దువ్వాడతో టెక్కలి చిక్కులు

వైసీపీ ఆయనకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది. ఆయన మాత్రం పార్టీకి ఏ విధంగానూ ఉపయోగపడలేకపోయారు. ఆయనే సదా వివాదాలను తెచ్చుకునే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌. Advertisement ఆయన కాంగ్రెస్‌లో మొదట ఉండేవారు. అపుడు…

వైసీపీ ఆయనకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది. ఆయన మాత్రం పార్టీకి ఏ విధంగానూ ఉపయోగపడలేకపోయారు. ఆయనే సదా వివాదాలను తెచ్చుకునే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌.

ఆయన కాంగ్రెస్‌లో మొదట ఉండేవారు. అపుడు కూడా జిల్లా నాయకులతో ఆయనకు పడేది కాదని చెబుతారు. ఆ తరువాత ప్రజారాజ్యంలో చేరారు. అక్కడ నుంచి వైసీపీకి బదిలీ అయ్యారు.

వైసీపీ ఆయనకు 2014లో, 2024లో టెక్కలి అసెంబ్లీ టిక్కెట్‌ ఇచ్చింది. 2019లో శ్రీకాకుళం ఎంపీ టిక్కెట్‌ ఇచ్చింది. ఈ మూడు ఎన్నికలలోనూ ఆయన ఓటమి పాలు అయ్యారు. దానికి కారణం ఆయన నోరు జోరు అని కూడా విమర్శలు ఉన్నాయి.

సొంత పార్టీ వారితోనే ఆయనకు పడదు అన్నది కూడా ప్రచారంలో ఉంది. అలాగే సొంత సామాజికవర్గాన్ని సైతం కలుపుకుని పోయే ఓర్పు నేర్పూ లేదని అంటారు. అయినా జగన్‌ ఆయనను ఎమ్మెల్సీ చేశారు.

టెక్కలిలో బలమైన నేత కింజరాపు అచ్చెన్నాయుడును ఓడిస్తారని వైసీపీ అధినాయకత్వం నమ్మింది. కానీ భారీ ఓటమిని మూటకట్టుకున్న దువ్వాడ శ్రీనివాస్‌ ఇపుడు వ్యక్తిగత విషయాలలో పీకల్లోతు వివాదాలలో పడ్డారు. ఆయన భార్య కుమార్తెలే ఆయనకు ఎదురు నిలిచారు. దీంతో టెక్కలి వైసీపీకి దిక్కు ఎవరు అన్న చర్చ సాగుతోంది.

దువ్వాడను పక్కన పెట్టి కొత్త నాయకత్వాన్ని ముందుకు తీసుకుని రావాల్సిన అవసరం ఉందని కార్యకర్తలు అంటున్నారు.

12 Replies to “దువ్వాడతో టెక్కలి చిక్కులు”

  1. గెలవలేదని, భార్య అండ్ కూతురు ఎదురు నిలిచారని నన్ను పీకేస్తావా??

    నీ తల్లీ, చెల్లి ఎదురు నిలిచారు కదరా పొట్టి పకోడీ? నువ్వు నీ ఫ్యామిలీ లో సక్కగా ఉండక party ని ఓడించావ్.. నీకేం శిక్ష వెయ్యాలి మరి??

  2. “నా భార్య కూతురు ఎదురు నిలిచారని తెలిసి కూడా టికెట్ నాకే ఇచ్చి ప్రచారం లో పక్కన నిలబెట్టుకుని మరీ, నన్ను మంచివాడు, రాముడు లాంటి వాడు అంటూ బాగా దువ్వి, ఇప్పుడు ఉన్న పదవి ఊడ పెరిగితే.. నీ ప్యాలస్ లో “గోరంట్ల గుసగుసల లీలలు” బయటికి తీస్తా ల0గా Leven గా” — దువ్వడ.

  3. ఇంకొక నాయకుడ్ని తీసుకువచ్చే సత్తా ఇపుడు వైకాపాకు లేదు. ఇపుడు ఉన్న ప్రతిపక్ష సూన్యతను ఏ పార్టీ భర్తీ చేస్తుందో చూడాలి. ఒకరకంగా షర్మిలకు ఇది మంచి అవకాశం, లేదా జనసేన తీసుకోవాలి.

  4. ప్రతి పక్షం మీద నోరు పారేసుకోమని చెప్పేది జగనే ఇప్పుడు నోరు – జోరు అని విమర్శించేది జగన్ మనుషులే

    ఎవడి స్టైల్ వాడిది ఎవడి బలం వాడిది

    అక్కడ అచెన్నాయుడ్ని ఎదుర్కునే ఇంకో నాయకుడు లేకేకథ e mlc lu avi ఇచ్చి బుజ్జగిస్తున్నారు

Comments are closed.