గంటాలో పెరిగిపోతున్న ఫ్రస్ట్రేషన్

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత భీమిలీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావులో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత భీమిలీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావులో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది అని అంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతీ సారి మంత్రి అయిన ఆయన గురి ఈసారి తప్పింది. అయిదేళ్ళ పాటు మంత్రిగా ఉండొచ్చు అని తనకు సెంటిమెంట్ గా ఉన్న భీమిలీ నుంచి ఆయన 2024 ఎన్నికల్లో పట్టుబట్టి మరీ పోటీ చేసి గెలిచారు.

ఆయనకు 2014లో భీమిలీ సీటు మంత్రిగా చాన్స్ ఇచ్చింది. ఈసారి మాత్రం లక్ తిరగబడింది. ఏపీలో కూటమిలో మంత్రి పదవులకు ఎంపిక జరిగిన తీరు కూటమి పార్టీగా జనసేనకు దక్కుతున్న ప్రాధాన్యత చూస్తే గంటాకు ఫ్యూచర్ లో కూడా మంత్రి పదవి దక్కే సూచనలు లేవని అంటున్నారు.

మంత్రి గంటా వియ్యంకుడు నారాయణ కీలకమైన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన అయిదేళ్ల పాటు మంత్రిగా బాధ్యతలు నిర్వహించడం ఖాయం. ఆయన అమరావతి రాజధాని బాధ్యతలను మోస్తున్నారు దానితో ఆయనను తప్పించడం అయ్యే పని కాదని అంటున్నారు.

అలా నారాయణ ఈక్వేషన్ తో గంటాకు మంత్రి పదవి అన్నది విస్తరణలోనూ దక్కదేమో అన్నది అయితే ఉంది. అలాగే బలమైన కాపు సామాజిక వర్గం నుంచి మంత్రివర్గం కోటాలో జనసేనకు పెద్ద పీట వేస్తున్నారు. భవిష్యత్తులో నాగబాబుకు మంత్రి అవకాశం ఇస్తే టీడీపీ నుంచి ఆ సామాజిక వర్గం నుంచి మంత్రులుగా ఎవరికీ తీసుకునే అవకాశం లేకపోవచ్చు అని అంటున్నారు.

ఇలా చూస్తే రానున్న నాలుగేళ్ల పాటు కూడా గంటా ఎమ్మెల్యేగానే కొనసాగాలి. బహుశా ఆ రకమైన ఆలోచనలతో ఆయన ఫ్రస్ట్రేషన్ కి గురి అవుతున్నారా అన్నది అంతా ఆలోచిస్తున్నారు. ఎపుడూ మాట తూలని గంటా లేటెస్ట్ గా తన నియోజక్వర్గం పర్యటనలో ఒక ప్రభుత్వ అధికారి మీద నోరు చేసుకున్నారు. అనుచితంగానే ఆయన మాట్లాడారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. గంటా వైఖరి మీద కూడా డిస్కషన్ సాగుతోంది. ఆయన ఎపుడూ సహనంగా ఉంటారు కదా ఇలా ఎందుకు అన్నది అంతా తర్కించుకుంటున్నారు.

3 Replies to “గంటాలో పెరిగిపోతున్న ఫ్రస్ట్రేషన్”

Comments are closed.