Advertisement

Advertisement


Home > Movies - Press Releases

రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ ‘తెలిసిన వాళ్లు’

రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ ‘తెలిసిన వాళ్లు’

రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ జంటగా సిరింజ్ సినిమా బ్యానర్‌పై వస్తున్న సినిమా తెలిసిన వాళ్లు. ఈ సినిమాను విప్లవ్ కోనేటి తెరకెక్కిస్తున్నారు. 

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ లుక్ బాగుందని ఫీడ్ బ్యాక్ వస్తోందని యూనిట్ వర్గాలు ఆనందంగా వున్నాయి. 

విప్లవ్ కోనేటి ఈ సినిమాను తెరకెక్కిస్తూ ఆయనే స్వయంగా నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు.. అనంత్ నాగ్, అజయ్ నాగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్. 

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. సినిమాలో విఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు మేకర్స్. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?