వారెవ్వా.. పవన్, నాగబాబు లకు బ్యాక్‌గ్రౌండ్ లేదంట!

పవన్ కల్యాణ్.. తనలాగానే నాగబాబును కూడా డిప్యూటీ చేయమని అడుగుతారేమో అని కూడా జనం నవ్వుకుంటున్నారు.

తాను స్వయంకృషితో ఎదిగిన మహానుభావుడిని అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారా? లేదా, అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పాత్ర తన ఎదుగుదలలో ఏమాత్రం లేదని చాటుకోదలచుకుంటున్నారో తెలియదు గానీ.. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఒక చిత్రమైన ప్రకటన చేశారు.

తనకు నాగబాబు కు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదని అన్నారు. సొంతంగా ఎదిగాం అని ప్రకటించుకున్నారు. నాగబాబుకు మంత్రి పదవి విషయంలో స్పందిస్తూ పవన్ కల్యాణ్ ఇలా సొంత డప్పు కొట్టుకోవడం విశేషం.

‘మాకు బ్యాక్ గ్రౌండ్ లేకున్నా అన్నయ్య సొంతంగా ఎదిగారు. ఇప్పుడు మా తర్వాత తరం పిల్లలకు ఒక బ్యాక్ గ్రౌండ్ ఉంది. మనతో ప్రయాణం చేసి, పనిచేసిన వారిని నేను గుర్తించాలి’’ అంటూ పవన్ కల్యాణ్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

బ్యాక్ గ్రౌండ్ అంటే ఏమిటని పవన్ ఫీలవుతున్నారో తెలియదు. మెగాస్టార్ చిరంజీవి లేకపోతే ఈ పవన్ గానీ, నాగబాబు గానీ.. వీళ్లందరూ ఎక్కడ ఉండేవాళ్లో ఆయనకు కనీసం అవగాహన లేదా? అనే మాట ప్రజల్లో వినిపిస్తోంది. రాజకీయంగా ఇప్పుడు మంచి పదవిలో ఉన్నారు గనుక.. ఇలాంటి అహంకారపూరిత మాటలు తగునా అని కూడా అనుకుంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి పట్ల భక్తి ప్రపత్తులు ప్రదర్శించడం, కనిపించగానే కాళ్లు మొక్కడం ఇవన్నీ పైపై నాటకాలు మాత్రమేనా అనే అనుమానం కూడా ప్రజలకు కలుగుతోంది. తమకు బ్యాక్ గ్రౌండ్ లేదని పవన్ ఎలా చెప్పగలరని ప్రశ్నిస్తున్నారు.

నిజానికి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం అనే పార్టీ విఫల ప్రయత్నం అయి ఉండొచ్చు గాక! కానీ ఇంటర్మీడియట్ చదివిన ఒక మామూలు కుర్రవాడిని సినిమా హీరో ని చేసిన చిరంజీవి బ్యాక్ గ్రౌండే.. ఆ హీరోని యువరాజ్యం సారథిగా రాజకీయ నాయకుడిని కూడా చేసింది. చిరంజీవి బ్యాక్ గ్రౌండ్ ఉండబట్టే.. వైఎస్ రాజశేఖర రెడ్డి వంటి నాయకులను కూడా పంచెలూడదీసి తరుముతానని పవన్ కల్యాణ్ ఆ రోజుల్లో అతి డైలాగులు వల్లించగలిగారు. ఇప్పుడు పదవిలో ఉన్నారు గనుక.. అవన్నీ మర్చిపోతే ఎలా అనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది.

‘నాగబాబు నాతో పాటు సమానంగా పనిచేశారు. వైసీపీ నేతలతో తిట్లు తిన్నారు. పార్టీకోసం నాగబాబు నిలబడ్డారు. ఇక్కడ కులం బంధుప్రీతి కాదు. పనిమంతుడా? కాదా? అనేది చూడాలి’ అంటున్న పవన్ కల్యాణ్.. తనలాగానే నాగబాబును కూడా డిప్యూటీ చేయమని అడుగుతారేమో అని కూడా జనం నవ్వుకుంటున్నారు. వైసీపీ నేతలతో తిట్లు తినడం ఒక్కటే అర్హత అన్నట్టుగా ఆయన మాటలు ఉన్నాయని అంటున్నారు.

21 Replies to “వారెవ్వా.. పవన్, నాగబాబు లకు బ్యాక్‌గ్రౌండ్ లేదంట!”

  1. క్రితం సారి పవన్ నీ అస్తమానం కెలుక్కుని వైసీపీ నీ 11 కి తెచ్చారు…. అయినా మార్పు లేదు…. ఇంకా ఎక్కడికి తీసుకు పోదామని…… ఆయన సంగతి వదిలేయండయ్యా సామి….. అన్నట్లు నాకు పేపర్ లేదు, ఛానల్ లేదు అని ఎవరో అన్నారు…

  2. అదే కదా మన అన్న నాకు సొంత మీడియా లేదు అని చెప్పుకున్నట్టు లేదు

  3. ఒ రే య్ ల వ డ గ్యా స్. గా. …. ” ప వ న్ క ల్యా ణ్ *. ఇ లా. వి ష ప్ర చా రం

    చే సే * జ ల గ న్న గా డు కీ * ప తి ప క్ష. హో దా కూ డా. రా లే దు

  4. Serious GA? your editorials are just trash to read ,and i still read bcos there should be some one who hits back to your shitty writings? In politics we all know the result of PRP and janasena too , but it was alone pawan kalyan who stand firm and won elections definitely respected Pawan won elections single handedly with out any support.

  5. political ga pk garu tana party ni pettindi..START CHESINDI …0….. nunndi kadu…..minus – level nunndi ….prp party ni congress party lo kalapadam valana..ok……father death ni ,babai death ni …..vala sympathy……vala meeda vunna abhimanam tho zero knowledge vunna person ki most senior congress leaders &…..congress cadre…..and public sympathy ……anni kalasi ….aa zero knowledge vunna person gelavadam jargindi…..mr GRET ANDHRA …GARU….BASIC KNOWLEDGE VUNNA VALAKU TELUSTHUNDI …COMING FUTURE LO…..NUVVU SUPPORT CHESE MENTALLY HANDCRAFTED PERSON KI NOOOOOOO CHANCE MR GREAT ANDHRA GARU…..AALANE MEERU KUDA AP STATE ,AND PUBLIC KI ….MANCHI CHESE GOVERMENT GUNCHI THINK CHEYAVASINA BHADIYATHA MEEKU VUNDI GA …….AP STATE AND PUBLIC GUNCHI …THINK CHESI EE MATTER WRITE CHEYADAM JARIGINDI…..MR GREAT ANDHRA GARU…..

  6. మా జగన్ అన్నకి కూడా ఎ బ్యాక్ గ్రౌండ్ లెదు. అయినా వెల కొట్లు సంపాదించారు. ప్రత్యెక హొదా (సంజీవిని) కొసం మొడీ నె ఎదిరించి పొరాడారు.

  7. akkada 100 vishayalu chepthe niku kavalsina aa okkate vethukkuntav chudu, akkade nuvvu special ga untav Greatandhra. ee article lo special enti ante, kaneesam rasav mundu venaka matladindhi. so chadivina vallaki aayana matladindhi correct gane anipisthundi. adi kaneesam chadavakunda kinda comments chesaru chudu kondharu, vallu niku mathrame unde fans.

  8. ఇది జగ్లక్ సాచ్చి పేపర్ తో TVతో సంబందం లేదు అన్నదానికన్న పెద్ద జోక్ ఆ ఇది…నువ్వు నీ ఓవరాక్షన్

Comments are closed.