రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇన్నాళ్లూ రాజ్ తరుణ్ పై తీవ్రమైన ఆరోపణలు చేసిన లావణ్య, ఇప్పుడు మాట మార్చింది. “నా రాజ్ చాలా మంచోడు” అంటోంది. అతడి కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెబుతానంటోంది.
“రాజ్ తరుణ్ ను దూరం చేసుకోవడానికి ఇదంతా చేయలేదు. చెప్పుడు మాటలు విని, మస్తాన్ సాయిని అప్పటికి దూరం పెట్టలేక సతమతమై నలిగిపోయాను. రెండేళ్ల తర్వాత ఇప్పుడు మస్తాన్ సాయి గురించి బయట పెట్టగలిగాను. ఐయామ్ వెరీ సారీ రాజ్ తరుణ్, ఇక్కడే ఉంటే నీ కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్పాలని ఉంది. వాళ్ల తల్లిదండ్రులకు కూడా సారీ చెబుతున్నాను. నావల్ల పడకూడని మాటలు పడ్డారు.”
ఇలా మీడియా ముఖంగా రాజ్ తరుణ్ కు భేషరతుగా క్షమాపణలు చెప్పింది లావణ్య. రాజ్ తరుణ్ పై పెట్టిన కేసుల్ని వెనక్కు తీసుకుంటానని ప్రకటించిన లావణ్య.. మస్తాన్ సాయిని మాత్రం వదిలేదని లేదని, కోర్టులోనే తేల్చుకుంటానని అంటోంది.
“రాజ్ తరుణ్ మంచోడు, క్రిమినల్ కాదు కాబట్టి నన్నేం చేయలేదు. మస్తాన్ సాయి మంచోడు కాదు, అందుకే అతడి దగ్గర్నుంచి హార్డ్ డిస్క్ తీసుకోవడానికి నాకు టైమ్ పట్టింది. రాజ్ తరుణ్ పై పెట్టిన కేసులు వెనక్కు తీసుకుంటున్నాను. మస్తాన్ సాయి నా జీవితంలోకి వచ్చిన తర్వాతే ఇవన్నీ జరిగాయి, ఎన్నో తప్పులు చేశాడు. అతడిపై పెట్టిన కేసులను నేను కోర్టులోనే తేల్చుకుంటాను. అతడితో పాటు నాక్కూడా కోర్టు శిక్ష విధిస్తే అనుభవించడానికి రెడీ.”
మస్తాన్ సాయి దగ్గర 850కి పైగా వీడియోలున్నాయని ఆరోపిస్తున్న లావణ్య… అందులో తన వీడియోలు కూడా ఉన్నాయని చెబుతోంది. తనపై మస్తాన్ సాయి 3 సార్లు లైంగికంగా దాడి చేశాడని, ఎన్నోసార్లు భౌతిక దాడులు చేశాడని ఆరోపిస్తోంది. రేపోమాపో తనను మస్తాన్ సాయి చంపేస్తాడని.. ఈలోగా రాజ్ తరుణ్ కు క్షమాపణలు చెబుతున్నానని అంటోంది.
Ayo
ప్లే బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు,
ఒరేయ్ నువ్వు మస్తాన్ సాయి వాళ్ళ ఫాథర్ కు పుట్టిన అక్రమ సంతానం కదా…