మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తిడితేనే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మాటకు విలువ. అప్పుడే టీడీపీ అనుకూల మీడియా షర్మిల ఆరోపణలకు ప్రాధాన్యం ఇచ్చి ప్రచురిస్తుంది. కూటమి సర్కార్‌ను చిన్న విమర్శ చేసినా, పట్టించుకునే పరిస్థితి వుండదు. ఇదే విషయాన్ని రెండురోజుల క్రితం షర్మిల నెత్తీనోరూ కొట్టుకుంటూ మరీ చెప్పారు. కేవలం తన అన్న జగన్‌ను తిట్టడానికే షర్మిల కాంగ్రెస్ అనే రాజకీయ పార్టీ నీడలో వుందని లోకం కోడై కూస్తోంది.
దివంగత వైఎస్సార్ కుమార్తె అయిన షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇస్తే, ఆ పార్టీ ఎంతోకొంత ఊపిరి పోసుకుంటుందని అనుకున్నారు. అబ్బే, అలాంటిదేమీ లేకపోగా, మరింతగా దిగజారింది. దీనికి ప్రధాన కారణం… షర్మిల రాజకీయ నడవడికే అని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో షర్మిల ఆరోగ్యశ్రీపై పెట్టిన పోస్టును గమనిస్తే, వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఒక్క తిట్టు కూడా తిట్టలేదు. ఆ పోస్టులో ఏముందంటే…
“పేరుకు రైజింగ్ స్టేట్.. కానీ వైద్య సేవలకు దిక్కులేదు. పేదోడి ఆరోగ్యానికి రాష్ట్రంలో భరోసా లేదు. ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వానిది అంతులేని నిర్లక్ష్యం. ఆరోగ్య శ్రీ సేవల కింద రూ.3500 కోట్లు పెండింగ్ పెట్టడం నిజంగా సిగ్గుచేటు. గత 9 నెలలుగా పూర్తి స్థాయిలో బకాయిలు విడుదల చేయకుండా వైద్య సేవలు ఆపేదాక చూడటం అంటే.. ఆరోగ్యశ్రీ పై సర్కారుకున్న చిత్తశుద్ధి ఏంటో అర్థమౌతుంది. పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగమే ఇదంతా. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచే ఆరోగ్యశ్రీ అనారోగ్య శ్రీగా మారింది. పేదోడికి వైద్యం అందని ద్రాక్ష అయ్యింది.
వైద్య సేవలను విస్తృత పరుస్తామని, వైద్యానికి గ్లోబల్ సిటీగా చేస్తామని, గొప్పలు చెప్పే చంద్రబాబు గారు.. ముందు ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయండి. ఏ ప్రభుత్వం బకాయిలు పెట్టినా అవి చెల్లించాల్సిన బాధ్యత మీదే అని తెలుసుకోండి. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ కింద వైద్యం అందక ఏ ఒక్కరూ మృతి చెందినా.. అవి కూటమి ప్రభుత్వం చేసిన హత్యలే అవుతాయని గుర్తుపెట్టుకోండి” అని ఆమె హెచ్చరించారు.
షర్మిల తీరులో నిజంగా మార్పు వస్తోందా? అంటే… ఆ ప్రశ్నకు కాలం జవాబు చెప్పాల్సి వుంటుంది. రానున్న రోజుల్లో విధానాల పరంగా షర్మిల వ్యవహరించే తీరునుబట్టి, ఒక అంచనా వేయొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జాయిన్ కావాలి అంటే
English ఎడిషన్లొ నువ్వె రాసావు కదరా.. అందులొ 2500 కొట్లు జగన్ చెల్లించకుండా వెళ్ళాడు అని!
On one side government claims that GSDP increased from 6% to 8% and on the other side they say that they do not have funds to pay dues for Aarogyasri scheme. If GSDP increased, why is government not clearing the dues from last 10 months? These dues are for last 2 years of which alliance has been in power for last 10 months. Jagan did not clear dues for 2023 – 2024 which normally gets cleared in 2024 which the incoming new government must pay but is being ignored even after GSDP growth and 1.5L crores of loans being secured. What more to say?