అంత‌టి మెజారిటీలే క‌రిగిపోయాయి.. త‌మ్ముళ్లూ జాగ్ర‌త్త‌!

నాటి అనంత‌పురం జిల్లా పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలో 2019 ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ‌చ్చిన మెజారిటీ 31 వేలు! అప్ప‌ట్లో అది సంచ‌ల‌నం లాంటిదే. బీసీల జ‌నాభా గ‌ట్టిగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం పార్టీకి…

నాటి అనంత‌పురం జిల్లా పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలో 2019 ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ‌చ్చిన మెజారిటీ 31 వేలు! అప్ప‌ట్లో అది సంచ‌ల‌నం లాంటిదే. బీసీల జ‌నాభా గ‌ట్టిగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం పార్టీకి మంచి క్యాడ‌ర్ ఉన్న నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెల‌వ‌డ‌మే గొప్ప అనుకున్న చోట ఏకంగా 30 వేల‌కు పైగా మెజారిటీ ద‌క్కింది!

క‌ట్ చేస్తే 2024 ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్క‌డ ఓట‌మి పాలైంది. ఇక్క‌డ తెలుగుదేశం పార్టీ తిరిగి విజ‌యం సాధించింది. అయితే ఈ సారి మెజారిటీ 8 వేల చిల్ల‌ర‌. దీనికి కార‌ణాలు ఏమిటంటే.. నిస్సందేహంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వ‌యంకృత‌మే. ప‌దివేల లోపు ఓట్ల తేడాతో ఓడిన చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో నిస్సందేహంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతి విశ్వాసంతో కోల్పోయింది.

ధ‌ర్మ‌వ‌రంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 20 వేల‌కుపైగా మెజారిటీ ద‌క్కింది. ఈ సారి బీజేపీ అభ్య‌ర్థి అక్క‌డ మూడు వేల ఏడు వంద‌ల ఓట్ల మెజారిటీతో నెగ్గాడు. స‌రిగ్గా ఇన్నే ఓట్ల‌ను కాంగ్రెస్ పార్టీ పొంద‌డం గ‌మ‌నార్హం! ధ‌ర్మ‌వ‌రంలో కాంగ్రెస్ అభ్య‌ర్థి మూడు వేల ఏడు వంద‌ల ఓట్ల‌ను పొందితే, స‌రిగ్గా అంతే మెజారిటీతో బీజేపీ అభ్య‌ర్థి గెలిచాడు! కేవ‌లం ధ‌ర్మ‌వ‌రం విష‌యంలోనే కాదు పుట్ట‌ప‌ర్తిలో కూడా అలాంటిదే జ‌రిగింది. పుట్ట‌ప‌ర్తిలో బీఎస్పీ అభ్య‌ర్థికి అటు ఇటుగా నాలుగు వేల ఓట్లు ప‌డ్డాయి!

క‌దిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019లో 27 వేల బంప‌ర్ మెజారిటీ ద‌క్కితే టీడీపీకి ఈ సారి మెజారిటీ ఏడు వేల‌ను మించ‌లేదు! అది కూడా అక్కడ తెలుగుదేశం అభ్య‌ర్థిగా కందికుంట వెంక‌ట ప్ర‌సాద్ వ‌ర‌స దండ‌యాత్ర‌లు చేస్తూ వ‌చ్చాడు!

మ‌డ‌క శిర‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నిక‌ల్లో 13 వేల మెజారిటీని సాధిస్తే, టీడీపీ ఈ సారి 351 ఓట్ల తేడాతో విజ‌యాన్ని న‌మోదు చేయ‌గ‌లిగింది! ఇక్క‌డ కాంగ్రెస్ ఏకంగా 17 వేల ఓట్ల‌ను సాధించ‌డం గ‌మ‌నార్హం!

రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 25 వేల మెజారిటీ ద‌క్కితే, ఈ సారి టీడీపీ అక్క‌డ 23 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే ప‌రిస్థితి పూర్తిగా త‌ల‌కిందుల అయ్యింది. క‌ల్యాణ దుర్గంలో మాత్రం తెలుగుదేశం పార్టీకి బంప‌ర్ విక్ట‌రీ ద‌క్కింది. 2019లో ఇక్క‌డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 19 వేల మెజారిటీ రాగా, ఈ సారి టీడీపీకి అక్క‌డ ఏకంగా 37 వేల మెజారిటీ ద‌క్కింది. ఇక్క‌డ టీడీపీ వైపుకు మెజారిటీనే రెట్టింపు కావ‌డం గ‌మ‌నార్హం.

శింగ‌న‌మ‌ల‌లో 2019 ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 46 వేల ఓట్ల మెజారిటీని సాధించ‌గా, ఈ సారి టీడీపీ అక్క‌డ ఆరేడు వేల ఓట్ల తేడా నెగ్గిన‌ట్టుగా ఉంది. తాడిప‌త్రిలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఏడు వేల మెజారిటీతో నెగ్గ‌గా, ఈ సారి టీడీపీకి 27 వేల వ‌ర‌కూ మెజారిటీ ద‌క్కింది.

గుంత‌క‌ల్ లో అయితే 2019 ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అటు ఇటుగా 50 వేల ఓట్ల మెజారిటీ ద‌క్కింది. ఈ సారి తెలుగుదేశం పార్టీ ఏడు వేల లోపు మెజారిటీ తో నెగ్గింది.

క‌ర్నూలు జిల్లాలోకి ఎంట‌రైతే.. ఆలూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40 వేల స్థాయి మెజారిటీ రాగా, ఈ సారి మూడు వేల లోపు మెజారిటీతో ఆ పార్టీనే నెగ్గింది. ఆదోనిలో 2019 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప‌ది వేల‌కు పైగా మెజారిటీ నెగ్గితే ఈ సారి కూట‌మి అభ్య‌ర్థిగా బీజేపీ అభ్య‌ర్థి అక్క‌డ 18 వేల‌కుపైగా మెజారిటీతో నెగ్గాడు.

మంత్రాల‌యంలో 2019 ఎన్నిక‌ల్లో 23 వేల మెజారిటీతో నెగ్గిన బాల‌నాగిరెడ్డి, ఈ సారి 12 వేల మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున తిరిగి ఎన్నిక‌య్యారు. ఎమ్మిగ‌నూరులో 2019 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 25 వేల మెజారిటీ ద‌క్కితే, ఈ సారి తెలుగుదేశం పార్టీకి అక్క‌డ 15 వేల మెజారిటీ వ‌ర‌కూ ద‌క్కింది. కొడుమూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నిక‌ల్లో 36 వేల‌కు పైగా మెజారిటీ ద‌క్కితే, ఈ సారి టీడీపీ అక్క‌డ 21 వేల వ‌ర‌కూ మెజారిటీ ద‌క్కింది. ప‌త్తికొండ‌లో 2019 ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42 వేల మెజారిటీ ద‌క్కితే ఈ సారి టీడీపీ 14 వేల మెజారిటీతో నెగ్గింది.

డోన్ లో తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థిపై 2019 ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి బుగ్గ‌న 35 వేల మెజారిటీతో నెగ్గారు, 2024 వ‌చ్చే స‌రికి ఆయ‌నే ఆరు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. నంద్యాల‌లో 2019 ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 35 వేల వ‌ర‌కూ మెజారిటీ వ‌స్తే ఈ సారి టీడీపీకి అక్క‌డ 12 వేల మెజారిటీ ద‌క్కింది.

పాణ్యంలో 2019 ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40 వేల మెజారిటీ ద‌క్కితే, ఈ సారి అక్క‌డ ప‌రిస్థితి రివ‌ర్స్ అయ్యింది. తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థికి స‌రిగ్గా అంతే స్థాయి మెజారిటీ ద‌క్కింది! నందికొట్కూరులో 2019 ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40 వేల స్థాయి మెజారిటీ ద‌క్కితే ఈ సారి అక్క‌డ టీడీపీ తొమ్మిది వేల స్థాయి మెజారిటీతో నెగ్గింది.

శ్రీశైలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నిక‌ల్లో 38 వేల మెజారిటీ వ‌స్తే ఈ సారి అక్క‌డ టీడీపీకి ఏడు వేల లోపు మెజారిటీ ద‌క్కింది. ఆళ్ల‌గ‌డ్డ‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నిక‌ల్లో 35 వేల మెజారిటీ ద‌క్కితే ఈ సారి టీడీపీ అక్క‌డ 12 వేల మెజారిటీతో నెగ్గింది.

ప్రొద్దుటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నిక‌ల్లో 44 వేల మెజారిటీ ద‌క్కితే ఈ సారి టీడీపీకి 22 వేల మెజారిటీ ద‌క్కింది. జ‌మ్మ‌ల‌మ‌డుగులో తెలుగుదేశం పార్టీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నిక‌ల్లో 50 వేల‌కు పైగా మెజారిటీ తో నెగ్గితే, 2024 ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కూట‌మి త‌ర‌ఫున బీజేపీకి 17 వేల ఓట్ల మెజారిటీ ద‌క్కింది. క‌మ‌లాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నిక‌ల్లో 27 వేల ఓట్ల మెజారిటీ ద‌క్కితే, ఇప్పుడు టీడీపీకి దాదాపు అదే స్థాయి మెజారిటీ ద‌క్కింది.

రాయ‌చోటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నిక‌ల్లో 25 వేల‌కు పైగా మెజారిటీ వ‌స్తే ఈ సారి అక్క‌డ టీడీపీ 2500 ఓట్ల స్థాయి మెజారిటీ తో నెగ్గింది. రైల్వే కోడూరులో 34 వేల మెజారిటీతో 2019 ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గితే అక్క‌డ జ‌న‌సేన అభ్య‌ర్థి ఇప్పుడు 11 వేల మెజారిటీతో నెగ్గాడు. రాజంపేట‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థికి 2019 ఎన్నిక‌ల్లో 35 వేల‌కు పైగా మెజారిటీ ద‌క్కితే, ఇప్పుడు టీడీపీ అభ్య‌ర్థికి ఏడు వేల మెజారిటీ ద‌క్కింది!

ఇది రాయ‌ల‌సీమ‌లోని చాలా నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిస్థితి. 2019 ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క‌నిష్టంగా ఇర‌వై వేలు, గ‌రిష్టంగా 50 వేల మెజారిటీలు సాధించిన నియోజ‌క‌వ‌ర్గాల్లో.. 2024 ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి గ‌త రికార్డు స్థాయి మెజారిటీలు క‌రిగిపోయి తెలుగుదేశం పార్టీకి, దాని మిత్ర‌ప‌క్షాలు బీజేపీ- జ‌న‌సేన‌ల అభ్య‌ర్థుల‌కు కూడా క‌నీసం ప‌ది వేల లోపు ఓట్ల మెజారిటీలుగా మారాయి.

కారణాలు ఏమిట‌నేవి ప‌క్క‌న పెడితే, గెలిచిన టీడీపీ అభ్య‌ర్థులు అయినా, వారి త‌ర‌ఫున విర్ర‌వీగి ర‌చ్చ‌లు చేసుకుంటున్న వారు అయినా కాస్త జాగ్ర‌త్త‌గా ఉంటే వారికే మంచిది! ప్ర‌జాస్వామ్యంలో వేల‌కు వేల మెజారిటీలు కూడా క‌రిగిపోయి అడ్డం తిరుగుతాయి! 2019 ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన జోష్ తో పోలిస్తే.. టీడీపీకి ఇప్పుడు సీమ‌లో ద‌క్కిన మెజారిటీలు ప‌దో వంతే! 2019 నాటి మెజారిటీలే ఐదేళ్ల‌కు క‌రిగిపోయి అడ్ర‌స్ లేకుండా పోయిన‌ప్పుడు.. ఇప్పుడు టీడీపీకి ద‌క్కిన మెజారిటీలు చాలా స్వ‌ల్పం! కాబ‌ట్టి.. త‌మ్ముళ్లు తత్వం ఎరిగి న‌డుచుకుంటే మంచిది!

49 Replies to “అంత‌టి మెజారిటీలే క‌రిగిపోయాయి.. త‌మ్ముళ్లూ జాగ్ర‌త్త‌!”

  1. అయ్యా.. ఈ ముక్క మేము 2021 నుండి జగన్ రెడ్డి ప్రభుత్వానికి.. నీ “చెడుగుడు” ఆర్టికల్స్ లో కామెంట్స్ లో తెలియజేస్తూనే ఉన్నాము..

    మీరు గ్రహించారా..? మీ తప్పులు తెలుసుకొన్నారా..? మీ లోపాలు సరి చేసుకున్నారా..?

    లేదు కదా..

    ఇప్పుడు మీరు ఎందుకు నీతులు వల్లిస్తున్నారో చెప్పనా…? మీకు తీవ్ర నష్టం జరుగుతోంది.. ఈ ఐదేళ్లు మీ జగన్ రెడ్డి పార్టీ నామరూపాల్లేకుండా పోతుందేమో అనే భయం వేస్తోంది.. అందుకే మీరు చేసిన తప్పులను మాకు కూడా ఆపాదించి మాకు జాగ్రత్తలు చెపుతున్నారు..

    మీ జగన్ రెడ్డి చేసిన తప్పులు, అరాచకాలు, అబద్ధాలు ప్రజల్లో భయాందోళనలు కలిగించాయి..

    2019 లో జగన్ రెడ్డి కి ఒక ఛాన్స్ ఇచ్చారు అంతే.. అది చంద్రబాబు మీద కోపం కాదు..

    కానీ 2024 లో జగన్ రెడ్డి మీద కోపం తో మరలా చంద్రబాబు ని ఎన్నుకొన్నారు..

    నెక్స్ట్ 20 ఏళ్ళు జగన్ రెడ్డి మళ్ళీ అధికారం లోకి రాడు ..రాలేడు..రానివ్వము.. వాడు సర్కస్ ఫీట్లు చేసుకుంటూ బతకాల్సిందే..

    నీ నీతులు మడిచి నీగుద్దలో పెట్టుకో.. మాకు అక్కరలేదు..

    మాకు తెలుసు నీ జగన్ రెడ్డి ని ఎక్కడ ఎలా ఒంగోబెట్టేయాలో..

    1. ప్రతీ కుక్కకి ఒక రోజు వస్తుంది… ఈ రోజు మీకు వచ్చింది..కానివ్వండి….

      కుక్కని సింహాసనం మీద పెట్టాక ఏమైనా సింహంలా ఉంటుందా.. ? కుక్కలానే ఉంటుంది..

      1. మరీ కుక్క అనేశారు నాకైతే వాడు మాడా లాగా అనిపిస్తాడు, ఆ కులుకు, నవ్వు, హావభావాలు etc etc

      2. అంటే నీలికుక్కలకు సమయం అయిపోయిందంటారా..?

        ఇక కుక్కలబండిలో వేసి కుమ్మేసుకోవచ్చు..

        సింగల్ సింహం మాత్రం బెంగుళూరు పారిపోయింది.. ఇక నీలికుక్కలకు వచ్చే రోజు మాత్రం ఉండదు.. దివాళా పార్టీ.. దివాళా మనుషులు..

  2. రాజంపేట‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థికి 2019 ఎన్నిక‌ల్లో 35 వేల‌కు పైగా మెజారిటీ ద‌క్కితే, ఇప్పుడు టీడీపీ అభ్య‌ర్థికి ఏడు వేల మెజారిటీ ద‌క్కింది!

    రాజంపేట‌లో 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. check chesko.

    1. మేము అంతే.. అబద్ధాలు రాస్తుంటాం.. అబద్ధాలు చెపుతుంటాం..

      మాకు మీడియా సపోర్ట్ లేదంటాం..

      బాబాయ్ ని చంపేసి.. నారాసురరక్తచరిత్ర అంటాం..

      99% మేనిఫెస్టో చేసేశాం అని చెపుతాం..

      మద్యపాన నిషేధం చేసేశాం అని చెపుతాం..

      సీపీఎస్ రద్దు చేసేసాం అని చెపుతాం.

      మేము అంతే.. అబద్దాలతో బతుకుతాం.. మీరే అర్థం చేసుకోవాలి..

      1. Jagan gps tese danine amalu chesindi meru, navaratnalu lo 99% amalu chesaru jagan,adi tisukunta valaki telusu,

        Madhya nisedam kosame rates penchadu,belt shops musesadu

  3. :red book rules 

    ఇప్ప టివరకూ 36 మం ది రాజకీయ హత్య లకు గురయ్యా రు.

    ఎన్ని కేసులు పెట్టిం చుకుం టే అం త పెద్ద పదవి

    ఎన్ని హత్యలు చేతే అంత పెద్ద పదవి. ఆ ప్రకారం ఇప్పు డు మర్డర్లు చేసినవారికి మం త్రి హోదా ఏమైనా కల్పి స్తారేమో చూడాలి.

  4. తత్వం లాగా లేదు, బెదిరింపు లాగా ఉంది. మొన్న జరిగింది రేపు జరగొచ్చు జరగపోవచ్చు.

  5. బెల్లం కొండపై బాలకృష్ణ తుపాకీ ఎందుకు కాల్పులు జరిపారనే ప్రశ్న ఇప్పటికీ నా మనసులో ఉంది. ఎందుకు?

  6. మీరు ఎంత గింజుకున్నా మళ్ళీ సిఎం అవుతారు అని కలలు తప్ప ఎవరూ కోరుకోరు …

  7. Nuvvu chepina niyogika vargallu Ani ycp kanchukottaley…avey baddalu Aya yantey..Jagan gari pallana Ella sagindo aratham avvali meku.. 2014 lo kuda rayalaseema manchi majority vachindi ycp ki .. Rayalaseema loney favour ga ledantey.. Inka ee jagan CM kaledu

  8. Engineering colleges are demanding a fee of 40K per year from EWS people which was previously free. This needs to be addressed immediately as management is claiming that they have approval from government to charge this fee.

  9. మెజారిటీలు లక్ష దాటలేదు కావున గెలిచిన కూటమి అభ్యర్థులందరిని అనర్హులుగా ప్రకటించి 11లో ఒకడైన మామయ్యని షీయం చెయ్యాలని ఢిల్లీలో ధర్నా చేయబోతున్న వైనాట్ పార్టీ… రాష్ట్రపతికి మామయ్య అల్టిమేటం…

  10. మెజారిటీలులక్షదాటలేదుకావునగెలిచినకూటమిఅభ్యర్థులందరినిఅనర్హులుగాప్రకటించి11లోఒకడైనమామయ్యనిషీయంచెయ్యాలనిిఢిల్లీలోధర్నాచేయబోతున్నవైనాట్’పార్టీ… రాష్ట్రపతికిమామయ్యఅల్టిమేటం…

  11. పార్టీ, కులం, మతం, ప్రాంతం చూడకుండా జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని అనుభవించిన పచ్చ గుల గాళ్ళు అప్పట్లో వైసీపీలోకి వెళ్లి నిజమైన కార్యకర్తలని పక్కకునెట్టి బాగానే సంపాయించుకున్నారు.

    అంతటితో వారి గుల తీరలేదు…

    పసుపుపతి బాబు వస్తే అంతకంటే డబల్ సంపాయించుకోవచ్చు.

    అలాగే పేదలని హింసించవచ్చు, వాళ్ళ ఆస్తులు లాక్కోవచ్చు, వాళ్ళ ఆడపిల్లలని చెరచవచ్చు, వాళ్ళని చంపవచ్చు. కేసులు లేవు…కనీసం పోయినవాళ్ల శవాలు కూడా దొరికే పరిస్థితి లేదు.

    ఆంధ్రులారా సినిమా ఇప్పుడే మొదలయింది…పేర్లు అయిపోయాయి…

    అసలు సినిమా ఇంకో 2 నెలల్లో మొదలెడతారు.

    ఇలా కూడా దోచుకోవచ్చా అని ప్రజలు సంబ్రమాశ్చర్యాలతో తన్మయం చెందేలోపు

    మీ జేబులు లూటీ అయిపోతాయి. ప్రజల పేరుమీద చేసే అప్పులు ఆవిరి అయిపోతాయి.

  12. మోడీనే ఈవీఎంలు మేనేజ్ చేసి పీఎం అయ్యాడు అని రావుల్ బాబాలాంటివాళ్ళు పార్లమెంటులోనే అంటున్నారు….ఇక పొత్తులో వచ్చిన చెంబు, పావలా సచ్చిలురు అని ప్రజలు ఎలా నమ్ముతారు…?

    దానికి తార్కాణంగా నెలరోజుల్లోనే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసారు.

    హత్యలు, మానభంగాలు, లూటీలు, దొమ్మీలు, దోపిడీలు, అరాచకాలు, ఘోరాలు

    ఊళ్లు విడిచి ప్రజలు హైదరాబాద్, బెంగళూరు పరుగులు తీస్తున్నారు.

    నిమ్మకు నీరెత్తిన ప్రభుత్వ పెద్దలు (చెంబు, పావలా స్వామి) అదేమీ పట్టనట్టు పెళ్ళిళ్ళకి, బారసాల్లాకి, పేరంటాలకు తిరుగుతున్నారు.

    పూలోకేశీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నాడు.

    రోజుకి కనీసం 5 మర్డర్లు (పేపర్ల లెక్కలో రోజుకో మర్డర్)

    రోజుకి కనీసం 5 రేపులు (పేపర్ల లెక్కలో రోజుకో రేపు)

    రోజుకి కనీసం 5 టన్నులు ఇసుక ఒక్కో గుల కమిటీ వాడికి (పేపర్ల లెక్కలో లేదు)

    నెలకి పెన్షన్ కి 500 కమిషన్ (అడిగితే వాళ్ళ పేరు పీకేయండి)

    గుల కమిటీ గుమ్మం లో ఇవ్వండి.

    75% అంగాలు లేనివారే దివ్యంగులు వాళ్ళ పేర్లే తీసుకోండి. వాళ్లలో మన పార్టీ వాళ్ళకే పెన్షన్.

    ఫ్రీ బస్, డీజిల్ డబ్బులు కట్టాలి.

    మిగతా సూపర్ సిక్స్ పథకాలు అన్ని గాలికి వదిలేశాము.

  13. ఏమి ఉండదు 2024 లో టీడీపీ మొత్తం గా తుడిచి పెట్టుకుపోయేనా పోతుంది టీడీపీ ఒంటరి పోరు చేసి గెలిచే పరిస్థితి లేదు వారికీ పొత్తు ఉంటే గెలిచేది 2 సారి పొత్తు ఉన్న గెలిచింది లేదు టీడీపీ ఎంత బుద్దిగా ఉంటే వారికీ రాబోయే రోజుల్లో అంత మంచిది

  14. జనసేనకు ఇచ్చిన 21 సీట్లలో వ్యతిరేక ప్రచారం చేసి అన్ని చోట్లా ఓడిపోవాలని ప్రచారం చేసిన మహసేన రాజేష్ ను ఎన్నికల ముందు ఓట్లు చీలకూడదు అని మొక్కుబడిగా సస్పెండ్ చేసి ఇప్పుడు తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో కూర్చోబెట్టి ప్రెస్ మీట్ లు పెట్టిస్తున్నారు…

    సైనిక్స్ కొందరు తెలుసుకున్నారు,చాలామంది ఇంకా బ్రమల్లోనే ఉన్నారు…

  15. 45 రోజులకే తెలుగుదేశం వాళ్లకు క్లారిటీ వచ్చింది మళ్ళీ గెలవలేము అని…

    రాష్ట్రాన్ని బీహార్ చేసేసారు అని అందరికీ అర్దం అయిపోయింది…

    మీకు ఇక నవ్వడాలు లేవు…

  16. ఇందాక ఒక విజయవాడ ఫ్రెండ్ చెప్పిన దాకా తెలియదు.. ఈ నెలరోజుల్లో అమరావతి కి ఎదో డబ్బులు ఖర్చు చేశారు అంట.. వర్షానికి మొత్తం హుష్ కాకి అంట .. పెద్ద అమౌంట్ లు అయి ఉండవు అంట లే

  17. అత్యంత విశ్వాసాని సమాచారం ప్రకారమ్.

    ప్రజల ఆలోచనలను సంక్షేమ పథకాలు నుంచి మళ్లిచట్టానికి , వినుకొండ మడర్‌ని మన చిన బాబు , పెద్ద బాబు ప్లాన్ చేసారు అంట.

Comments are closed.