పివిపి జాక్ పాట్

సినిమా రంగంలోకి వచ్చి నిర్మాత పివిపి పోగొట్టుకున్నదే ఎక్కువ. మంచి సినిమాలు తీసినా మిగిలింది లేదు. ఊపిరి, రాజుగారి గది 2 లాంటి సినిమాలు జస్ట్ బ్రేక్ ఈవెన్ అయ్యాయి. క్షణం సినిమా కాసిన్ని…

సినిమా రంగంలోకి వచ్చి నిర్మాత పివిపి పోగొట్టుకున్నదే ఎక్కువ. మంచి సినిమాలు తీసినా మిగిలింది లేదు. ఊపిరి, రాజుగారి గది 2 లాంటి సినిమాలు జస్ట్ బ్రేక్ ఈవెన్ అయ్యాయి. క్షణం సినిమా కాసిన్ని డబ్బులు తెచ్చింది. బ్రహ్మోత్సవం పోగొట్టింది. మహర్షి సినిమా వల్ల పైసా రికవరీ రాలేదు. అలాంటిది ఎవరు అనే చిన్న సినిమా దాదాపు పెట్టిన పెట్టుబడి అంత లాభం తెచ్చేలా కనిపిస్తోంది.

ఎవరు సినిమాకు అన్ని ఖర్చులు, పబ్లిసిటీతో సహా తొమ్మిది కోట్లు ఖర్చయింది. వాస్తవానికి ఈ సినిమాను మూడు కోట్లలో తీయాలనుకున్నారు. కానీ గూఢచారి సినిమా పెద్ద హిట్ అయిన తరువాత కాస్టింగ్, స్పాన్ మార్చి కాస్త పెద్ద సినిమా చేయాలని అనుకోవడంతో తొమ్మిది కోట్లు ఖర్చయింది.

ఇందులో మూడుకోట్లు డిజిటల్, కోటిన్నర ఓవర్ సీస్, యాభై లక్షల వరకు కర్ణాటక, ఆంధ్రలోని కృష్ణ, గుంటూరు, ఈస్ట్, వెస్ట్, నెల్లూరు నుంచి ఓ రెండు కోట్లకు పైగా రికవరీ వచ్చింది. నైజాం, వైజాగ్, శాటిటైల్, ఓవర్ సీస్ ఓవర్ ఫ్లోస్ చేతిలో వున్నాయి. ఇవన్నీ కలిపి రెండు కోట్ల మేరకు వచ్చినట్లు అయింది.

ఎలా లేదన్నా ఇవన్నీ కలిసి పది పన్నెండు కోట్ల వరకు చేస్తాయని అంచనా. అంటే పివిపికి ఎలా లేదన్నా ఈ వెంచర్ కనీసం ఎంత పెట్టుబడి పెట్టారో, అంతకు అంతా మిగిల్చేలా కనిపిస్తోంది. నైజాం నాలుగు నుంచి అయిదు కోట్లు చేస్తుందని అంచనా వేస్తున్నారు. శాటిలైట్ మంచి రేటు వస్తుంది. ఈ సినిమాకు ఓవర్ సీస్ మార్కెట్ బాగుంటుంది కాబట్టి అక్కడ ఓవర్ ఫ్లోస్ బాగుంటాయి.

మహేష్ బాబు నిర్మాణంలో చేస్తున్న హిందీ సినిమా, గూఢచారి 2 సినిమాల తరువాత అడవిశేష్ మళ్లీ మరో సినిమా పివిపి సంస్థలో చేయాల్సి వుంది.

రణరంగం సినిమాపై ప్రేక్షకులు ఏమన్నారంటే