మోడీ సభలో బాబు- పవన్ ఆ మ్యాటర్ మాట్లాడుతారా?

ఉక్కు ఉద్యమకారులు కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చొరవ తీసుకుని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద మాట్లాడాలని కోరుతున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన అధికారికంగా ఖరారు అయింది. ఈ మేరకు అధికారిక వర్గాలు షెడ్యూల్ ని రిలీజ్ చేశాయి. ఈ నెల 8న విశాఖకు ప్రత్యేక విమానంలో ప్రధాని ఢిల్లీ నుంచి నేరుగా చేరుకుంటారు అని తెలుస్తోంది. విశాఖలో మోడీ నాలుగు గంటల పాటు బిజీగా గడుపుతారు.

అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు. ఆయన ఒక భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. దాని కోసం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానాన్ని అధికారులు ఎంపిక చేశారు. మోడీ రెండున్నరేళ్ల క్రితం 2022 నవంబర్ లో విశాఖలో పర్యటించారు. అపుడు కూడా ఆయన ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లోనే ప్రసంగించారు.

మోడీ సభలో ఆనాడు ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నారు. ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూని ప్రస్తావించారు. అలాగే ప్రత్యేక హోదా గురించి కూడా వేదిక మీద ప్రధాని ఉండగానే జనం సాక్షిగా అడిగారు. తమకు ఏపీ ప్రయోజనాలు ముఖ్యమని కూడా జగన్ నాడు తెగేసి చెప్పారు.

ఈసారి ఆయన పర్యటనలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేసే విషయం మీద క్లారిటీ ఇస్తారా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఉక్కు కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు అయితే మోడీ స్టీల్ ప్లాంట్ మీద స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇపుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానితో వేదికను పంచుకోనున్నారు. ఈ ఇద్దరూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇష్యూని మోడీ ముందు ప్రస్తావిస్తారా అన్నది కూడా అంతా తర్కించుకుంటున్నారు. కూటమి పెద్దలు ఈ అంశాన్ని కనుక మోడీకి వివరిస్తే ఆయన దాని మీద స్పందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.

ఉక్కు ఉద్యమకారులు కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చొరవ తీసుకుని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద మాట్లాడాలని కోరుతున్నారు. ప్రధాని విశాఖ వస్తున్న సమయంలో ఆయన ముందు స్టీల్ ప్లాంట్ సమస్యను కనుక ప్రభుత్వ పెద్దలు చెప్పి ఒప్పించకపోతే ఈ మంచి అవకాశాన్ని పూర్తిగా వదిలేసుకున్నట్లు అవుతుందని అంటున్నారు. స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఇదే ఆఖరి అవకాశం గా చెబుతున్నారు.

ఆ తరువాత కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతుందని ఆ బడ్జెట్ లో ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో ఏమైనా సీరియస్ స్టెప్స్ తీసుకుంటే విశాఖ ఉక్కు గురించి మరిచిపోవడమే బెటర్ అని అంటున్నారు. సరైన సమయంలో విశాఖ వస్తున్న ప్రధాని ముందు గొంతు విప్పాల్సింది కూటమి పెద్దలే అని ప్రజా సంఘాల్తో పాటు ఉక్కు కార్మిక సంఘాలు అంటున్నాయి.

6 Replies to “మోడీ సభలో బాబు- పవన్ ఆ మ్యాటర్ మాట్లాడుతారా?”

  1. ఇంతకీ అప్పుడు ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ఏ భాష లో విన్నవించాడో గుర్తుందా? తెలుగు లో…ఫస్ట్ క్లాసు స్టూడెంట్ కి అప్పుడు తన ఇంగ్లీష్ పాండిత్యం గుర్తుకురాలేదు

  2. వాళ్లకు ఆల్రెడీ ఉద్యోగాలు వున్నాయి అమ్మేసిన వాళ్ళ ఉద్యోగాలకు డోకాలేదు మరి ఎందుకు గింజుకొంటున్నారు కేవలం ఆడుకు దొబ్బటానికి ప్రైవేట్ వాడు పనిచేయిస్తాడు అందుకు నచ్చదు సంస్థ లాస్ జనాలు పన్నులు కట్టి భర్తీ చేయాలి అది వాళ్ళ కోరిక ముందర ఉద్యోగాలు లేని వాళ్ళ గురించి ఆలోచించాలి సంస్థను అమ్మేసి ఆ డబ్బుతో ప్రభుత్వం కొత్త ఉపాధి అవకాశాలను పెంపొందించాలి

Comments are closed.