Advertisement

Advertisement


Home > Movies - Movie News

మూడేళ్ల నుంచి భయంతో పోరాటం - సమంత

మూడేళ్ల నుంచి భయంతో పోరాటం - సమంత

ఈమధ్య కాలంలో చాలా అడ్డంకులు, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంది సమంత. వాటి నుంచి తను నేర్చుకున్న పాఠాన్ని బయటపెట్టింది. ఏ విషయమైతే మనల్ని భయపెడుతుందో, ముందుగా ఆ అంశాన్ని ఎదుర్కోవాలని చెబుతోంది సమంత. శాకుంతలం సినిమాను అంగీకరించడానికి ఈ వైఖరి కూడా ఓ కారణమని చెబుతోంది.

"మొదటిసారి శకుంతల కథ విన్నప్పుడు చేయడానికి చాలా భయమేసింది. నా పాత్ర గురించి చెప్పిన వెంటనే నో అని చెప్పేశాను. శకుంతల పాత్ర సాధారణమైన పాత్ర కాదు, అందుకే అలాంటి రోల్ చేయడానికి భయమేసింది. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకు శకుంతల పాత్ర చేయడానికి అంగీకరించాను. గడిచిన మూడేళ్లుగా ఓ నియమం పెట్టుకున్నాను. అదేంటంటే, నాకు భయమేసిందంటే, ముందు దాన్ని పూర్తిచేసేయాల్సిందే. ఆ భయాన్ని దాటాలని నిర్ణయించుకున్నాను. ఏ అంశమైతే భయపెడుతుందో దాన్ని ఎదుర్కోవడం మొదలుపెట్టాను. అలా మూడేళ్లలో వ్యక్తిగతంగా, సినిమాల పరంగా నాలో వచ్చిన మార్పునకు ఈ నిర్ణయమే కారణం."

తన మానసిక సంఘర్షణ, ఎదుర్కొన్న పరిస్థితుల నుంచి వ్యక్తిగతంగా మరింత రాటుదేలానని చెబుతోంది సమంత. ఇప్పటికీ తనకు కొన్ని భయాలున్నాయని, అయితే వాటిని ఎదుర్కొనేంత ధైర్యం కూడా తనకు ఉందని తెలిపింది. శకుంతల పాత్ర ముందుగా తనను భయపెట్టిందని, ఆ భయాన్ని అధిగమించడం కోసం సినిమా చేయడానికి ఒప్పుకున్నానని అంటోంది.

శకుంతల పాత్ర కోసం శారీరకంగా పెద్దగా కష్టపడలేదంట సమంత. యశోద సినిమా కోసం పెంచిన కండల్ని తగ్గించడం కోసం ఎక్సర్ సైజులు తగ్గించిందట. కాకపోతే శకుంతల పాత్ర కోసం మానసికంగా సిద్ధమవ్వడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని తెలిపింది. పురాణాల్లో ఉన్న శకుంతల పాత్ర అత్యంత స్వచ్ఛమైనదని, ఎంతో నిజాయితీ ఉందని.. అలాంటి పాత్రను పోషించడం కోసం మానసికంగా తను చాలా ప్రిపేర్ అవ్వాల్సి వచ్చిందని తెలిపింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?