చిరు వ్యాపారులకు ఇది లాభమా? నష్టమా?

వీధి వ్యాపారులకు, ప్రజలకు కూడా ఇది సౌకర్యం అని అంటున్నారు గానీ.. ఈ ఏర్పాటు ద్వారా వీధివ్యాపారుల పొట్టకొట్టే ప్రమాదమూ ఉన్నదని, పలువురు అనుమానిస్తున్నారు.

ప్రజలకు సౌకర్యం కలిగించడం అనే మిష మీద ఏపీ సర్కారు ఇప్పుడు ఒక కొత్త ప్రయోగం చేస్తోంది. ప్రజలకు అవసరమైన అన్ని వస్తువులూ ఒకే చోట దొరికే ఏర్పాటు చేస్తాం అంటూ.. స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ లను ఏర్పాటు చేయడానికి పూనుకుంటోంది. నెల్లూరులో ప్రయోగాత్మకంగా ఈ జూన్ లో ప్రారంభించినున్న ఇలాంటి వాటిని రాష్ట్రంలో ప్రస్తుతం ఎనిమిది నగరాల్లో ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు.

ఒకేచోట 200 దుకాణాలు ఉండేలా ఏర్పాటు చేయాలనేది ప్లాన్. కంటైనర్లతో ఏర్పాటు చేసే దుకాణాల సముదాయానికి ఒక్కొక్కదానికి ఏడు కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తున్నారు. వీధి వ్యాపారులకు, ప్రజలకు కూడా ఇది సౌకర్యం అని అంటున్నారు గానీ.. ఈ ఏర్పాటు ద్వారా వీధివ్యాపారుల పొట్టకొట్టే ప్రమాదమూ ఉన్నదని, పలువురు అనుమానిస్తున్నారు.

నగరాల్లో వీధి వ్యాపారులంటే.. తోపుడు బండ్ల మీద ఇంటింటికీ తిరుగుతూ అమ్ముకుంటూ పొట్టపోసుకుంటూ ఉంటారు. రోజువారీ జీవితం గడవడానికి కూడా చాలనంత చిరు సంపాదనతో బతుకుతుంటారు. ప్రభుత్వం ఇప్పుడు ప్లాన్ చేస్తున్న విధానం వల్ల ఆ జీవితాల్లో వెలుగులు నింపవచ్చుననేది ప్రభుత్వం మాట. కానీ నిజంగానే వెలుగులు నిండుతాయా? అనేది అనుమానమే.

ఎందుకంటే.. ఏడు కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేస్తున్న ఈ కంటైనర్ల మార్కెట్ల నిర్వహణను స్థానికంగా నగర పాలక సంస్థలకు అప్పగించబోతున్నారు. ఒక్కో మార్కెట్ కు సుమారు యాభై మంది కార్మికులను అక్కడ శుభ్రం చేయడానికి, కాపలా ఇతర పనులకు నియమిస్తారు. అంటే ఇప్పటిదాకా తోపుడు బండ్లు నిర్వహించుకునే వ్యాపారులకు అద్దెలు గానీ, ఇతర ఖర్చులు గానీ ఏమీ ఉండవు. అందుకే వారు ఇంటింటికీ తిరుగుతూ కూడా తక్కువ ధరకు కూరగాయలు ఇతరత్రా సరుకులు అందించగలుగుతారు. అయితే ఇప్పుడు వారికి కార్పొరేషన్లకు చెల్లించే అద్దెల భారం అదనంగా పడుతుంది. ఆ భారం వినియోగదారుల మీద కూడా పడుతుంది.

ఈ మార్కెట్ల ఏర్పాటుకోసం ప్రభుత్వం చెబుతున్న వాదన చిత్రంగా ఉంది. రోడ్ల పక్కన తోపుడు బళ్లపై వ్యాపారాలు చేసుకునే వారు ప్రస్తుతం చాలా ఇబ్బందులు పడుతున్నారట. పోలీసులు, కార్పొరేషన్ అధికారులు, రాజకీయ నాయకులు ఎవరికి కోపం వచ్చినా వారు తమ బళ్లను అక్కడినుంచి తీసేయాల్సి వస్తోందట. అందువల్ల ఉపాధి కోల్పోతున్నారట. వారికోసం ఇలాంటి ఏర్పాటు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. పైన చెప్పిన వాళ్లంతా ప్రభుత్వేతర శక్తులా.. ప్రభుత్వం వారిని నియంత్రణలో ఉంచలేదా? వారి బెడద లేకుండా కట్టడి చేస్తే.. ఈ చిరువ్యాపారులు హాయిగా బతకగలరు కదా. ఆ సమస్య తీరుస్తామంటూ వారి జీవితాలను అద్దెలు కట్టే పరిస్థితికి తీసుకువస్తే వారు బతకగలరా? అనే అనుమానాలు ఉన్నాయి.

ఏది ఏమైనప్పటికీ.. ఈ మార్కెట్ లు ఏర్పాటు అయిన తర్వాత.. ఇంకా తోపుడు బంట్ల మీద వ్యాపారాలు చేసుకునే గతిలేని వారిని.. పోలీసులు, నాయకులు, మునిసిపాలిటీ అధికారులు టార్చర్ పెట్టకుండా, వారిని వేధించకుండా ఉంటే చాలునని ప్రజలు అనుకుంటున్నారు.

26 Replies to “చిరు వ్యాపారులకు ఇది లాభమా? నష్టమా?”

  1. ఇదివరకు రౌతుబజారులను ప్రారంభించారు . అందులో రైతులు తప్ప అందరూ దళారులే! రైతుల, వినియోగ దారులు మోసపోయారు అధికారులు, దళారులు , రాజకీయకార్య కర్తలు బాగు

    పడ్డారు

  2. ఇదే మా జగన్ రెడ్డి ఆలోచన గా ఉండి ఉంటె.. హబ్బో.. మన భజన ఒక రేంజ్ లో ఉండేది..

    ప్రపంచంలోనే అత్యత్బుతం , అమోఘం అని బాకా ఊదేవాడివి ..

    ఇప్పుడు చంద్రబాబు ఆలోచన అయ్యేసరికి.. వంకలు వెతికి.. ఏడ్చి సస్తున్నావు..

  3. మరి జగన్ అన్న మొబైల్ మటన్ షాప్ లు పెట్టినప్పుడు ఇలా ఆలోచించలేదు

  4. ఇదంతా మేనేజ్ చెయ్యడానికి వాలంటీర్లు పెడదాం. వాళ్ళని మేనేజ్ చెయ్యడానికి సచివాలయాలు పెడదాం.. వాళ్ళని మేనేజ్ చెయ్యడానికి సలహా దారులను పెడదాం.

    ప్రజల సొమ్ము చంక నాకిద్దాం

    1. వాళ్ళందరిని మేపే బదులు.. నేనొక్కడినే (బొల్లి గాడు) మొత్తంగా నాకేస్తే – అన్న ఆలోచన నుండి పుట్టినదే.. ఈ ఒక్క దుకాణాల సముదాయానికే 7 కోట్లరూపాయలు!

      1. మద్యం దుకాణలాన్ని బంద్ చేసి సొంత దుకాణం తెరుచుకున్నట్టా బ్రో

  5. Ekkada chala mandhi bahajana jagan CHESI untey poguditaru antunnaru okasari alochinchandi manam akkaadiki potuunamonrajkeeyalu pakkana pedadhamu idhi antha varuku correct antaru dani meedha discuss cheddhamu appudu rajkeeyam chesthey AP ala mundhuku saguddhi

  6. ఒక్క కంటైనర్ హోమ్ ధర.. 950/sft+GST

    మరి.. ఒక్కో షాప్ 100 sft అనుకున్నా .. 950x 100 = 95,000/-

    మరి.. 200 షాప్స్ => 95000 x 200 = 19,000,000+GST అంతా 2 కోట్లలోపే! ఇక BULK లో కొంటె..? ఇంకా తక్కువకే అయిపోతుంది.

    మరి..200 షాప్స్ కి 7 కోట్లని లెక్కకట్టిన.. ఆ గజ D0 న్ G@ ఎవడు ర? మన.. బొల్లి గాడేనా?youtube.com/watch?v=JEB3yLsk-5Q

  7. ఒక్క కంటైనర్ హోమ్ ధర.. 950/sft+GST

    మరి.. ఒక్కో షాప్ 100 sft అనుకున్నా .. 950x 100 = 95,000/-

    మరి.. 200 షాప్స్ => 95000 x 200 = 19,000,000+GST అంతా 2 Crలోపే! ఇక BULK లో కొంటె..? ఇంకా తక్కువకే అయిపోతుంది.

    మరి..200 షాప్స్ కి 7 Crని లెక్కకట్టిన.. ఆ గజ D0 న్ G@ ఎవడు ర? మన.. బొల్లి గాడేనా?

  8. ఒక్క కంటైనర్ హోమ్ ధర.. 950/sft+GST

    మరి.. ఒక్కో షాప్ 100 sft అనుకున్నా .. 950x 100 = 95,000/-

    మరి.. 200 షాప్స్ => 95000 x 200 = 19,000,000+GST అంతా 2 Crలోపే

    1. ఒక్క కంటైనర్ హోమ్ ధర.. 950/sft+GST

      మరి.. ఒక్కో షాప్ 100 sft అనుకున్నా .. 950x 100 = 95,000/-

      మరి.. 200 షాప్స్ => 95000 x 200 = 19,000,000+GST

    2. Price of a single container home: ₹950 per square foot + GST

      Now, assuming each shop is 100 square feet:

      ₹950 x 100 = ₹95,000 per shop

      So, for 200 shops: ₹95,000 x 200 = ₹19,000,000 + GST

      That means everything is under ₹2 Cr!

      And if bought in bulk?

      It could be even cheaper.

    3. మార్కెట్ ధర ప్రకారం ఈ కంటైనర్ హోమ్ఒక్క చదరపు ధర.. 950 రూపాయలు

      మరి.. ఒక్క షాపు 100 చదరపు అడుగులు అనుకున్నా.. దాని ధర.. 95 వేల రూపాయలు..

      మరి.. 200 షాపుల.. మొత్తం ధర.. ? ఒక కోటి తొంభై లక్షలరూపాయలు..మరి… 7 cr ఎలా అవుతున్నాయి?

  9. Price of one container home: ₹950/sq.ft + GST

    Now, assuming each shop is 100 sq.ft:

    950 x 100 = ₹95,000/-

    So, for 200 shops:

    ₹95,000 x 200 = ₹19,000,000 + GST

    That means everything is within ₹2 Crs!

    And if you buy in bulk..? It’ll cost even less.

    మరి..200 షాప్స్ కి 7 Crని లెక్కకట్టిన.. ఆ గజ D0 న్ G@ ఎవడు ర?

  10. ఒక్క కంటైనర్ హోమ్ ధర.. 950/sft+GST

    మరి.. ఒక్కో షాప్ 100 sft అనుకున్నా .. 950×100 అంటే..95,000

    మరి.. 200 షాప్స్ 95000×200 అంటే.. 19,000,000+GST అదనం అంతా 2 కోట్లలోపే! ఇక BULK లో కొంటె..? ఇంకా తక్కువకే అయిపోతుంది. మరి..200 షాప్స్ కి 7 cr లెక్కన.. లెక్కకట్టిన.. ఆ గజ D0 న్ G@ ఎవడు ర? మన.. బొల్లి గాడేనా?

Comments are closed.