మోదీ, బాబుకు ఇదే తేడా!

ప్ర‌ధాని మోదీ, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి ప‌రిపాల‌న‌లో స్ప‌ష్ట‌మైన తేడా క‌నిపిస్తోంది.

ప్ర‌ధాని మోదీ, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి ప‌రిపాల‌న‌లో స్ప‌ష్ట‌మైన తేడా క‌నిపిస్తోంది. ప్ర‌ధాని మోదీ ఎక్కువ మాట్లాడరు. ఏదైనా వుంటే, ప‌ని చేసిన త‌ర్వాతే నోరు తెరుస్తుంటారు. కానీ చంద్ర‌బాబునాయుడి చేత‌లు త‌క్కువ, మాట‌లెక్కువ అనే విమ‌ర్శ వుంది. అందుకే మోదీ స‌ర్కార్ వ‌రుస‌గా మూడోసారి కూడా కేంద్రంలో కొలువుదీరింది. అయితే మూడో ద‌ఫా ఇతర పార్టీల‌పై ఆధార‌ప‌డ‌డం వేరే సంగ‌తి.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో మోదీ రైతుల‌కు ఫ‌లానా మేలు చేస్తాన‌ని ప్ర‌త్యేకంగా ఆశ పెట్ట‌లేదు. కానీ ఇంత‌కాలం ఏడాదికి ఇస్తున్న రూ.6 వేల‌ను రూ.10 వేల‌కు పెంచి, రైతుల ఆద‌ర‌ణ చూర‌గొన్నారు. ఇక్క‌డే చంద్ర‌బాబు ప్ర‌ధానంగా విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న‌ది. అన్న‌దాత సుఖీభ‌వ కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. అధికారంలోకి వ‌చ్చి ఆరు నెల‌లు దాటింది.

ఇంత వ‌ర‌కూ ఆ ప‌థ‌కం అతీగ‌తీ లేదు. కానీ మోదీ హామీ ఇవ్వ‌కుండానే రైతుల‌కు పెట్టుబ‌డి సాయాన్ని పెంచి ఇవ్వ‌డానికి నిర్ణ‌యించారు. చంద్ర‌బాబు మాత్రం రాజ‌కీయంగా ప‌బ్బం గ‌డుపుకుని, త‌మ నోట్లో మ‌ట్టి కొడుతున్నార‌నే విమ‌ర్శ‌ను రైతాంగం నుంచి ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. ప్ర‌ధాని మోదీ ఎందుకు ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పొందుతున్నారంటే, చెప్ప‌కుండానే సాయం చేస్తున్నారు. విప‌రీత‌మైన హామీలిచ్చి, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత చంద్ర‌బాబు మాదిరిగా స‌న్నాయి నొక్కులు నొక్కి వుంటే …మోదీ కూడా అభాసుపాల‌య్యేవారు.

కానీ మోదీ ఆ ప‌ని చేయ‌లేదు. మోదీ పాల‌న గ‌మ‌నిస్తే, చాలా కీల‌క అంశాలు కూడా హామీ ఇవ్వ‌కుండానే చేసి ఆద‌ర‌ణ చూర‌గొన్నారు. చంద్ర‌బాబుకు మోదీ మాదిరిగా ఎక్కువ కాలం ప‌ద‌విలో ఉండాల‌నే ఆశ వుంది. కానీ అందుకు త‌గ్గ‌ట్టు పాలించాల‌నే కీల‌క అంశాన్ని బాబు మ‌రిచిపోతుంటారు. కేవ‌లం ఆశ మాత్ర‌మే ఉంటే స‌రిపోదు, ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పొందాలంటే కాసింతైనా నిజాయితీగా పాలించాల్సి వుంటుంది.

5 Replies to “మోదీ, బాబుకు ఇదే తేడా!”

  1. ఎవరన్నా చంద్రబాబు పాలనకి మన తుగ్లక్ పాలనకి పొలిక తెస్తారు!

    అయినా ఇద్దరు ముక్య మంత్రులని పొల్చుతారు కాని, ప్రదాన మంత్రిని, ఒక రాష్త్ర సి.ఎం ని పొల్చటం ఎమిటిరా?

  2. ఎవరన్నా చంద్రబాబు పాలనకి మన తు.-.గ్ల.-.క్ పాలనకి పొలిక తెస్తారు!

    అయినా ఇద్దరు ముక్య మంత్రులని పొల్చుతారు కాని, ప్రదాన మంత్రిని, ఒక రాష్త్ర సి.ఎం ని పొల్చటం ఎమిటిరా?

  3. ఒరే రోజూ సిగ్గు లేకుండా అబద్ధాలు రాసే ఎదవా. కేంద్రం ఇచ్చే 10 వేలకు ఇంకో పది వేలు కలిపి ఇవ్వాలని ఆంధ్ర కేబినెట్ తీర్మానించేసింది రా. జగన్ వదిలి వెళ్ళిన పెంట శుభ్రం చేసుకోవలికదా ! అన్నీ మొదటినెలల్లోనే అయిపోవు. పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పి అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు తీసుకున్నాడు.

Comments are closed.