వైసీపీ ఫైర్‌బ్రాండ్‌కు టైమ్ బ్యాడ్‌

జ‌గ‌న్ ఏదైనా అనుకుంటే, మ‌న‌సులో దాచి, చివ‌రి వ‌ర‌కూ చెప్ప‌కుండా మ‌భ్య‌పెట్టే మ‌న‌స్త‌త్వం కాద‌ని ముఖ్యంగా ఆ పార్టీ నేత‌ల‌కు బాగా తెలుసు

వైసీపీ ఫైర్‌బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజాకు ఆ పార్టీలో బ్యాడ్ టైమ్ మొద‌లైన‌ట్టే. మాజీ మంత్రి, దివంగ‌త నేత గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడి చిన్న కుమారుడు గాలి జ‌గ‌దీష్ వైసీపీలో చేర‌డానికి రంగం సిద్ధమైంది. నిజానికి ఇవాళ పార్టీలో చేర్చుకునేందుకు వైఎస్ జ‌గ‌న్ ఆహ్వానించార‌ని స‌మాచారం. అయితే రోజాతో ఒక్క మాట చెప్పి, ఆ త‌ర్వాత జ‌గ‌దీష్‌ను చేర్చుకోవాల‌ని జ‌గ‌న్ మ‌న‌సు మార్చుకున్నార‌ని తెలిసింది.

అయితే ప్ర‌స్తుతం రోజా న‌గ‌రిలో అందుబాటులో లేరు. రోజాకు క‌ష్టం వ‌స్తే, ఆల‌యాల చుట్టూ తిరుగుతుంటారు. ఇప్పుడామె అదే ప‌ని చేస్తున్న‌ట్టున్నారు. జ‌గ‌దీష్ చేరిక‌తో న‌గ‌రిలో రాజ‌కీయం మార‌నుంది. రానున్న రోజుల్లో గాలి త‌న‌యుల మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ముద్దుకృష్ణ‌మ పెద్ద కుమారుడు గాలి భానుప్ర‌కాశ్ మొద‌టిసారి న‌గ‌రి నుంచి టీడీపీ నుంచి రోజాపై పోటీ చేసి గెలుపొందారు. అయితే ప్ర‌జ‌ల‌కు అందుబాటులో వుండ‌డం లేద‌న్న వ్య‌తిరేక‌త ఆయ‌న‌పై మొద‌లైంది.

ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యే త‌మ్ముడు జ‌గ‌దీష్ వైసీపీలో చేర‌నుండ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. గాలి జ‌గ‌దీష్‌తో త‌న నాయ‌క‌త్వానికి ఏమీ కాద‌ని రోజా న‌మ్మ‌కంగా ఉన్నారు. కానీ వైఎస్ జ‌గ‌న్ మ‌న‌సులో వేరే ఆలోచ‌న వుంది. జ‌గ‌న్ త‌న మ‌న‌సులో మాట చెప్ప‌డానికే రోజాతో మాట్లాడాల‌ని అనుకుంటున్నారు. గాలి జ‌గ‌దీష్ చేరిక‌, ఇదే సంద‌ర్భంలో రోజా భ‌విష్య‌త్‌కు సంబంధించి జ‌గ‌న్ చెప్పే మాట‌… బ‌హుశా ఆమెకు రుచించ‌క‌పోవ‌చ్చు.

ఎందుకంటే, రోజాను ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల‌కు దూరంగా పెట్టాల‌ని జ‌గ‌న్ ఇప్ప‌టికే స్థిర‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు. జ‌గ‌న్ ఏదైనా అనుకుంటే, మ‌న‌సులో దాచి, చివ‌రి వ‌ర‌కూ చెప్ప‌కుండా మ‌భ్య‌పెట్టే మ‌న‌స్త‌త్వం కాద‌ని ముఖ్యంగా ఆ పార్టీ నేత‌ల‌కు బాగా తెలుసు. న‌గ‌రి సీటు గాలి జ‌గ‌దీష్‌కే అనేది సుస్ప‌ష్టం.

జ‌గ‌న్ హామీతో రోజా అంగీక‌రించి, పార్టీకి ప‌ని చేస్తే ఓకే. లేదంటే, ఆమె వేరే దారి వెతుక్కోడానికి జ‌గ‌న్ ఎంతో ముందే స‌మ‌యం ఇవ్వ‌బోతున్నారు. న‌గ‌రి నాయ‌క‌త్వంపై జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక రోజా నిర్ణ‌యం ఏంట‌నేదే తెలియాల్సి వుంది. రాజ‌కీయం అంటే…ఇంతే రోజా. క‌ర్క‌శ‌మైంది. అభిమానం, ఆప్యాయ‌త‌లు ఉంటే స‌రిపోదు. గెలుపు గుర్రాలై వుండాలి. వాస్త‌వాల్ని అర్థం చేసుకోవ‌డం, జీర్ణించుకోవ‌డం అనేవి రోజా విజ్ఞ‌త‌పై ఆధార‌ప‌డ్డాయి.

22 Replies to “వైసీపీ ఫైర్‌బ్రాండ్‌కు టైమ్ బ్యాడ్‌”

  1. అన్ని పార్టీలకు ఆమోదయోగ్యమైన వార్త.. ఇదొక్కటే..

    రాజకీయ తెర పైన నీ ప్రస్థానం ముగిసిపోయింది తల్లి.. ఇక చెన్నై బయల్దేరు..

    నీ మీద కేసులేసినా జగన్ రెడ్డి కి ఫరక్ కూడా పడదు..

    వాడు మీ నోటికున్న దూల ని వాడుకున్నాడు.. అవసరం తీరిపోయాక.. నీకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడు ..

    వాడికి నచ్చింది చెపుతాడు.. వినేసి.. తల ఊపేసి.. చివరిసారిగా రాఖి కట్టేసి.. చెన్నయ్ బస్ ఎక్కేసి.. వెనక్కి చూడకుండా పారిపో..

  2. ప్రత్యర్థి. అయినా నాకు జగన్ లో నచ్చిన గుణం ఇదే. ఏ విషయం లో స శ బిష లు ఉండే పని లె. ఏదయినా స్ట్రెయిట్. పగా అయిన ప్రేమ అయినా . గేట్ రెడీ ఫర్ వార్

  3. అక్కా ….ఏంటి ఇలా అయిపోయింది నీ పరిస్థితి…ఫైర్ బ్రాండ్ రాజకీయ జీవితాన్ని ని ఆర్పేశారు కదా రా….

  4. జగనన్నా ..చాల మంచిది అలానే గుడివాడ , అంబటి అనిల్ కుమార్ ఇలాంటి ఏంటో మంది చెల్లని కాసులు ఉన్నాయ్ …వాళ్ళని కూడా వదిలించుకో త్వరగా……

  5. ///ఎందుకంటే, రోజాను ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా పెట్టాలని జగన్ ఇప్పటికే స్థిరమైన నిర్ణయం తీసుకున్నారు. జగన్ ఏదైనా అనుకుంటే, మనసులో దాచి, చివరి వరకూ చెప్పకుండా మభ్యపెట్టే మనస్తత్వం కాదని ముఖ్యంగా ఆ పార్టీ నేతలకు బాగా తెలుసు.///

    .

    పాపం! అన్నని నమ్ముకొని రెచ్చిపొయి చివరికి ఇలా బలి అయిపొయింది! పైగా జగన్ ది మభ్యపెట్టే మనస్తత్వం కాదని GA గాడి కవర్నింగ్ బలె ఉంది!!

    .

    గొర్రెలారా అర్ధం చెసుకొండి!! బులుగు మీడియా అన్నది అన్న కొసం పనిచెస్తుంది కాని, పార్టి కార్యకర్తల కొసం, పార్టి కొసం త్యాగం చెసిన నాయకుల కొసం కాదు! రెపు ఎవరిని పార్టి నుండి బయటకి తొసినా ఇలానె బులుగు మీడియా సమర్దిస్తుంది! ఈ ముక్క బులుగు మీడియా తల్లి చీల్లిని ట్రొల్ల్ చెసినప్పుడె గొర్రెలకి అర్ధం కావలసింది!

  6. కట కటా! హతవిధీ.. ఏమిటీ ఈ పరిస్థితి.. అటు జబర్దస్త్ ,సినిమాలకి కాకుండా,ఇటు రాజకీయాలు కి కాకుండా ఇలా చేసేడే మిటి జగ్గూస్ అన్నీయ?

  7. మా రోజక్క పిచ్చిదా ఏమిటి?వైసీపీ కోసం,అన్నీయ్య కోసం ఈది పోరాటాలు, పరోటాలు సెయ్యటానికి?అందుకే దీపం వుండగానే ఇల్లు సక్క పెట్టేసుకుంది.వందల కోట్ల ఆస్తులు, ఫారిన్ కార్లు.. ఇలా చెన్నై లో సెటప్ పెట్టేసేంది.ఇక్కడ వైసీపీ కాదంటే తమిళనాడు లో ఏదో ఒక అరవ పార్టీ లోకి జంప్…అంతే!

  8. బూతులు మాటలు ఆదితే ఫైర్ బ్రాండా ?? థింక్ అగైన్ గ్రేట్ ఆంధ్ర ,సేవ్ జర్నలిసుం .

  9. ఏందే రోజక్కా ఇది…ఎలా తట్టుకోవాలి మేము… నీ సర్వస్వం అంతా ధారపోసి…ఊర కుక్క కన్నా వైసీపీ తరుపున మొరిగే దానివి…ఇప్పుడు చూడు నీ గురించి ఎలాంటి లీకులు ఇస్తున్నారో???…

    దీనికి నిరసనగా నేను పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టను…

    ఒక సల్ల బీరు తాగుతా అంతే

  10. ఆమె చేత బాబు గారిని పవన్ గారిని వ్యక్తి గతం గ బూతులు తిట్టించి ఇక ఏ పార్టీ లోనికి వెళ్లకుండా చేసేరు ఆమె పాత పద్ధతులలోనే బాబు పవన్ గార్లను తిడతా వదలకుండా పోస్ట్లు పెడితే తిన్నం గ ఈమెను వదిలించుకోవడానికి ఎదో పదవి ఇస్తారు ఈవిడి శ్రీ రెడ్డి గార్లు గతం లో లనే వైసీపీ కి సేవ చేయాలనీ టీడీపీ తరపున జనసేన తరపున ఆయా పార్టీల అభిమానులు కోరుకొంటున్నారు

Comments are closed.