వృత్తి రాజ‌కీయం- ప్ర‌వృత్తి అరాచ‌కం!

బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి అరాచ‌కాలు పెరిగిపోయాయ‌ని ప్ర‌భుత్వ అనుకూల ప‌త్రిక రాసిన క‌థ‌నం సంచ‌ల‌నం రేపుతోంది.

వైఎస్సార్ క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి అరాచ‌కాలు పెరిగిపోయాయ‌ని ప్ర‌భుత్వ అనుకూల ప‌త్రిక రాసిన క‌థ‌నం సంచ‌ల‌నం రేపుతోంది. ఆ క‌థ‌నం చ‌దివిన పాఠ‌కుల‌కు.. ఆది వృత్తి రాజ‌కీయం, ప్ర‌వృత్తి అరాచ‌కం అనే అభిప్రాయాన్ని క‌లిగిస్తోంద‌న్న చ‌ర్చ‌కు తెర‌లేచింది. కాంట్రాక్ట్ ప‌నుల‌న్నీ త‌మ వాళ్ల‌కు ఇవ్వ‌ని కార‌ణంగా, ఏకంగా సిమెంట్ ప‌రిశ్ర‌మ‌లో ఉత్ప‌త్తి నిలిచిపోయేలా చేశార‌ని ఆ క‌థ‌నం తేల్చి చెప్పింది.

జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలో మూడు సిమెంట్ ప‌రిశ్ర‌మ‌లు, ఒక థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్రాజెక్ట్ ఉన్నాయి. అధికారంలో ఉన్న బీజేపీ, టీడీపీ నాయ‌కులు, ఆ ప‌రిశ్ర‌మ‌ల‌ను ఆదాయ వ‌న‌రుగా మార్చుకోవాల‌ని భావించాయి. అధికారంలో ఎవ‌రున్నా చేసే ప‌ని ఇదే. అయితే కూట‌మి అధికారంలో డిమాండ్ స్థాయిని మించి, అరాచ‌కానికి తెర‌లేప‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

గ‌తంలో వైసీపీ హ‌యాంలో ప్ర‌జాప్ర‌తినిధుల బెదిరింపుల‌తో ప‌రిశ్ర‌మ‌లు త‌ర‌లివెళుతున్నాయ‌నే విమ‌ర్శ‌ల్ని టీడీపీ, జ‌న‌సేన నేత‌లు గుప్పించారు. ఇప్పుడు వాళ్ల పాల‌న‌లో వైసీపీ పాల‌కులే మేలు అనే నీతిలో వాళ్ల దౌర్జ‌న్యాలు ఉన్నాయ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఎప్ప‌టికీ చంద్ర‌బాబే అధికారంలో ఉండాల‌ని కోరుకునే ప‌త్రిక‌.. ఇవాళ కూట‌మి ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి అరాచ‌కాలు మితిమీరాయని రాయ‌డం, ప‌రిస్థితి తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతున్నాయి.

ఎర్ర‌గుంట్ల‌, చిల‌మ‌కూరుల‌లోని ఆల్ట్రా సిమెంట్ ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్లైయాష్‌, సున్న‌పురాయి స‌ర‌ఫ‌రా జ‌ర‌గ‌కుండా ఆదినారాయ‌ణ‌రెడ్డి అనుచ‌రులు అడ్డుకున్నారు. ఆర్టీపీపీ నుంచి ప్లైయాష్ స‌ర‌ఫ‌రా కాకుండా అడ్డుకున్నారు. సిమెంట్ త‌యారీకి అవ‌స‌ర‌మైన ముడిస‌రుకు స‌ర‌ఫరాను అడ్డుకోవ‌డంతో చిల‌మ‌కూరులో సిమెంట్ ప‌రిశ్ర‌మ ఉత్ప‌త్తి ఆగిపోయింది. ఇవాళ్టి నుంచి మ‌రో యూనిట్‌లో ఉత్ప‌త్తి ఆగిపోనున్న‌ట్టు స‌ద‌రు ప‌త్రిక రాయ‌డం గ‌మ‌నార్హం.

ఈ వ్య‌వ‌హారంపై సిమెంట్ ప‌రిశ్ర‌మ ప్ర‌తినిధులు క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స్వ‌యంగా క‌డ‌ప ఎస్పీకి క‌లెక్ట‌ర్ ఫోన్ చేసి అరాచ‌కాల్ని అడ్డుకోవాల‌ని కోర‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. గ‌తంలో కూడా ఆదినారాయ‌ణ‌రెడ్డి అనుచ‌రుల అరాచ‌కాలు వెలుగు చూశాయి. అయిన‌ప్ప‌టికీ అడ్డుకోలేక‌పోయారు. అందుకే అరాచ‌కాలు కొన‌సాగుతున్నాయ‌నే అభిప్రాయాన్ని కొట్టి పారేయ‌లేని ప‌రిస్థితి.

15 Replies to “వృత్తి రాజ‌కీయం- ప్ర‌వృత్తి అరాచ‌కం!”

  1. మన రాజా రెడ్డి, రాజశెకర్ రెడ్డి, జగన్ రెడ్డి ల ప్ర‌వృత్తి ఎమిటి?

    .

    17 CBI/ED కెసులు ఉన్నాయె…. నీది ఎ ప్ర‌వృత్తి??? నీ అయ్యా, తాత మీద ఎన్ని కె.-.సులు ఉన్నాయి?

    హైదరాబాదు లొ తన పార్టి ముక్యమంత్రినె దించటానికి, నీ అయ్యా మతకలహాలు శ్రుస్టించాడు అని అయన పార్టి వారె చెపుతున్నారు కదా?

    మరి అయనదెమి ప్ర‌వృత్తి??

    బాబాయి ని చంపి, గుండె పొటు అంటివె… మరి ఇదెమి ప్ర‌వృత్తి??

    .

    అవినీతి, అరాచకాలు, మర్దర్ కెసులతొ, మన Y.-.S కుటుంబం ఎనాడొ బ్రష్టుపట్టినది కదా! ఇంకా వృత్తి, ప్ర‌వృత్తి అంటూ గురువింద నీతులు ఎందుకు?

      1. Anyone can put a case on you.

        Stay is not something that you will get if you just apply.

        Court will give stay only after listing to both party arguments. If the court feels there is no prima facie it will give stay.

        All these cases on CBN are also dismissed later.

      2. ఎవరైనా మీ పై కేసు పెట్టవచ్చు. అంతమాత్రం చెత మీరు దరఖాస్తు చేసుకుంటే స్టే అనేది మీకు automatic గా లభించేది కాదు.

        .

        రెండు పార్టీల వాదనలను కోర్టు విని విచరణ చేసిన తర్వాత మాత్రమే కోర్టు స్టే ఇస్తుంది. ప్రాథమికంగా ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు భావిస్తే స్టే ఇస్తుంది.

        .

        CBN పై ఉన్న ఈ కేసులన్నీ కూడా తరువాత కొట్టివెసారు.

      3. ఎవరైనా మీ పై కే.-.సు పెట్టవచ్చు. అంతమాత్రం చెత మీరు దరఖాస్తు చేసుకుంటే స్టే అనేది మీకు automatic గా లభించేది కాదు.

        .

        రెండు పార్టీల వాదనలను కోర్టు విని విచరణ చేసిన తర్వాత మాత్రమే కోర్టు స్టే ఇస్తుంది. ప్రాథమికంగా ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు భావిస్తే స్టే ఇస్తుంది.

        .

        CBN పై ఉన్న ఈ కే.-.సులన్నీ కూడా తరువాత కొట్టివెసారు.

        1. కొట్టివేయడమే కాదు, సుప్రీమ్ కోర్ట్ వై యస్ విజయలక్ష్మి గారికి మొట్టికాయలు కూడా వేసింది. ఇవే ఆరోపణలపై మీ భర్త గతంలో రెండు సార్లు కోర్ట్ కి వచ్చారు, ఈ విషయం మీ పిటిషన్ లో పేర్కొనలేదు, ఆరోపణలు చేశారు కానీ ఆధారాలు చూపించలేదు, మీ రాజకీయ కక్షలకు కోర్ట్ లను వేదిక చేసుకోవద్దు అని చివాట్లు పెట్టింది. తరువాత లక్ష్మి పార్వతి కూడా కోర్ట్ కి వెళ్ళింది . ఆ పిటిషన్ కూడా కోర్ట్ కొట్టివేసింది.

      4. 25 కాదు 50 అను చూడటానికి ఇంకా చాలా బాగా ఉంటుంది, ఈ గాలి మాటలు ఎందుకు రవీ, ఆ కేసుల లిస్ట్ పెట్టొచ్చు కదా

    1. You are still not saying that Adinarayana did not do it which tells that the news is true and alliance leaders are exploiting businesses and industries and exporting commissions. Attacking is not always the best defense especially when people are comparing previous government and feeling Jagan’s rule is better than current rule. Alliance should atleast try to read ground reality and take corrective actions before it becomes too late.

    2. Land grabbing of NRIs is at peaks as per ground report. NTR and Nellore districts which played a big part of alliances recent victory is of no exception to these lands grabbing activities from alliance leaders.

Comments are closed.