బుల్లి ఎన్టీఆర్‌ ఇడుగో..

స్వర్గీయ నందమూరి తారకరామారావు తనయుడు హరికృష్ణ కుమారుడైన జూనియర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజు రేపు (మే 20). ఈ సందర్భంగా తన కుమారుడితో దిగిన ఫొటోల్ని అభిమానుల కోసం విడుదల చేశాడు జూనియర్‌ ఎన్టీఆర్‌. కుమారుడు…

స్వర్గీయ నందమూరి తారకరామారావు తనయుడు హరికృష్ణ కుమారుడైన జూనియర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజు రేపు (మే 20). ఈ సందర్భంగా తన కుమారుడితో దిగిన ఫొటోల్ని అభిమానుల కోసం విడుదల చేశాడు జూనియర్‌ ఎన్టీఆర్‌. కుమారుడు అభయ్‌ రామ్‌తో ఖుషీ ఖుషీగా జూనియర్‌ ఎన్టీఆర్‌ కనిపిస్తున్నాడు. పుత్రోత్సాహం అలానే వుంటుంది మరి.

సీనియర్‌ ఎన్టీఆర్‌ నట వారసుడిగా బాలకృష్ణ మాత్రమే కాకుండా, హరికృష్ణ కూడా పలు సినిమాల్లో నటించిన విషయం విదితమే. బాలకృష్ణ తర్వాత ఆ స్థాయి స్టార్‌ డమ్‌ హరికృష్ణ తనయుడైన జూనియర్‌ ఎన్టీఆర్‌కే దక్కింది. అతి త్వరలో బాలకృష్ణ తనయుడు కూడా తెరంగేట్రానికి రెడీ అవుతున్నాడు. ఆ తర్వాతి తరం నట వారసుడిగా జూనియర్‌ ఎన్టీఆర్‌ తనయుడు అభయ్‌ రామ్‌ కూడా సినిమాల్లో రాణిస్తాడేమో కాలమే సమాధానం చెబుతుంది.

ఇక, తమ అభిమాన హీరో, తన పుట్టినరోజునాడు తన కుమారుడి ఫొటోల్ని తమ ముందుంచడంతో జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది.