ఊహించని విధంగా టాలీవుడ్ లో మరో డ్రగ్స్ కోణం వెలుగుచూసింది. బాలీవుడ్ డ్రగ్స్ కేసుకు లింక్ గా ఈ అరెస్ట్ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఆ హీరోయిన్ ఎవరనే విషయాన్ని మాత్రం అధికారులు బయటకు చెప్పడం లేదు. మరోవైపు ఇండస్ట్రీ మాత్రం దీనిపై భిన్న రకాలుగా స్పందిస్తోంది.
బాలీవుడ్ లో సుశాంత్ మరణం తర్వాత ఆ కేసు డ్రగ్స్ మలుపు తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఎన్సీబీ గట్టిగా పట్టు బిగింది. ఈ క్రమంలో పలువురు టాలీవుడ్ ప్రముఖుల పేర్లు కూడా తెరపైకొచ్చాయి. ఓ హీరోయిన్ ను ఎన్సీబీ అధికారులు విచారించారు కూడా. ఇక అంతా చల్లారిందనుకున్న టైమ్ లో మరో హీరోయిన్ పట్టుబడింది.
ముంబయిలోని మిరా రోడ్డులో ఉన్న ఓ పెద్ద హోటల్ లో డ్రగ్స్ రాకెట్ ను ఛేదించారు ఎన్సీబీ అధికారులు. ఈ రైడ్ లో డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న సయీద్ అనే వ్యక్తి తప్పించుకోగా.. స్పాట్ లో టాలీవుడ్ హీరోయిన్ దొరికిపోయింది. ఆమెతో పాటు చాంద్ మహమ్మద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. 400 గ్రాముల ఎండీ (మెఫిడ్రిన్) అనే మాదకద్రవ్యాన్ని సీజ్ చేశారు. దీని విలువ మార్కెట్లో 10లక్షల వరకు ఉంటుంది.
ఇప్పుడీ హీరోయిన్ ఎవరనే విషయంపై ఇండస్ట్రీలో జోరుగా చర్చ సాగుతోంది. కొందరికి ఆ హీరోయిన్ ఎవరనే విషయం తెలుసు కానీ పేరు బయటకు చెప్పడం లేదు.
ఆమె పలు బి-గ్రేడ్, సి-గ్రేడ్ సినిమాల్లో నటించింది. ఇప్పటివరకు ఆమె 4 సినిమాల్లో నటించింది. అయితే మరికొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులు మాత్రం ఆమె ప్రభావం పరిశ్రమపై పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఆమె హీరోయిన్ కాదని, సీనియల్స్ లో యాక్ట్ చేసే నటి అని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె సినిమా హీరోయిన్ అయినా, సీరియల్ నటి అయినా.. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో తెలుగు నటి ఉందనే విషయం మాత్రం తేలిపోయింది.