బాబు, ప‌వ‌న్ అస‌మ‌ర్థ‌త‌ను చాటి చెప్పిన‌ కేంద్ర స‌ర్కార్‌!

కేవ‌లం ఏడు రాష్ట్రాల‌కు 60 శాతం, మిగిలిన 21 రాష్ట్రాల‌కు 40 శాతం పంపిణీ చేయ‌డం గ‌మ‌నార్హం.

టీడీపీ, జ‌న‌సేన ఎంపీల మ‌ద్ద‌తుతోనే కేంద్రంలో మోదీ స‌ర్కార్ ఏర్పాటైంద‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం. ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ ఎన్డీఏ ప్ర‌భుత్వాలు. కూట‌మి నేత‌ల మాట‌ల్లో చెప్పాలంటే …రెండు చోట్లా డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్‌. ఈ మాట‌లు విన‌సొంపుగా ఉన్నాయి. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కేంద్రం చేసే ఆర్థిక సాయ‌మే… పాల‌కుల స‌మ‌ర్థ‌త‌కు గీటురాయి. ఇందులో ఎవ‌రికీ రెండో అభిప్రాయం వుండాల్సిన అవ‌స‌రం లేదు.

ప్ర‌ధాని మోదీతో త‌మ‌కు స‌త్సంబంధాలున్నాయ‌ని, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు భారీగా సాయం చేస్తున్న‌ట్టు అసెంబ్లీ స‌మావేశాల్లోనూ, బ‌య‌ట సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ ఊద‌ర‌గొడుతుంటారు. అయితే వాస్త‌వ ప‌రిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కేంద్ర ప‌న్నుల్లో 60 శాతం వాటా కేవ‌లం ఏడు రాష్ట్రాల‌కే పోతోంది. అందులో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చోటు ద‌క్క‌క‌పోవ‌డం మ‌న పాల‌కుల‌కు అవ‌మాన‌మ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

మోదీ స‌ర్కార్‌పై ఒంటికాలిపై లేచే ప‌శ్చిమ‌బెంగాల్ ప్ర‌భుత్వానికి తొలి ఏడింటిలో స్థానం ద‌క్కించుకోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు కేంద్రంపై యుద్ధం ప్ర‌క‌టించిన త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కూడా మ‌న‌కంటే పైస్థానంలో వుండ‌డం గ‌మ‌నార్హం. అయిన‌దానికి, కానిదానికి కేంద్ర ప్ర‌భుత్వాన్ని, ప్ర‌ధాని మోదీని పొగ‌డ‌డం త‌ప్ప‌, రాష్ట్రానికి ఆర్థికంగా సాధించింది ఏమీ లేద‌ని లోక్‌స‌భ‌లో కేంద్ర ఆర్థిక స‌హాయ మంత్రి సంజ‌య్ చౌధ‌రి వెల్ల‌డించిన లెక్క‌లు చెబుతున్నాయి.

2024-25 ఆర్థిక సంవ‌త్స‌రంలో మార్చి 10వ తేదీ వ‌ర‌కు దేశంలోని 28 రాష్ట్రాల‌కు క‌లిపి కేంద్రం ప‌న్నుల్లో వాటాగా రూ.12,86,885.44 కోట్లు పంపిణీ చేసింది. ఇందులో కేవ‌లం ఏడు రాష్ట్రాల‌కు 60 శాతం, మిగిలిన 21 రాష్ట్రాల‌కు 40 శాతం పంపిణీ చేయ‌డం గ‌మ‌నార్హం. ఆ 21 రాష్ట్రాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉండ‌డం, ముమ్మాటికీ చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ అస‌మ‌ర్థ‌తే కార‌ణ‌మ‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

10 Replies to “బాబు, ప‌వ‌న్ అస‌మ‌ర్థ‌త‌ను చాటి చెప్పిన‌ కేంద్ర స‌ర్కార్‌!”

  1. ఛీ నీయమ్మ జీవితం. దింపేయండి వీళ్లిద్దర్నీ. మళ్ళీ మన సమర్ధ జాతి రత్నాన్ని కనకపు సింహాసనం మీద కూర్చో బెడదాం.

  2. ఒరేయ్ సన్నాసి… ఆఫీ జనాభా నిష్పత్తి లో పంచుతారురా….బాబు పిల్లల్ని కనమంటే ఎగతాళి చేసి ఇప్పుడు ఇట్ఠా ఏడుస్తున్నవా?

  3. మావోడు అయ్యింటే మోడీ మెడలు వొంచి నిధులు తెచ్చేవాడు తెలుసా

    “leven మోహిని” తాడేపల్లి ప్యాలెస్ లో తేరగా పండి pubg ఆడుకుంటున్నాడు… ఆణ్ణి మార్షల్స్ ని పంపి, అసెంబ్లీకి ఎత్తుకుపోవచ్చు కదా??

  4. ఇదివరకు ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసేరు కదా ఇప్పుడు కూడా ఈ అన్యాయం కోసం వున్నా 11 మ్మెల్యే లు 4 ఎంపీ లు రాజీనామా చేసి పోరాడండి

Comments are closed.