త్వ‌ర‌లో వైసీపీ రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్ల వ్య‌వ‌స్థ ర‌ద్దు!

త్వ‌ర‌లో వైసీపీ రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్ల వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయ‌నున్నారు. ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం నేప‌థ్యంలో పార్టీని పున‌ర్నిర్మించుకోవాల‌నే ఆలోచ‌న‌లో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఉన్నారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్ల అవ‌స‌రం ప్ర‌స్తుతానికి లేద‌ని…

త్వ‌ర‌లో వైసీపీ రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్ల వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయ‌నున్నారు. ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం నేప‌థ్యంలో పార్టీని పున‌ర్నిర్మించుకోవాల‌నే ఆలోచ‌న‌లో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఉన్నారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్ల అవ‌స‌రం ప్ర‌స్తుతానికి లేద‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు.

ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ‌, ఉభ‌య‌గోదావ‌రి, నెల్లూరు -తిరుప‌తి జిల్లాల‌కు ప్ర‌స్తుతం రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్లు ఉన్నారు.

కోఆర్డినేట‌ర్ల వ్య‌వ‌స్థ ర‌ద్దు చేసి, వాళ్లంద‌రికీ ఇత‌ర బాధ్య‌త‌ల్ని జ‌గ‌న్ అప్ప‌గించ‌నున్నారు. ఇప్ప‌టికే ఒక‌రిద్ద‌రికి అన‌ధికారికంగా రానున్న రోజుల్లో నిర్వ‌హించాల్సిన బాధ్య‌త‌ల గురించి జ‌గ‌న్ వివ‌రించిన‌ట్టు తెలిసింది.

వైసీపీ లీగ‌ల్‌, పొలిటిక‌ల్‌, సోష‌ల్ మీడియా, పబ్లిక్ రిలేష‌న్స్ విభాగాల్ని బ‌లోపేతం చేయ‌డానికి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. వీటికి త్వ‌ర‌లో ఇన్‌చార్జ్‌ల‌ను నియ‌మించ‌నున్నారు.

వైసీపీని బ‌లోపేతం చేయ‌డానికి వ్యూహాత్మ‌కంగా ముందుకెళ్ల‌డానికి ప్ర‌ణాళిక రూపొందిస్తున్నారు. కూట‌మి రెండు నెల‌ల పాల‌న భ‌విష్య‌త్‌పై ఆశ‌లు చిగురింప‌జేసింద‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు.

ఓడిపోయిన మొద‌ట్లో వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు విప‌రీతంగా భ‌య‌ప‌డ్డార‌ని, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు. అధికారంపై వైసీపీ శ్రేణుల్లో ధీమా క‌నిపిస్తోంద‌ని ఆ పార్టీ నాయ‌కులు ధైర్యంగా చెబుతున్నారు.

అయితే ఈ ఐదేళ్ల‌లో కూట‌మి ప్ర‌భుత్వం ఏ ర‌కంగా ఇబ్బందులు పెట్టినా, ఎదుర్కోడానికి అన్ని ర‌కాలుగా సంసిద్ధంగా ఉన్నామ‌ని ఆ పార్టీ ముఖ్య నాయ‌కులు చెబుతున్నారు.

11 Replies to “త్వ‌ర‌లో వైసీపీ రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్ల వ్య‌వ‌స్థ ర‌ద్దు!”

  1. ఇప్పుడు మారితే ఏం ఉపయోగం..

    అవసరం అయితే క్యాడర్ గుర్తుకు రారు అన్నయ్య కి..

    అన్నయ్య కి అదృష్టం ఏమిటంటే ఏం జరిగిన చేలరేగిపోయే సోషల్ మీడియా కార్యకర్తలు ఉండటం..

  2. మీ పార్టీ బలోపేతం కావాలంటే ముందు మీ లీడర్ ని మార్చాలి. స్నానం చేయకుండా సెంటు కొట్టుకుంటే రెండు రోజులు ఓకే, ఐదేళ్లు కుదరదు.

    • ఎంతసేపు నీ చేతులు నువ్వే pisukkovadam కాదు jarra Ayyanna mod*a కూడా పిసుకుతూ ఉండు.. దయ తలచి ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తారు. అప్పుడు నువ్వు ఇలాంటి వి చేస్తే దానికో విలువ ఉంటాది. నీ మాట పార్టీ లో ఎవడైనా వి 0టాడు

Comments are closed.