బీజేపీకి ఎంతో పట్టు ఉన్న విశాఖ ఎంపీ సీటు పొత్తులో దక్కకుండా పోవడం బాధాకరం అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఒక కుటుంబం పట్టుదల వల్లనే విశాఖ ఎంపీ సీటు పోయింది అని ఆయన సంచలన కామెంట్స్ చేశారు.
విశాఖ ఎంపీ సీటు బీజేపీకి కాకుండా పోవడం వెనక పెద్ద కధ నడిచింది అని ఆయన అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ జీవీఎల్ తనకు సీటు దక్కకపోవడం పట్ల చాలా మంది శ్రేయోభిలాషులు బాధపడుతున్నారని ఆయన అన్నారు.
తనకు విశాఖ సీటుని బీజేపీ అధినాయకత్వం మూడేళ్ల క్రితమే కేటాయించి తనను విశాఖకు పంపించిందని ఆయన అన్నారు. తాను గడచిన కాలమంతా విశాఖలో బీజేపీని పటిష్టం చేయడానికే ఉపయోగించాను అని అన్నారు. విశాఖలో బీజేపీ ఓటింగ్ కూడా బాగా పెరిగిందని బీజేపీకి స్ట్రాంగ్ సీటు అయిన విశాఖను ఇవ్వకుండా అనకాపల్లి అరకు సీట్లు ఇచ్చారని ఆయన అన్నారు.
అక్కడ బీజేపీకి క్యాడర్ పెద్దగా లేదని బలం కూడా లేదని ఆయన అన్నారు. వైజాగ్ ఫర్ జీవీఎల్ అన్నది తన ఎన్నికల నినాదం కాదని ఆయన అన్నారు. తాను ఎక్కడికీ పోనని మరింత ఉత్సాహంగా విశాఖ ప్రజల కోసం పని చేస్తాను అని అన్నారు.
రాజకీయాల్లో సీట్ల కేటాయింపు కూడా వ్యాపారం అయిపోయింది అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. ఉత్తారాదితో పోలిస్తే దక్షిణాదిన పెద్ద ఎత్తున ధన ప్రభావం కనిపిస్తోందని ఆయన అన్నారు. దీని వల్ల చాలా మంది పోటీ చేయలేకపోతున్నారు అని అన్నారు.
ఎన్నికల్లో గెలవడం ప్రజలకు సేవ చేయడానికి తప్ప వ్యాపారాలు చేయడానికి కాదని ఆయన సెటైర్లు వేశారు. బీజేపీకి ఏపీలో బలం బాగా పెరిగిందని సొంతంగా పోటీ చేసినా 15 శాతం పైగా ఓటు షేర్ దక్కుతుదని ఆయన అన్నారు. ఏపీ బీజేపీని మరింతంగా పటిష్టం చేయడం కోసం తాను కృషి చేస్తాను అని ఆయన అన్నారు.
జీవీఎల్ చేసిన తాజా కామెంట్స్ సంచలనం అవుతున్నాయి. విశాఖ ఎంపీ సీటు బీజేపీ ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది అన్నది ఆయన చెప్పకనే చెప్పేశారు అంటున్నారు.