టీటీటీ చైర్మ‌న్‌, ఈవోల‌పై టీడీపీ అస‌హ‌నం!

టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామ‌లారావుపై టీడీపీ అధిష్టానం ఆగ్ర‌హంగా ఉన్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది.

టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామ‌లారావుపై టీడీపీ అధిష్టానం ఆగ్ర‌హంగా ఉన్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది. ఎస్వీ గోశాల‌లో గోమాత‌ల మృతిపై వీళ్లిద్ద‌రి మ‌ధ్య స‌మ‌న్వ‌య లోపంతోనే కూట‌మి ప్ర‌భుత్వం అభాసుపాలైంద‌నే ఆవేద‌న టీడీపీ పెద్ద‌ల్లో వుంద‌ని స‌మాచారం. ఎస్వీ గోశాల‌లో మూడు నెల‌ల్లో 100కు పైగా గోవులు ప్రాణాలు పోయాయ‌ని టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న కరుణాక‌రెడ్డి చేసిన ఆరోప‌ణ‌లు తీవ్ర దుమారం రేపాయి.

ఆ మ‌రుక్ష‌ణ‌మే …అబ్బే అదంతా ఫేక్ ప్ర‌చార‌మ‌ని టీటీడీ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఒక‌వేళ ఆ ప్ర‌క‌ట‌న‌కే క‌ట్టుబ‌డి వున్నా, క‌నీసం గౌర‌వం ద‌క్కేది. కానీ టీటీడీలో కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో మ‌ధ్య స‌మ‌న్వ‌య లోపం, వాళ్ల ప్రెస్‌మీట్ల‌లో వెల్ల‌డైన వివ‌రాలు మ‌రోసారి బ‌ట్ట‌బ‌య‌లు చేశాయి.

టీటీడీ చైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ 20-22 వ‌ర‌కు గోవులు ప్రాణాలు పోగొట్టుకున్నాయ‌న్నారు. ఏం మ‌న ఇళ్ల‌లో వృద్ధులు, మ‌నుషుల చనిపోవ‌డం లేదా? అని ద‌బాయించారు. త‌ద్వారా గోశాల‌లో గోవుల ప్రాణాల్ని నిర్ధారించ‌డంతో పాటు ఆయ‌న‌లో ఏంటీ లెక్క‌లేని త‌నం అని టీడీపీ పెద్ద‌లు ఆగ్ర‌హంగా ఉన్నార‌ని తెలిసింది. మ‌రీ ముఖ్యంగా ఎలాంటి స‌మాచారం లేకుండానే మీడియా ముందుకొచ్చిన‌ట్టు లోకానికి తెలిసేలా మీడియా స‌మావేశంలో ఆయ‌న వ్య‌వ‌హార శైలి వుంద‌ని సీఎం చంద్ర‌బాబుకు టీడీపీ ముఖ్య నాయ‌కులు ఫిర్యాదు చేసిన‌ట్టు తెలిసింది.

టీటీడీ ఈవో శ్యామ‌లారావు మీడియాతో మాట్లాడుతూ గ‌త మూడు నెల‌ల్లో 43 ఆవులు చ‌నిపోయిన‌ట్టు ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. దీంతో టీటీడీ మాజీ చైర్మ‌న్‌, వైఎస్సార్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కుడు భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి ఆరోప‌ణ‌ల‌కు బ‌లం క‌లిగించిన‌ట్టైంద‌ని టీడీపీ నేత‌లు రుస‌రుస‌లాడుతున్నారు. మ‌రోవైపు గుంటూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో సీఎం చంద్ర‌బాబునాయుడు గోశాల‌లో గోవులేవీ చ‌నిపోలేద‌ని చెప్పార‌ని, అంద‌రి మాట‌లు విన్న జ‌నానికి అబ‌ద్ధాలు చెబుతున్నార‌ని స్ప‌ష్టంగా తెలిసిపోయింద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

టీటీడీలో చైర్మ‌న్‌, ఈవో మ‌ధ్య స‌మ‌న్వ‌యం కొర‌వ‌డింద‌ని, తీవ్ర‌స్థాయిలో విభేదాలున్నాయ‌ని తొక్కిస‌లాట సంద‌ర్భంలో సీఎం స‌మ‌క్షంలో బ‌య‌ట‌ప‌డింది. ఇప్ప‌టికీ వాళ్లిద్ద‌రి మ‌ధ్య అదే గ్యాప్ ఉన్న‌ట్టు తాజా గోశాల వివాదంలో రుజువైంద‌ని టీడీపీ పెద్ద‌లు ఆగ్ర‌హంగా ఉన్నారు. భూమ‌న ఆరోప‌ణ‌ల్ని ఖండించ‌డానికి బ‌దులు, ఆ రోజే 43 గోవులు చ‌నిపోయిన‌ట్టు చెప్పి వుంటే, వివాదం ఇంత వ‌ర‌కూ వ‌చ్చేది కాదు క‌దా? అని టీడీపీ నాయ‌కుల వాద‌న‌.

ఆ ప‌ని మొద‌ట్లోనే చేయ‌కుండా, డ్యామేజీ జ‌రిగిన త‌ర్వాత , ఎన్ని వివ‌ర‌ణ‌లు ఇస్తే ఏం లాభం అని టీడీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. అలాగే టీటీడీ చైర్మ‌న్‌, ఈవో ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా మాట్లాడుతూ, అంతిమంగా ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేస్తున్నార‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు ఆగ్ర‌హంగా ఉన్నార‌ని టీటీడీ నాయ‌కులు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

14 Replies to “టీటీటీ చైర్మ‌న్‌, ఈవోల‌పై టీడీపీ అస‌హ‌నం!”

        1. పాపం పిట్టి నత్తి పకోడీ .. ఫ్రస్ట్రేషన్ లో తాడేపల్లి లో ఉండలేక… బెంగళూర్ లో నిలవలేక, పులివెందుల లో పడుకోలేక

  1. జాతీయ మీడియాలకి రాకుండా వార్తలు ఈ ఆవదం మీడియాల ఎంతవరకు ఫలితాన్ని ఇస్తాయి..

Comments are closed.