‘ముంపు ప్రాంతం కాదు’ అనలేకపోతున్న చంద్రబాబు!

‘‘అమరావతి ముంపు ప్రాంతం కాదు, అత్యంత భద్రమైన ప్రాంతాన్నే తాను రాజధానికి ఎంపిక చేశాను..’’ అనే మాట స్పష్టంగా చెప్పలేకపోతున్నారు!

అమరావతి రాజధాని ముంపు ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారనే విమర్శలు తొలినుంచి ఉన్నాయి. అయితే చంద్రబాబు నాయుడు తన వాక్చాతుర్యంతో ఆ విమర్శలు చేస్తున్న వారిని ఎప్పటికప్పుడు దబాయించుకుని వస్తూ కాలం వెళబుచ్చుతున్నారు.

గతంలో కూడా చిన్నపాటి వర్షాలు వచ్చినా అమరావతి ప్రాంతం మొత్తం నీటిమడుగులా తయారై భవిష్యత్తు పట్ల రాష్ట్ర ప్రజలలో భయాలు రేకెత్తించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇటీవలి వరద ముప్పునకు విజయవాడ ఏరకంగా అయితే అతలాకుతలమైపోయిందో.. ఇంతకంటే మిన్నగా అమరావతి ప్రాంతం కూడా చెరువులాగా తయారైంది. దీనిపై సహజంగానే రాజధాని ఎంపిక గురించి విపక్షాలు విమర్శలు చేశాయి.

చంద్రబాబు నాయుడు వారి మీద అంతకంటే సహజంగా విరుచుకుపడ్డారు. అమరావతిని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. ఎన్ని చేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ‘అమరావతి ముంపు ప్రాంతం కాదు’ అని ఏక వాక్యాన్ని చెప్పలేకపోతున్నారని మనకు అర్థం అవుతుంది.

ఎందుకంటే ఇటీవలి వర్షాలకు అమరావతి మునిగిపోయిన విషయాన్ని విలేకరులు ప్రస్తావిస్తే చంద్రబాబు దబాయిస్తున్న తీరు భిన్నంగా ఉంది. ‘‘మాటకొస్తే ఏ నగరం సురక్షితమైనది?హుద్ హుద్ తుపానుకు విశాఖ ఏమైంది? తిరుపతి నెల్లూరు కర్నూలులకు వరదలు రాలేదా?’’ అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు.

‘‘పోనీ పులివెందులలో రాజధాని పెడితే సురక్షితమా’’అంటూ వెటకారం చేస్తున్నారు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు ‘‘అమరావతి ముంపు ప్రాంతం కాదు, అత్యంత భద్రమైన ప్రాంతాన్నే తాను రాజధానికి ఎంపిక చేశాను..’’ అనే మాట స్పష్టంగా చెప్పలేకపోతున్నారు!

అమరావతి రాజధానిని ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులా రూపొందించారనేది వైయస్సార్ కాంగ్రెస్ చేసే ప్రధాన ఆరోపణ. అయినవారికి లబ్ధి చేకూర్చేందుకు చంద్రబాబు నాయుడు ఈ ప్రయత్నం చేశారని వారు ఆరోపిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో అమరావతి ప్రాంతంలో ప్రమాద సూచికలు కనిపించిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు వెనక్కు తగ్గకుండా సమర్ధించుకుంటూ ఉండటం గమనిస్తే విపక్షాల ఆరోపణ నిజమే ఏమో అనే అనుమానం ప్రజలకు కలుగుతుంది.

ఏది ఏమైనప్పటికీ అమరావతి విషయంలో స్థిర నిర్ణయంతో ముందుకు పోయే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నది కనుక, ఒకవేళ ముంపు ప్రమాదం తలెత్తినా సరే తట్టుకోగలిగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నగరానికి రూపకల్పన చేస్తే బాగుంటుంది అని ప్రజలు కోరుకుంటున్నారు.

23 Replies to “‘ముంపు ప్రాంతం కాదు’ అనలేకపోతున్న చంద్రబాబు!”

  1. ఆ శిక్ష.. ఐపీఎస్‌లపై కక్ష! అసలు కారణం బాబు అరెస్టే..అధికారులను అక్రమ కేసులతో వేధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం”

    సాక్షి వాడు మందబుద్ధి కలిగి ఉంటాడేమో తెలియదు గానీ ఆ హీరోయిన్ arrestt లో గత ప్రభుత్వ హయాంలోని అధికారులు ఎలా నిబంధనలు మీరు పనిచేసారో, అలాగే బాబుని కూడా అక్రమ arrestt చేశారని ఒప్పుకుంటున్నాడా?

    1. రేపో మాపో ఆ పత్రిక మీద ముద్రించే YSRx బొమ్మతో తన సోదరుడిని చంపింది బాబేనని, షర్మిలను నమ్మొద్దని జాతికి తెలియజేస్తాడు.

  2. మునిగింది విజయవాడ రా అయ్యా! అమరావతి కాదు!!

    మొన్న సాక్షి లొ ఎవడొ బుడమెరు అమరవతి ని ముంచింది అంటున్నాడు. అసలు అమరావతి 29 గ్రామాలలొ బుడమేరు అన్నదె లెదు. అది ఉన్నది క్రిష్ణా జిల్లా వైపు.

  3. ఒక వైపు ఉద్యోగాల్లో కోత, ఆన్లైన్ సేవల అభివృద్ధి, జీత భత్యాలా సమస్య ప్రభుత్వ ఖజానా లోటు వెరశి ఇంకా బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే వుంటే ఎలా బాబు గారు…మీ మైండ్ సెట్ మార్చుకోండి..కాలానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోండి.

  4. సముద్రమట్టం కన్నా 1000 మీటర్ల ఎత్తులో ఉండి, ఏ నదులూ లేని బెంగుళూరు, ఉన్నదా లేదా అన్నట్లు ఉండే మూసీ నది ఉన్న హైదరాబాద్ కూడా “వరదలు” వచ్చి మునిగిపోయాయి.

    సీ లెవల్ కన్నా తక్కువ ఉండే నెదర్ల్యాండ్స్ లో ఒక్క ఇల్లు కూడా మునిగిన వార్త లేదు.

    కాబటి నగరాన్ని ముంపు ప్రాంతమో.. కంపు ప్రాంతమో చెయ్యటం ప్రజలు, పాలకుల చేతుల్లో ఉంటుంది కానీ నేలలో ఏముంది.

  5. సముద్రమట్టం కన్నా 1000 మీటర్ల ఎత్తులో ఉండి, ఏ నదులూ లేని బెం!గుళూరు, ఉన్నదా లేదా అన్నట్లు ఉండే మూసీ నది ఉన్న హైదరాబాద్ కూడా “వరదలు” వచ్చి మునిగిపోయాయి.

    సీ లెవల్ కన్నా తక్కువ ఉండే నెదర్ల్యాండ్స్ లో ఒక్క ఇల్లు కూడా మునిగిన వార్త లేదు.

    కాబటి నగరాన్ని ముంపు ప్రాంతమో.. కం!పు ప్రాంతమో చెయ్యటం ప్రజలు, పాలకుల చేతుల్లో ఉంటుంది కానీ నేలలో ఏముంది.

  6. When world bank itself said it is not suitable for capital, how does it matter what CBN says or does not say. Amaravathi is not a suitable region for capital is proven time and again. It is only few stubborn leaders and few foolish and selfish business men and benamis are after this disastrous dream.

  7. Chennai, Hyderabad, Bangalore, Mumbai – u name any city, or for that matter even in USA , when there is natural calamity, they will be affected in some way or other. Amaravathi or any city cannot. Dont try to fool people.

    Amaravathi will be the capital of AP, whatever you and your party try.

    People are not fools to fall in ur trap of mispropaganda.

  8. అమరావతి ప్రాంతం నీటిలో మునిగినట్టు కానీ, వరల్డ్ బ్యాంకు అమరావతి కాపిటల్ గా పనికిరాదన్నది కానీ ప్రూవ్  చేసే న్యూస్ ఎక్కడా 

    లేదు, లుంగీ-బ్యాచ్ పేపర్స్ అండ్ వెబ్సైట్ లో తప్ప 

Comments are closed.