వైసీపీలో బీజేపీ వాటా కోసం!

గతంలో ఒక రాజకీయ పార్టీకి ఒకరే ప్రత్యర్థిగా ఉండేవారు. ఏపీలో అలా కాదు కూటమి పేరుతో మూడు పార్టీలు వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి.

కూటమి పార్టీలు ఒక న్యాయం అయితే చక్కగా పాటిస్తున్నాయని అంటున్నారు. మూడు పార్టీలకు కామన్ ప్రత్యర్ధి వైసీపీ. వైసీపీని నిర్వీర్యం చేసి ఎదగాలన్నదే ఈ మూడు పార్టీల తపన. వైసీపీ నుంచి నేతలను చేర్చుకునే విషయంలో ఎవరికి వారే పోటీ పడుతున్నారు.

విశాఖ కార్పొరేషన్ లో వైసీపీకి 60 మంది దాకా కార్పోరేటర్లు ఉంటే వారి సంఖ్య సగానికి సగం అయింది. గడచిన తొమ్మిది నెలలలోనే ఇదంతా జరిగింది. వైసీపీ నుంచి చేరే వారిలో ఎక్కువ మంది తొలి ప్రాధాన్యత టీడీపీకి ఇస్తున్నారు. ఆ తరువాత జనసేన అంటున్నారు.

మూడవ పార్టీగా జాతీయ పార్టీగా బీజేపీ ఉంది. తమ వాటా కూడా ఆ పార్టీ కోరుకుంటోంది. తాను కూడా అధికారంలో ఉన్నపుడే ఎదగాలి కదా అంటోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది రాజకీయ నీతి. అందువల్ల వైసీపీ నుంచి గోడ దూకే నేతలలో సింహ భాగం టీడీపీ తీసుకుంటోంది. ఆ తరువాత జనసేనకు చాన్స్ వెళ్తోంది. ఆ మీదట బీజేపీకి కూడా అవకాశం ఇస్తోంది.

ఆ విధంగా వైసీపీ నుంచి చేరికలను బీజేపీ పెద్ద కార్యక్రమంగా చేసుకుంటూ వస్తోంది. ఒకసారి ఆ పార్టీ ఏపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరి సమక్షంలో ఈ చేరిక‌లు జరిగాయి. ఇప్పుడు కొత్తగా రెండవసారి ఎమ్మెల్సీ అయిన బీజేపీ పూర్వ అధ్యక్షుడు సోము వీర్రాజు సమక్షంలో ఈ చేరికలు ఉంటాయని చెబుతున్నారు.

విశాఖ కార్పోరేషన్ కి 2021లో ఎన్నికలు జరిగితే బీజేపీ గెలిచింది సొంతంగా ఒకే ఒక కార్పోరేటర్ ని. జనసేనకు రెండు సీట్లు దక్కాయి. ముప్పయి దాకా టీడీపీకి సీట్లు లభించాయి. ఇపుడు ఈ ఫిరాయింపులతో ఈ పార్టీల బలాలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. వైసీపీ చేతులెత్తేయడం కూడా కూటమికి కలసివస్తోంది అని అంటున్నారు.

గతంలో ఒక రాజకీయ పార్టీకి ఒకరే ప్రత్యర్థిగా ఉండేవారు. ఏపీలో అలా కాదు కూటమి పేరుతో మూడు పార్టీలు వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి. దాంతో వైసీపీ వ్యూహాలు లేమితో చతికిలపడుతూంటే కూటమి పార్టీలు బలాన్ని పెంచుకుంటున్నాయి. అయితే ఇది వాపో బలమో 2026 మార్చిలో జరిగే కార్పోరేషన్ ఎన్నికలు చెబుతాయని వైసీపీ నేతలు అంటున్నారు.

18 Replies to “వైసీపీలో బీజేపీ వాటా కోసం!”

  1. మా జగన్ రెడ్డి పాలస్ దొడ్లో కూర్చుని మోడీ కి ఉత్తరం రాసి సమర శంఖం పూరించే లోపు..

    విశాఖ కార్పొరేషన్ కేక్ ని కట్ చేసేసుకుని బీజేపీ వాటా పట్టుకుపోయిందా..!

    జగన్ రెడ్డి బీజేపీ పైన యుద్ధం చేస్తున్నా .. ఇక్కడ ఆతు ముక్క కూడా పట్టించుకోవడం లేదా.. హతవిధీ..

    ఫైనల్ గా..

    మేము సింగల్ సింహాలము అని తొడలు కొట్టుకొనేదీ మీరే..

    మమ్మల్ని ముగ్గురు కలిపి తోక్కేస్తున్నారు అని ఏడ్చేదీ మీరే..

    పక్కా.. గోపీ లు.. థూ ..

  2. మా జగన్ రెడ్డి పాలస్ దొడ్లో కూర్చుని మోడీ కి ఉత్తరం రాసి సమర శంఖం పూరించే లోపు..

    విశాఖ కార్పొరేషన్ కేక్ ని కట్ చేసేసుకుని బీజేపీ వాటా పట్టుకుపోయిందా..!

    జగన్ రెడ్డి బీజేపీ పైన యుద్ధం చేస్తున్నా .. ఇక్కడ ఆతుముక్క కూడా పట్టించుకోవడం లేదా.. హతవిధీ..

    ఫైనల్ గా..

    మేము సింగల్ సింహాలము అని తొడలు కొట్టుకొనేదీ మీరే..

    మమ్మల్ని ముగ్గురు కలిపి తోక్కేస్తున్నారు అని ఏడ్చేదీ మీరే..

    పక్కా.. గోపీ లు.. థూ ..

    1. ఆనాడే చెప్పిన అన్నయ్య నా వెంట్రుక కూడా పికలేరని..

      గతంలో కార్పోరేషన్ ఎన్నికల్లో ఏ విధంగా గెలుచుకున్నారో తెలుసు కదా అందరికీ.. ముల్లు ను ముల్లుతోనే తీయాలి..

    2. కానీ ఈ విధంగా ఫిరాయింపులు మంచిది కాదు. ప్రజలు అని చూస్తారు.

      1. మీకొక చిన్న ఉదాహరణ…

        మీరు ఒక వీధిలో నుండి నడుచుకుంటూ వెళుతున్నారు.. మీ ఇంటికి వెళ్ళడానికి ఆ వీధి దారి ఒక్కటే మార్గం..

        ఒకడు బలం గా.. దున్నపోతుల ఉన్న శరీరం వేసుకుని వచ్చి.. నీ చేతిలో ఉన్న సామాన్లు లాక్కుని.. ఈ దారి నాది.. ఈ పక్క నడవటానికి ఒప్పుకోను.. అని నిన్ను కొట్టి తన్ని తరిమేస్తాడు..

        అది ఆ వీధిలో ఉన్న జనాలందరూ చూసారు..అయ్యో పాపం అని నీ మీద జాలి పడతారు.. అవునా.. కాదా..

        ..

        కొన్ని రోజులు భరించి.. నువ్వు తిరగబడ్డావు.. నీ ఇంటికి వెళ్ళడానికి తిరగబడటం ఒక్కటే దారి..

        ఆ దున్నపోతులాంటోడిని చితగ్గొట్టి.. వాడి సామాను అంతా లాక్కుని.. వీధి బయటకు గెంటేసావు..

        అప్పుడు కూడా ఆ వీధి జనాలు చూస్తున్నారు..

        అప్పుడు వాళ్ళు ఏమనుకుంటుంటారు .. మీ ఒపీనియన్ చెప్పండి..

        1. అవన్నీ. O K. Sir మంచి పార్టీ అనే కథ అందరు స్వచాంధనగా పను చేసి గెలిపించం. వెధవలు ఎన్ని చేసినా. చివరికి cbn ne kdaha గెలిపించారు ప్రజలు. ఇంకొక్క రెండేళ్లలో ఎన్నికలు. 2014 లో కూడా ఆ 23 మంది నీ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు బాద్ నేం తాప. ప్రజలు అధికారం ఇచ్చింది వైజాగ్ మేయర్ వైసిపి కే కదా ా పార్టీ నే యే లా నివ్వాలి.

          1. మీరు నేను అడిగిన ప్రశ్న కి సమాధానం చెప్పలేదు..

            నా స్టోరీ లో.. చివరలో మీ ఒపీనియన్ అడిగాను..

            మీ ఒపీనియన్ లోనే మీరు అడిగే ప్రశ్న కి సమాధానం దొరుకుతుంది..

            ..

            విశాఖ కార్పొరేషన్ వైసీపీ ఎలా గెలుచుకుందో.. మీకు తెలియకపోతే.. మీకు తెలిసిన విశాఖ జనాలను అడగండి.. కథలు కథలుగా చెపుతారు..

            అన్నీ ఏకగ్రీవం చేసుకొన్నారు.. అందుకు ఎంత అరాచకంగా చెయ్యాలో అన్నీ చేశారు.. ఇంట్లో పిల్లలను కూడా కిడ్నాప్ చేశారు.. టీడీపీ అభ్యర్థుల నామినేషన్ పేపర్లు కూడా తీసుకోకుండా ఆఫీసర్ల మీద ఒత్తిడి చేశారు.. టైం అయిపోయిందని చెప్పి పంపించేశారు..

            ..

            దెబ్బకు దెబ్బే సమాధానం.. అలా చేస్తేనే అరాచకాలను ఆపగలం..

            మంచి గా చెపితే జగన్ రెడ్డి వింటాడా..?

Comments are closed.