వైసీపీలో ఎంద‌రో దువ్వాడ‌లు.. తొల‌గించేదెన్న‌డో?

వైసీపీ నుంచి ఆ స్క్రాప్‌ను ఎంత త్వ‌ర‌గా అమ్ముకుంటే, ఆ పార్టీకి అంత మంచిదనే అభిప్రాయం ప్ర‌తి కార్య‌క‌ర్త‌లో వుంది.

క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘించార‌నే కార‌ణంతో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ‌నివాస్‌పై వైసీపీ క్ర‌మ‌శిక్ష‌ణ వేటు వేసింది. నిజానికి ఈ ప‌ని కొన్ని నెల‌ల క్రిత‌మే చేసి వుండాల్సింది. ఎందుక‌నో అప్పుడు ఆయ‌న్ను అస‌లు ప‌ట్టించుకోలేదు. హ‌ఠాత్తుగా ఆయ‌న క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘించిన‌ట్టు ఏ విష‌యంలో అర్థ‌మైందో గానీ, ఎట్ట‌కేల‌కు ఆయ‌న్ను సాగ‌నంపారు. వైసీపీకి భార‌మైన దువ్వాడ శ్రీ‌నివాస్ లాంటి క్ర‌మ‌శిక్ష‌ణ లేని నాయ‌కుల్ని విడిపించుకోవ‌డ‌మే ఉత్త‌మం.

అయితే వైసీపీలో ఇలాంటి దువ్వాడ‌లు చాలా మందే ఉన్నార‌ని ఆయ‌న‌పై స‌స్పెన్ష‌న్‌తో సొంత పార్టీలోనే చ‌ర్చించుకుంటున్నారు. అయితే దువ్వాడ మాదిరిగా మ‌రెవ‌రితోనో చెట్ట‌ప‌ట్టాలేసుకుని తిరిగితేనే క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘించిన‌ట్టు కాద‌ని పార్టీ పెద్ద‌ల‌కు అర్థం కావాల్సిన అవ‌స‌రం వుంది. వైసీపీని, అలాగే ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ను అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా ప్ర‌వ‌ర్తిస్తూ, కీల‌క స్థానాల్లో ఉన్న నాయ‌కులు కాని నాయ‌కుల‌పై దృష్టి సారించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌నే చ‌ర్చ పార్టీలో అంత‌ర్గ‌తంగా సాగుతోంది.

వైసీపీకి, జ‌గ‌న్‌కు తాము త‌ప్ప‌, ఇత‌రులెవ‌రూ ద‌గ్గ‌ర కాకూడ‌ద‌నే ఏకైక ఎజెండాతో, తాడేప‌ల్లిలో కాప‌లా కాస్తున్న గ్రామ‌సింహాలు అనేకం ఉన్నాయ‌ని నెటిజ‌న్లు దెప్పి పొడుస్తున్నారు. నిజంగా జ‌గ‌న్‌ను అభిమానించే వాళ్లు ఆయ‌న‌కు ద‌గ్గ‌రైతే, క్షేత్ర‌స్థాయి వాస్త‌వాల్ని, అలాగే కోట‌రీలోని క‌ట్ట‌ప్ప‌ల గురించి చెబుతార‌నే భ‌యం కొంద‌రిని వెంటాడుతోంది. అందుకే నిత్యం జ‌గ‌న్‌కు సొంత పార్టీ నేత‌ల‌పై కూడా పితూరీలు చెప్పే బ్యాచ్ తాడేప‌ల్లి వైసీపీ క్యాంప్ కార్యాల‌యంలో చురుగ్గా ప‌ని చేస్తోంద‌నే విమ‌ర్శ‌ను కొట్టి పారేయ‌లేం.

కుక్క, గాడిద‌లు త‌మ ప‌ని తాము చేసుకోవాల‌ని పెద్ద‌లు చెబుతుంటారు. ఆ ప‌ని కాకుండా ఇత‌ర ప‌నులు చేస్తేనే స‌మ‌స్య‌. ఎందుకో పెద్ద‌లు చెప్పిన ఆ సామెత‌, వైసీపీ లోపాల గురించి మాట్లాడుకునే సంద‌ర్భంలో గుర్తుకొస్తుంద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వైఎస్ జ‌గ‌న్ ఇచ్చిన బాధ్య‌త‌లు త‌ప్ప‌, మిగిలిన అన్ని ప‌నుల్ని చేసే దువ్వాడ శ్రీ‌నివాస్‌లు ముఖ్యంగా తాడేప‌ల్లిలో ఉన్నార‌ని, ఇప్పటికీ వాళ్ల‌లో ఎలాంటి మార్పు రాలేద‌నే ఆవేద‌న కేడ‌ర్‌లో ఉంది.

వైసీపీని బ‌లోపేతం చేయ‌డానికి ప‌నిచేయండ్రా బాబూ అని జ‌గ‌న్ న‌మ్మ‌కంతో ప‌లువురికి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అయితే జ‌గ‌న్ ద‌గ్గ‌ర త‌మ స్థానాన్ని సుస్థిరం చేసుకోడానికే వాళ్ల బుర్ర‌ను వాడుతున్నారు. జ‌గ‌న్‌, ప్ర‌జ‌ల‌కు వార‌ధిగా విధులు నిర్వ‌ర్తించాల్సిన కీల‌క బాధ్య‌త‌ల్లో ఉన్నోళ్లు, మ‌రింత దూరం పెంచ‌డానికి శ‌క్తివంచ‌న లేకుండా శ్ర‌మిస్తున్నారంటే న‌మ్మ‌గ‌ల‌రా? .. ఔను ఇదే వాస్త‌వం. మీడియా, జ‌గ‌న్ మ‌ధ్య పూజారిగా ప‌ని చేయాల్సిన వాళ్లు… నిప్పు పెట్టి చ‌లికాచుకుంటున్నారంటే న‌మ్మ‌గ‌ల‌రా?.. ఇదే నిజ‌మ‌ని నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.

అలాగే రాజ‌కీయంగా చోటు చేసుకుంటున్న మార్పుల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు జ‌గ‌న్‌కు వివ‌రిస్తూ, స‌రైన మార్గంలో పార్టీని న‌డిపించాల్సిన స‌ల‌హాదారులు త‌మ అస‌లు బాధ్య‌త‌ల్ని విస్మ‌రించారు. సొంత పార్టీలోని నాయ‌కుల‌పై నిత్యం నెగెటివిటీని ఎక్కిస్తూ, జ‌గ‌న్‌కు శాశ్వ‌తంగా దూర‌మ‌య్యేలా చేస్తున్నార‌నే విజ‌య‌సాయిరెడ్డి ఆరోప‌ణ‌లు ఆలోచింప‌ద‌గ్గ‌వే. ఇలాంటి వాళ్లంతా వైసీపీకి ఆరో వేలు లాంటి వాళ్లే.

దువ్వాడ క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘ‌న వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న‌కు ఎక్కువ న‌ష్టం క‌లిగించింది. ఆ త‌ర్వాతే పార్టీకి. కానీ తాడేప‌ల్లిలో వైఫైలా ఉన్న కొంద‌రు నాయ‌కుల తీరు వైసీపీకి తీవ్ర‌మైన న‌ష్టం తీసుకొస్తుంద‌నే ఆందోళ‌న సొంత పార్టీ నేత‌ల్లోనూ, కార్య‌క‌ర్త‌ల్లోనూ వుంది. వైసీపీ నుంచి ఆ స్క్రాప్‌ను ఎంత త్వ‌ర‌గా అమ్ముకుంటే, ఆ పార్టీకి అంత మంచిదనే అభిప్రాయం ప్ర‌తి కార్య‌క‌ర్త‌లో వుంది. అయితే ఈ చేదు నిజం జ‌గ‌న్ చెవిలో వేసే మార్గం ఏంటో అంతుచిక్క‌డం లేదు. జ‌గ‌న్‌కు నిజాలు చేరే దారేది? ఇప్పుడిదే ప్ర‌శ్న‌.. వైసీపీ శ్రేణుల మ‌న‌సుల్ని తొలిచేస్తోంది.

22 Replies to “వైసీపీలో ఎంద‌రో దువ్వాడ‌లు.. తొల‌గించేదెన్న‌డో?”

  1. 🔥 జగన్‌ను ప్రజలు ఓడించలేదు… నేరుగా చెంపదెబ్బ కొట్టారు!

    ఇది ఓ సాధారణ ఓటింగ్ ఫలితం కాదు బాస్…

    ఇది ప్రజల కోపం, అసహనం, అవమానానికి ఇచ్చిన ప్రతిస్పందన!

    👉 తల్లిని కోర్టుకి లాగిన వాడికి ప్రజలు గౌరవం చూపారా?

    👉 చెల్లిని అవమానపరిచిన వ్యక్తికి ఇంకెవరైనా అండగా నిలుస్తారా?

    ప్రజలు ఏం చేశారు తెలుసా?

    ఒక నిమిషం కూడా వెనక్కి చూసుకోకుండా, ఒక్క ఓటుతో నేరుగా గుద్దిన చెంపతాటు వేశారు.

    📉 151 నుంచి 11? ఇదెక్కడ ఓ సాధారణ ఓటు తేడా లా ఉంది?

    ఇది ఒక మౌన తిరుగుబాటు కాదు… ఇది ఓ గర్జన!

    ఓట్ల ద్వారా ప్రజలు జగన్‌కి చెప్పిన తుది తీర్పు: “జనం మాయలో పడే రోజులు ముగిశాయి!”

    ఇప్పుడు YCP పేరు వింటేనే జనం చిరాకుపడుతున్నారు.

    గ్రామాల్లో ఫ్లెక్సీలు లేవు, పట్టణాల్లో క్యాడర్ మాయం, నగరాల్లో ఆది అభిమానం మిగల్లేదు.

    💥 ఇది ఓటింగ్ కాదు…

    ఇది ప్రజల చేతిలో వాలిన అర్హత చెంపదెబ్బ.

    ఇది జగన్‌పై వేసిన ముద్ర – “ఇక ఈ వ్యక్తికి ముఖ్యమంత్రి పదవికి అర్హత లేదు!”

    #చెంపతాటు2024

    #తీవ్రతిరస్కారం

    #JaganRejected

    #SelfRespectVote

    #NeverAgainJagan

    #YSRCPGone

    #PublicSlap

    #AndhraDecided

  2. Party lo em jaruguthundho thelusukoleni vaadiki party enduku..niku ammi dhobbamanu GA, nuvvu aithe party ni baaga balopetham chesthavani na feeling..emantav??

  3. పాపం మన ఎన్కటిని సజ్జల అండ్ గ్యాంగ్ తాడేపల్లి గడప తొక్కనిచ్చినట్లు లేరు

  4. క్రమశిక్షణ తప్పిన అబ్బాయిలని శిక్షిoచడానికి బాబాయ్ కొరడా తీసుకున్నాడా

  5. ఇలా తొలగించుకుంటూ పోతే వైసీపీ లో ఎవ్వరూ మిగలరు. ఆ పార్టీ ఇక మూసేసుకోవటమే.

  6. ఆ పార్టీ నే సస్పెండ్ చేస్తే పోలా? నీకు కూడా శ్రమ తగ్గుతుంది , హ్యాపీ గా అన్నీ మూసేసుకుని వేరే పని చేసుకోవచ్చు . 

  7. ఇది అన్యాయం…అక్రమం…

    ఏదో కామం తో తహ తహ లాడుతున్న మహిళ జీవితం లో దివ్వెలు వెలిగించాడు మన అందరి దువ్వాడ…

    ఇది తప్పా తప్పా తప్పా తప్పా…చెప్పండి ప్రెండ్స్ 

    జై మాధురి…జై జై దువ్వాడ

  8. మేము అంతే…మేము పాత కాలం రాజకీయాలు చేయము, కార్పొరేట్ తరహా కొత్త రాజకీయాలు చేస్తాము, చేసి బొక్క బోర్లా పడుతాము..మమల్ని జనాల్లో సంక నాకించడానికి మాకు పెద్ద సజ్జల కావాలి, సోషల్ మీడియా లో సంక నాకించడానికీ మాకు చిన్న సజ్జల కావాలి, మేము మాత్రం కింది స్థాయి నాయకులు చెప్పేది డైరెక్ట్ గా వినము, సజ్జల, చెవిరెడ్డి, పెద్దిరెడ్డి, మిథునం రెడ్డి లాంటి పెద్ద రెడ్లు చెప్తేనే వింటాము. ఇప్పటికీ మేము అదే చేస్తున్నాము. మేము అట్లనే ఉంటాము. 

  9. వైసీపీ అధికారంలో ఉన్నపుడు ఏనాడైనా వ్యతిరేక వార్త అటుంచి కనీసం 2,3 లెవల్ నాయకులపై చిన్నపాటి విమర్శ అయినా  చేసావా. ఇపుడు ప్రతిరోజూ వైసీపీ పై జగన్ తో సహా వ్యతిరేక వార్తలు విమర్శలు రాస్తున్నావు. ఏబియన్ కిట్టూ నయం ఆరు నూరైనా వ్యభిచారి జర్నలిజం చేసైనా తన జాతి నాయకత్వాన్ని అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎంత తప్పు చేసినా    సమర్థిస్తూనే ఉంటాడు. 

Comments are closed.