కూటమి ప్రభుత్వం హామీల్ని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని వైసీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కల్యాణి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇవాళ ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ… గతంలో కూటమి ఇచ్చిన ఒక్కో హామీని ప్రస్తావిస్తూ, ఎక్కడ అమలు చేస్తున్నారంటూ ఏకిపారేశారు.
ఎన్నికల ప్రచారంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కూటమి నేతలు ఊదరగొట్టారని అన్నారు. ఈ పథకం గురించి ఎక్కువగా ప్రచారం చేయడాన్ని ఆమె గుర్తు చేశారు. జూన్ 4న అధికారంలోకి వస్తామని, ఆ వెంటనే రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలన్నింటిని మహిళలు దర్శించుకోవచ్చని నమ్మబలికారన్నారు. జూన్, జూలై.. ఇప్పుడు జనవరిలో పెద్ద పండుగైన సంక్రాంతి కూడా వస్తోందని, మహిళలకు ఉచిత ప్రయాణం ఎక్కడని ఆమె నిలదీశారు.
అలాగే తల్లికి వందనం పథకం ఏమైందని ప్రశ్నించారు. మరీ ముఖ్యంగా జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసి, అంతకంటే ఎక్కువగా 16 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారన్నారు. నవంబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామన్నారని, ఏదీ అని ఆమె నిలదీశారు. అలాగే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారని ఆమె గుర్తు చేశారు. ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారని, ఇంత వరకూ అతీగతీ లేదని ఆమె తూర్పార పట్టారు.
ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే, నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామన్నారని, ఎంత మందికి ఇస్తున్నారని ఆమె ప్రశ్నించారు. అలాగే వలంటీర్లను వీధిన పడేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని ఆమె విమర్శించారు. గతంలో నిమ్మల రామానాయుడు వలంటీర్లకు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తే, జున్ను తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పడాన్ని కల్యాణి గుర్తు చేశారు. ఇప్పుడు ఉద్యోగాలు పోయినందుకు జన్ను తీసుకెళ్లి ఇవ్వాలా? అని ఆమె నిలదీశారు.
ఉద్యోగుల్ని కూడా ఈ ప్రభుత్వం నిట్టనిలువునా మోసగించిందని విమర్శించారు. డీఏ, పీఆర్‌సీ కమిషన్ , ఐఆర్ లేవని ఆమె ఏకరువు పెట్టారు. గతంలో తమ ప్రభుత్వం 27 శాతం ఐఆర్ ఇచ్చిందన్నారు. ఉద్యోగులను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు కదా? అని ఆమె ప్రశ్నించారు. ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా వుందన్నారు. జైల్లో పని చేసే ఉద్యోగుల్ని బట్టలిప్పి మరీ తనిఖీ చేస్తున్నారని తెలిసిందన్నారు.
So, Jagan should come back. Anthenaa?
నిన్ను ఏ జైల్లో బట్టలు ఊడదీశారో చెప్పగలవా
వారంలో పిఆర్సి చేస్తానన్న పెద్దమనిషి ఐదేళ్లు చేయలేకపోయాడు. మరి దాని గురించి నీ అమ్మ మొగుణ్ణి అడగమంటావా.?2000 ఉన్న పెన్షన్ 3000 చేయడానికి ఐదేళ్లు పట్టింది. దాని గురించి కూడా నీ అమ్మ మొగుడిని అడగమంటావా?. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ వడి ఇస్తానన్నాడు. తర్వాత మాట తప్పి మడమతిప్పి ఒక్కరికి అన్నాడు. మరి దీని గురించి మీ అమ్మ మొగుణ్ణి అడగమంటా వా ? ఆడది పుట్టిన తర్వాత కాస్త సిగ్గు శరం ఉండాలి అమ్మ . మరి సిగ్గు తప్పి మాట్లాడితే బజారుది అంటారు
ఎవరు రా అయ్య ఈమె!
ఉద్యోగులను పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్న జగనన్న అంటారు అంతేనా కళ్యాణి గారు