తన పెళ్లి, లైఫ్ పార్టనర్ పై మరోసారి స్పందించాడు విజయ్ దేవరకొండ. ఈ ఏడాది పెళ్లి చేసుకోనని క్లారిటీ ఇచ్చిన ఈ హీరో, తనకు నచ్చిన అమ్మాయి అందరికీ నచ్చాలే ఉండాలని అన్నాడు.
“నాకు కూడా అందరిలా పెళ్లి చేసుకోవాలని ఉంది. నా పిల్లలతో ఆడుకోవాలని ఉంది. కానీ ఈ ఏడాది మాత్రం పెళ్లి చేసుకోను. చేసుకుంటే మాత్రం లవ్ మ్యారేజ్ మాత్రమే చేసుకుంటాను. అదే సమయంలో నా అమ్మా-నాన్న కూడా నేను ప్రేమించిన అమ్మాయిని ఇష్టపడాలి. అలాంటి అమ్మాయిని చేసుకుంటా.”
ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్ కోసం చెన్నై వెళ్లిన విజయ్ దేవరకొండ, అక్కడి మీడియాతో మాట్లాడాడు. తనపై వస్తున్న గాసిప్స్ పై రియాక్ట్ అయ్యాడు.
“గాసిప్స్ ను పెద్దగా పట్టించుకోను. అవి ఫన్నీగా ఉంటే ఎంజాయ్ చేస్తాను, ఇబ్బందిగా ఉంటే విని వదిలేస్తాను. అయినా నా వృత్తిలో గాసిప్స్ ఓ భాగం కదా. గాసిప్స్ చాలా కామన్. అందరిపై గాసిప్స్ ఉంటాయి. నాపై వచ్చిన గాసిప్స్ మాత్రం మీడియాలో కనిపిస్తాయి. నేను పెద్దగా పట్టించుకోను.”
ఫ్యామిలీ స్టార్ సెట్స్ లో రష్మికను మిస్సయ్యానని తెలిపిన విజయ్ దేవరకొండ… మరో మంచి కథతో కచ్చితంగా ఆమెతో సినిమా చేస్తానని ప్రకటించాడు. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమాపై స్పందిస్తూ, గీతగోవిందం సినిమాకు స్టెరాయిడ్స్ ఎక్కిస్తే ఎలా ఉంటుందో, ఫ్యామిలీ స్టార్ అలా ఉంటుందన్నాడు. 2 గంటల 40 నిమిషాల నిడివి గల ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ వినోదం అందిస్తుందని చెబుతున్నాడు.