ఊహించని విధంగా అర్థరాత్రి వేళ కత్తి పోట్లకు గురయ్యాడు సైఫ్ అలీఖాన్. అతడి వెన్నులో తీవ్ర గాయమైంది. వెంటనే బయటకొచ్చి ఆటో ఎక్కి హాస్పిటల్ కు వెళ్లాడు. మరి ఆ టైమ్ లో సైఫ్ వెంట కరీనా ఎందుకు లేదు? సైఫ్ ను తీసుకొని ఆమె హాస్పిటల్ కు ఎందుకు వెళ్లలేదు?
కొన్ని రోజుల కిందట ఈ అంశంపై చాలా పెద్ద చర్చ నడిచింది. అందరూ కరీనాను దోషిగా చూశారు కూడా. బాలీవుడ్ మీడియా అయితే మరో అడుగు ముందుకేసి, అంతా కరీనానే చేసిందనే విధంగా వార్తలు వండివార్చారు.
ఎట్టకేలకు ఈ అంశంపై సైఫ్ స్పందించాడు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి, కోలుకున్న తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడాడు సైఫ్ అలీఖాన్. ఆరోజు తన భార్య కరీనా, తనతో పాటు ఎందుకు బయటకు రాలేదో వెళ్లడించాడు.
“అగంతకుడు నన్ను పొడిచాడు. అతడ్ని బాత్రూమ్ లో బంధించి మేమంతా వేరే గదిలోకి వచ్చాం. అప్పటికే తైమూర్ ను తీసుకొని కరీనా బయటకొచ్చింది. అగంతకుడు ఇంకా అక్కడే ఉన్నాడు, మరిన్ని దాడులు చేయొచ్చని కరీనా భయపడింది. చిన్న కొడుకు జెహ్ ను సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలనుకుంది. ఈలోగా ఆలస్యం చేయకూడదనే ఉద్దేశంతో నన్ను, తైమూర్ ను, నా సహాయకుడు హరిని ఆటోలో ఎక్కించింది.”
అందుకే కరీనా తనతో పాటు హాస్పిటల్ కు రాలేదని అసలు విషయాన్ని వెల్లడించాడు సైఫ్. చిన్న కొడుకు జెహ్ ను సోదరి ఇంట్లో దించి, అట్నుంచిఅటు నేరుగా తనను చూడ్డానికి కరీనా హాస్పిటల్ కు వచ్చిందని తెలిపాడు. ఇంట్లోకి చొరబడి, తనను గాయపరిచిన వ్యక్తిని గుర్తుపట్టినట్టు వెల్లడించాడు సైఫ్.
ప్లే బాయ్ వర్క్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Nud call available >>>తొమ్మిది, సున్న, ఒకటి, తొమిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది
బాత్ రూంలో బంధించిన దొంగ ఎలా మాయమై పోయాడు