సీఎం ప్రెసిడెంట్ అవుతారా?

సీఎం రమేష్ లాంటి వారు అయితే ఏపీలో మిగిలిన పార్టీలకు ధీటుగా బీజేపీని నిలబెడతారు అని బీజేపీలోకి ఒక వర్గం అంటోంది.

ఆయన పేరులోనే సీఎం ఉంది. కాబట్టి ఆయనకు రాజకీయంగా ఆ దర్జా వైభవం అలాగే కొనసాగుతున్నాయి. కడప జిల్లా నుంచి వచ్చి ఉమ్మడి విశాఖ జిల్లా గ్రామీణ నేపథ్యం ఉన్న అనకాపల్లిలో ఎంపీగా బీజేపీ నుంచి పోటీ చేసి గెలవడం అంటే తమాషా కాదు. దానిని రుజువు చేసి చూపించారు సీఎం రమేష్.

దాంతో ఆయనను ఘటనాఘటన సమర్ధుడు అని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఆ మధ్యన ప్రధాని మోడీ విశాఖ పర్యటనకు వస్తే ఆద్యంతం అంతా తానే దగ్గరుండి చూసుకున్నారు. కేంద్ర బీజేపీ పెద్దల వద్ద ఆయనకు పలుకుబడి అధికం అని అంతా అంటారు.

అందుకే ఆయనకు ప్రతిష్టాత్మకమైన రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి దక్కింది. అనేక పార్లమెంటరీ కమిటీలో ఆయనకు మెంబర్ గా చాన్స్ ఇస్తున్నారు. ఇపుడు ఆయన కోసం మరో కీలకమైన పదవి కాచుకుని ఉందని అంటున్నారు.

మరి కొద్ది నెలలలో ఖాళీ అవుతున్న ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పదవికి సీఎం రమేష్ పేరుని సీరియస్ గానే పరిశీలిస్తున్నారు అన్న వార్తలు షికారు చేస్తున్నాయి. అంగబలం అర్ధబలం దండీగా ఉన్న రమేష్ లాంటి వారి చేతికి పార్టీ పగ్గాలు అప్పచెబితే ఏపీలో బీజేపీ బాగుపడుతుందని భావిస్తున్నారుట.

అంతే కాదు ఇతర పార్టీల నుంచి నేతలను తీసుకుని వచ్చి పార్టీలో చేర్పించే కార్యక్రమాలు అయితే బాగా చేయాలని పార్టీ పెద్దలు అనుకుంటున్నారుట. సీఎం రమేష్ లాంటి వారు అయితే ఏపీలో మిగిలిన పార్టీలకు ధీటుగా బీజేపీని నిలబెడతారు అని బీజేపీలోకి ఒక వర్గం అంటోంది.

ఆయన పూర్వాశ్రమం తెలుగుదేశం పార్టీ కాబట్టి అవసరం అయితే ఏ వైపు నుంచి అయినా నాయకులను తెచ్చి బీజేపీలో చేర్పించగలరు అని అనుకుంటున్నారుట. కేంద్రంలో మంత్రి పదవి కోరుతున్న రమేష్ కి చాలా పదవులే దక్కాయి. ఇప్పుడు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా ఆయనకు అవకాశం ఇస్తారు అని జరుగుతున్న ప్రచారంతో కమలనాధుల రాజకీయ ఎత్తులు దాగుతున్నాయని అంటున్నారు.

9 Replies to “సీఎం ప్రెసిడెంట్ అవుతారా?”

  1. మా అన్నయ్య ఒప్పుకోడు ఇస్తే జివిఎల్ లేదా వీర్రాజు కి ఇవ్వాలి అని లేఖ రాస్తాడు..

Comments are closed.