ఆర్జీవీకి ఏపీ పైబ‌ర్ నెట్ కార్పొరేష‌న్ నోటీసులు!

వ్యూహం సినిమాకు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వైసీపీ ప్ర‌భుత్వం నిధులు పొందావ‌ని, వివ‌ర‌ణ ఇవ్వాలంటూ ఏపీ పైబ‌ర్‌నెట్ కార్పొరేష‌న్ వ‌ర్మ‌కు నోటీసులు ఇచ్చింది.

ద‌ర్శ‌కుడు ఆర్జీవీని ఏపీ స‌ర్కార్ వెంటాడుతోంది. సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌పై అభ్యంత‌ర‌క‌ర పోస్టులు పెట్టారంటూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టీడీపీ నాయ‌కులు ఫిర్యాదులు చేయ‌డం, ఆయ‌న‌పై కేసులు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత అరెస్ట్ కాకుండా ముంద‌స్తు బెయిల్ పొందారాయన‌. దీంతో ప్ర‌భుత్వం శాంతించ‌లేదు.

తాజాగా ఆర్జీవీకి ఏపీ పైబ‌ర్ నెట్ కార్పొరేష‌న్ నోటీసులు జారీ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆర్జీవీ ద‌ర్శ‌క‌త్వంలో వ్యూహం సినిమా తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. కేవ‌లం 1863 వ్యూస్‌కు రూ.2.10 కోట్లు ఏపీ పైబ‌ర్ నెట్ నుంచి వ‌ర్మ ద‌క్కించుకున్నార‌ని రెండు రోజులుగా ఆ కార్పొరేష‌న్ చైర్మ‌న్ జీవీరెడ్డి ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై విచార‌ణ జ‌రిపిప్తామ‌ని ఆయ‌న అన్నారు.

జీవీరెడ్డి అన్న‌ట్టుగానే విచార‌ణ‌కు సంబంధించి ఒక అడుగు ముందుకు ప‌డింది. వ్యూహం సినిమాకు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వైసీపీ ప్ర‌భుత్వం నిధులు పొందావ‌ని, వివ‌ర‌ణ ఇవ్వాలంటూ ఏపీ పైబ‌ర్‌నెట్ కార్పొరేష‌న్ వ‌ర్మ‌కు నోటీసులు ఇచ్చింది.

కేవ‌లం నోటీసుల‌కే ప్ర‌భుత్వం ప‌రిమితం అయ్యే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. వీలైతే ఆయ‌న్ను కేసులో ఇరికించి, ఈ ర‌కంగా అయినా జైలుకు పంపాల‌నేది ప్ర‌భుత్వ ఆలోచ‌న‌గా క‌నిపిస్తోంది. వ‌ర్మ వ్యూహం ఏంటో తెలియాల్సి వుంది.

8 Replies to “ఆర్జీవీకి ఏపీ పైబ‌ర్ నెట్ కార్పొరేష‌న్ నోటీసులు!”

  1. అంటె నువ్వు ఫ్రీ గా వెసినా ఆ దిక్కుమలిన సినిమా ఎవరూ చూడలెదా? 1863 వ్యూస్ అంటె.. ఒక్కొక వ్యూ కి సుమ్మరు 11 వేలు కర్చు అయ్యిందా? బొహిసా సినిమా చరిత్రలొనె ఇదె అత్యంతా costly టికెట్లు అనుకుంటా? పవన్ సినిమా Rs 5 కె వెయాలి అని మరి ఇప్పుడు టిక్కెట్టు 11 వేలు ఎలా కర్చు చెసాడు?

    .

    సినిమా పెరుతొ జనం సొమ్ము అప్పనంగా తిని… ఇoకా ఎదొ RGV ని ఇరికిస్తున్నారు అని కూస్తావ్ ఎమిటి రా?

  2. RGV can become RRR like in the past.

    he can become a ghost this tdp pig can hunt for…

    guess what.. tdp pigs ki papam alasata tappa emi raadu..

    already 6 months over…many of the fake promises by bolli Alias cbn didn’t fulfill so far..

    papam..janalu…time daggirapadindi…tdp pigs mida tiragabadadiniki..

    tdp pigs: you time is running out….😂🤣

  3. ఈ నోటీస్ మడిచి బాక్ పాకెట్ లో పెట్టుకోమని చెబుతాడు ఆర్జీవి. జీవిరెడ్డి మూసుకుని ఆ పని చేస్తాడు. అంతకన్నా ఇంకేమీ ఉండదు.

Comments are closed.