ఈదేశం ఇప్పుడు సంబరాలు జరుపుకునే పండుగ చేసుకునే ఉత్సాహాన్ని అనుభవించే మూడ్ లో ఉన్నదా? పహల్గాం ఉగ్రదాడి తరువాత యావత్తు దేశంలో కులమత రహితంగా.. ఒకే రకమైన మైండ్ సెట్ తో ఉన్నారు. అందాల కాశ్మీరంలో కాటువేసిన ఉగ్రవాదం.. అమాయకుల ప్రాణాలను బలితీసుకున్న తీరుగురించి విషాదంలో ఉన్నారు. ప్రత్యేకించి ప్రధాని నరేంద్రనమోడీ పహల్గాం దాడిని చాలా సీరియస్ గా తీసుకున్నారు. సింధుజలాల ఒప్పందం రద్దు సహా దౌత్య నిషేధాలను విధించారంటే.. చాలా మంది చెబుతున్నట్టుగా ఆల్మోస్ట్ యుద్ధం ప్రకటించిన వాతావరణమే ఉందిప్పుడు.
ఇలాంటి సమయంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెళ్లి ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. మే2 వ తేదీన అమరావతి నగర పునర్నిర్మాణానికి రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. అమరావతి ఏ రకంగా తమ రాష్ట్ర పురోభివృద్ధికి అక్షయపాత్రలాగా మారబోతున్నదో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కూడా ప్రధానికి వివరించారు.
ప్రధాని మాత్రం.. అమరావతి నిర్మాణంలో పచ్చదనానికి పెద్దపీట వేయాలని సూచిస్తూ.. జపాన్ లో అనుసరిస్తున్న మియావాకి విధానం గురించి సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు. ఆ పద్ధతిలో త్వరగా పచ్చదనం విస్తరించే పనులు చేపట్టాలని సూచించారు.
అయితే ఇక్కడ కీలకంగా గమనించాల్సిన ఒక అంశం ఉంది. సాధారణంగా ముఖ్యమంత్రి ఎప్పుడు వెళ్లి ప్రధానిని కలిసినా సరే.. తిరుమల వేంకటేశ్వరస్వామి దారువిగ్రహాన్ని కానుకగా సమర్పించి, శాలువా కప్పి అభినందించిన తర్వాత భేటీ అవుతారు. అయితే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పుడున్న ఉద్రిక్త వాతావరణాలు, సత్కారాలు చేసుకోగలిగే మూడ్ లేదని అభిప్రాయపడిన చంద్రబాబు.. ఈసారి అలాంటి లాంఛనాలు పాటించకుండా.. కేవలం వచ్చి సింపుల్ గా ప్రధానిని కలిసి, ఆహ్వానించి, చర్చించి వెళ్లిపోయారు.
ఇక్కడే ప్రజలు మరో రకంగా అభిప్రాయపడుతున్నారు. యావత్తు దేశం ఇప్పుడున్న విషాదస్థితికి మద్దతు తెలియజేయడానికే కదా.. ప్రధానికి సత్కారాలు వంటి వాటికి చంద్రబాబు దూరంగా ఉన్నారు. అదే స్ఫూర్తిని.. అమరావతి పునర్నిర్మాణ వేడుకల విషయంలో కూడా పాటించవచ్చు కదా.. అనేది పలువురి సూచన.
అమరావతి కోసం ఇప్పుడు జరగబోతున్నది తొలి శంకుస్థాపన ఏమాత్రం కాదు. ఆల్రెడీ కొబ్బరికాయ కొట్టేసిన కార్యక్రమానికే మళ్లీ నానా హంగూ ఆర్భాటం చేస్తున్నారు. కేవలం ప్రధాని ముందు బలప్రదర్శన చేసుకోవడానికి తప్ప ఈ సభ మరెందుకూ పనికి రాదు. ఈ పునర్నిర్మాణ శంకుస్థాపన సభ ఎంత గ్రాండ్ గా జరిగితే అంతగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి.. అనే మాయమాటలు చెబితే.. అంతకు మించిన మోసం మరొకటి ఉండదు.
అమరావతి నగరం ఏర్పడే అద్భుతతీరును బట్టే పెట్టుబడులు వస్తాయి. కాబట్టి.. వేడుకలు, శంకుస్థాపన సంబరాల విషయంలో కూడా చంద్రబాబు పునరాలోచన చేస్తే బాగుంటుందని పలువురు భావిస్తున్నారు. అలాగని కార్యక్రమాన్ని వాయిదా వేయాలని కాదు. ప్రధాని రాకూడదని కూడా కాదు. ఏమాత్రం హంగూ ఆర్భాటమూ లేకుండా.. చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన ఎలాగైతే జరిగిందో, అంతే సింపుల్ గా ప్రధానితో రాష్ట్ర మంత్రులు కీలక అధికారులతో మాత్రం కలిసి శంకుస్థాపన జరిపిస్తే సరిపోతుంది కదా.. అనేది పలువురి భావన.
2400 బస్సులు పెట్టి, దాదాపు అయిదు లక్షల మందిని సమీకరించే ప్రయత్నాలుచేస్తూ.. కోట్ల రూపాయలు సభా నిర్వహణకు వెచ్చించే బదులుగా.. ఒక నిర్దిష్ట మొత్తంగా కొన్ని కోట్ల రూపాయలను పహల్గాం అమరుల స్మృతిలో రాష్ట్రప్రభుత్వం తరఫున దేశరక్షణ నిధికి సమర్పిస్తే ఎంతో స్ఫూర్తిదాయకంగానూ, గౌరవప్రదంగానూ ఉంటుంది కదా.. అని పలువురు సూచిస్తున్నారు. ఈ విషయంలో ఇటు చంద్రబాబు, అటు ప్రధాని మోడీ కూడా పునరాలోచన చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు.
వెంకట్ రెడ్డి ఇక్కడ సింపుల్ గా చెప్పొచ్చేదేమిటంటే..
మీ అమరావతి సంబరాలు చూస్తూ జగన్ రెడ్డి కి అసూయ, ద్వేషాలతో రగిలిపోతూ గుండెపోటు తో పోతే.. హూ ఐస్ రెస్పాన్సిబుల్ .. అని సందేహిస్తున్నాడు..
అందుకు.. టెర్రరిస్ట్ అటాక్స్ అనే సాకు తో అమరావతి అభివృద్ధి ని .. ప్రగతి ని ఆపేయాలని .. కుంచిత బుద్ధి చూపించుకొంటున్నాడు..
..
అయ్యా వెంకట్ రెడ్డి..
పహల్గామ్ ఉగ్రదాడి.. ప్రజావేదిక పైన సైకోదాడి రెండూ ఒకటే..
పడిన చోటే.. లేచి గెలిచి చూపించాలి..
నీతో పాటే ఏడుస్తున్న ఆ “పలువురు” కి చెప్పు.. ఇంకా ఏడిస్తే చస్తారు గాని.. అమరావతి మాత్రం ఆగే ప్రసక్తే లేదు..
బట్టలుడదీయకుండానే వాడి కుచ్చిత బుద్దిని, బైట పెట్టి అవమానించారు బ్రో..
Sir
G A కడుపు మంటకు ఎన్ని ఇనోలు కూడా సరిపోదు
ఏం బతుకు వీడిది
కేవలం అసూయ.. కుళ్ళు బుద్ది ..గ్రేట్ కాదు గ్యాస్ ఆంధ్రా అనేది ఇందుకే
ఇలాంటి సలహాలు జగనన్న హయాంలో ఎందుకు ఇవ్వలేదు బటన్ నొక్కడానికి ప్రతి సారి ప్రభుత్వ ఖర్చుతో భారీ సభలు పెట్టి భారీ గా జనసమీకరణ చేసినప్పుడు..
Cbn modda gudu
Why have not you published similar article on BRS who is scheduling a public gathering tomorrow i.e 27th in a big way. You only target people who are against Jagan / YCP.
ఏదైనా సరే అమరావతిలో అభివృద్ధి జరిగితే జగన్ గుండెల్లో గునపం దిగినట్లు ఉంటుంది ఎందుకో…. అభివృద్ధి పనుల ప్రారంభానికి సంబరాలకు మధ్య తేడా తెలియని అమాయకులు అని నేను అనుకోను…. కార్యక్రమం మానేసి ఆ డబ్బు దేశ రక్షణ నిధి కి ఇవ్వాలంట…. నిజంగా పరిస్థితి చెయ్యదాటిపోతే తప్పకుండా అదే పని చేస్తారు….
Neeku annadi ch..ee..kadam tappa vere pani teliyadu ani mally prove chesukunnaadu