవడం.. ఇక అప్పులు కూడా పుట్టేలా లేవని..

    అసలు విషయం ఏమిటంటే.. 2024 లో ఓడిపోయినందుకు మా కన్నా జగన్ రెడ్డే ఎక్కువగా సంతోషించి ఉంటాడని.. నా డౌటానుమానం ..

    ..

    కూటమి ప్రభుత్వం మళ్ళీ సంపద సృష్టిస్తే.. 2029 లో ఈ సారి తల్లినో చెల్లినో గొడ్డలితో వేసేసి మళ్ళీ అధికారం లోకి వచ్చి సంపాదించుకొందాం అనుకొంటుండొచ్చు..

    గోతి కాడ గుంట నక్క.. కళేబరం దగ్గర రాబందు.. పక్షి గుడ్ల దగ్గర నాగుపాము.. అధికారం కోసం జగన్ రెడ్డి.

      1. తమరు ఏ మాత్రం న్యూట్రల్ పెర్సనాలిటీ యో .. మీ పాత కామెంట్స్ చూస్తే తెలుస్తోంది..

        నా సంతోషం, నా ఆరోగ్యం సంగతి నేను చూసుకోగలను..

        జగన్ రెడ్డి సృష్టించిన ప్రాతాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య నెగటివిటీ .. ఈ రాష్ట్రాన్ని ఎంతగా నాశనమ్ చేసిందో.. ఆ లెక్కలు చూసుకోండి..

      1. ఒక్కొక్కరు ఒక్కో లెక్క చెపుతుంటారు..

        కానీ ప్రభుత్వం దిగిపోయాక.. అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన చెప్పిన లెక్కలు ఇవి..

  2. బడ్జెట్ లెక్కలు శుద్ధ అభద్దాలు, కలెక్షన్లు అంతకన్నా అబద్దాలు. గేమ్ చేంజర్ కి 450 కోట్లు అంట , వినే వాడు ఎరుపు అయితే చెప్పేవాడు దిల్ రాజు అంట ,

  3. మరి పుష్ప కలెక్షన్స్ అంత ఇంత అని తాటికాయ అక్షరాలు తో రాశావ్.. నే ఏడుపు..పీ..తి.. గు…ద్ద

  4. ఆదాయ పన్ను శాఖ పెంట పెట్టాలనుకున్‌టే ప్రభుత్వాలు ఉంటాయా.. వాళ్ళ తప్పుడు లెక్కలు విసదకరించె ప్రయత్నాలు ఆ శాఖ మొదలెడితే అంతా గోవిందే.

  5. నాగవంశీ మతి ఉంది మాట్లాడుతున్నాడా? ఏంటీ నిర్మాతలకి తప్ప ఎవరికీ లెక్కలు తెలియవా? మా మూర్తితాతకి కూడా తెలీదా? మా తాతకి ఎవరికి ఎంత ఇస్తున్నారు, ఏ సినిమాకి ఎంత బిజినెస్ అవుతుంది అనేది అణాపైసలతో సహా తెలుసు.

Comments are closed.