జుట్టున్నమ్మ ఏ కొప్పయినా వేస్తుందని సామెత..
అందం కూడా అలాంటిదే. అందాలు చిందే ముద్దుగుమ్మను ముందునుంచి చూసినా వెనుకనుంచి చూసినా.. ఆ అందం ఇనుమడిస్తూనే ఉంటుంది. ఎటొచ్చీ.. అందాల తూకంబద్ద మీద ఆమె స్థానం ఎక్కడ ఉంటుందనేదే మీమాంస. అయితే ఈ అందాల ప్రదర్శనలో కూడా ఓ చిన్న పితలాటకం ఉంది. ‘సర్వాంగణ్యాని…’ పాలుగారే ముద్దుగుమ్మలే అయినప్పటికిన్నీ.. ఒక్కొక్క భామలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అదిరే అధరాలు కొందరివైతే… గుండె ఝుల్లు మనిపించే జఘన సౌందర్యం కొందరి సొంతం… ఇలా చెప్పుకుంటూ పోతే.. సౌందర్యపిపాసకుల నోరూరిపోతుంది గానీ… నిజానికి ఇక్కడ మనం బ్యాక్‌బ్యూటీ గురించి మాట్లాడుకుంటున్నాం.
‘మీ బ్యాక్ బాగుంది.. యాక్చువల్లీ.. నేను చూడాలని చూడలేదూ…’ అని నసుగుతూ.. తన మనసులో భావాల్ని హీరో డైలాగుల్తో వ్యక్తీకరింపజేసి… కమలిని ముఖర్జీ పట్ల తన సౌందర్యారాధనను చాటుకున్నాడు శేఖర్ కమ్ముల తొలిచిత్రంలోనే. అయితే తెలుగుతెరమీద బ్యాక్ అందాలను ప్రదర్శించి.. ప్రేక్షకలోకాన్ని సమ్మోహితుల్ని చేయడానికి ప్రయత్నించిన భామలు చాలామందే ఉన్నారు. తాజాగా చిత్రంలో సంగతి ఏ రేంజిలో ఉంటుందో గానీ.. ఫోటోసెషన్‌లో మాత్రం అలా బ్యాక్‌బ్యూటీ గా అలరించే ప్రయత్నం చేస్తున్నది ఫ్యామిలీగాళ్‌గా గుర్తింపు ఉన్న అంజలి.
అసలే ఎర్రటి పాలమీగడలాంటి అందం.. శ్వేతాంబర శారీ ధారిగా.. ఇలా తాజా ఫోటోసెషన్‌లో అలరించింది. విశాలమైన ఫుట్‌బాల్ మైదానంలాంటి బ్యాక్ అందాలను శృంగార ప్రియులకోసం ఇలా అందిస్తోంది. అమ్మడు బ్యాక్ చూపించడంలో సీనియరే..! ఇదిగో.. ఇదివరలో ఒకనాటి అందాల ఫోటో కూడా ఇక్కడే ఉంది. ఇక చూసి ఎవరి రసాస్వాదన స్థాయి మేరకు వారు ఆనందించడమే.. !!